![Brs Leader Harishrao Open Letter To Minister Uttamkumar Reddy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/harishrao.jpg.webp?itok=ylD3OMP1)
సాక్షి,సిద్దిపేట:సన్నవడ్లు అమ్ముకున్న రైతులకు రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.ఈ విషయమై హరీశ్‌రావు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం(ఫిబ్రవరి 9) బహిరంగ లేఖ రాశారు. ‘అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసింది. రూ2 లక్షల రుణమాఫీ,రైతు భరోసాను మోసం చేశారు.వరంగల్ రైతు డిక్లరేషన్‌ను తుంగులో తొక్కారు.
రుణమాఫీ,రైతు భరోసా,వడ్ల బోనస్ పైసలు కూడా ఇవ్వలేదు. ఇక రైతులు రెండో పంట ఎలా వేస్తారు.బోనస్ ఇంకా రూ. 432 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు,ఉత్తర మాటలు అయ్యాయి.చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పైన ఎందుకు మాట్లాడతావ్.
కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి.రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు. కంది రైతుల మీద ఎందుకు పగ మీకు.క్రాప్ బుకింగ్‌లో మిస్సయిన రైతులకు అనుమతి ఇవ్వండి.రేవంత్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి.
విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.కాంగ్రెస్ కోతల ప్రభుత్వం. ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతదా.సీఎం ఇచ్చిన రూ 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.
ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా.కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు.ప్రభుత్వం మోసం చేసిందని అన్ని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు.తాను తవ్వుకున్న గ్యారంటీల సమాధిలోనే కాంగ్రెస్ సమాధి అవుతుంది.ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన,కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన.మాది అసలు పాలన మీది కొసరు పాలన.సంతృప్తి, సంక్షేమం బిఆర్ఎస్ పాలన,సంక్షోభం,అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment