సాక్షి,హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు, బురద జల్లే ప్రయత్నాలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని సోమవారం(సెప్టెంబర్30) ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టులో హెచ్చరించారు.
‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నా పై బురద చల్లె వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత ను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లున్నారు.గోల్కొండ కోట, చార్మినార్‌లో కూడా హరీశ్‌రావుకు వాటాలు ఉన్నాయి అని అంటారేమో?
అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా.బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’అని హరీశ్‌రావు ట్వీట్‌లో పేర్కొన్నారు.కాగా, ఆనంద కన్వెన్షన్ సెంటర్‌లో హరీశ్‌రావుకు వాటాలున్నాయని, దానిని కూల్చకుండా అడ్డుకోవడానికే పేద ప్రజలను అడ్డం పెట్టుకుని వారిని రెచ్చగొడుతున్నారని రాజ్యసభ ఎంపీ అనిల్‌యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి కౌంటర్‌గా హరీశ్‌రావు పరువునష్టం దావా పోస్టు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment