
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ ఫ్లెక్సీల్లో హరీశ్‌రావును ప్రశ్నించారు. ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేర్లున్నాయి.
కాగా, ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో హరీశ్‌రావు ప్రకటించారు. తుదివిడత రూ.2 లక్షల రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా హరీష్‌రావు రాజీనామా అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వైరా సభలో ప్రస్తావించారు. మొత్తం 3 విడతల్లో రూ. 2లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment