runa mafi farmers
-
అధికారంలో ఉంటే అబద్దాలు నిజమవుతాయా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా? అని ప్రశ్నించారు. అలాగే, రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు? అని వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా ?రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారువందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం.రుణమాఫీ కానీ రైతన్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు?రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లిరా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్ధనోరా రోడ్డు మీద కూసున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేల్చుదాంరుణమాఫీ మాయరైతుభరోసా రూ. 7500 మాయతులం బంగారం మాయమహిళలకు రూ.2500 మాయరూ.4000 ఆసరా ఫించన్లు మాయరూ.6000 దివ్యాంగుల ఫించన్లు మాయజాగో తెలంగాణ జాగో అంటూ ఘాటు విమర్శలు చేశారు. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా ?రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారు వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం .. రుణమాఫీ కానీ రైతన్నలకు ఏం సమాధానం చెబుతుంది ?… pic.twitter.com/QmWuYgmFmK— KTR (@KTRBRS) December 22, 2024 -
సంపూర్ణ రుణమాఫీ జరిగే వరకు పోరాటం
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని పేర్కొంటూ, ఇందుకు నిరసనగా భారత్ రాష్ట్ర సమితి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రేవంత్ ప్రభుత్వం మెడలు వంచి సంపూర్ణ రైతు రుణమాఫీ జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.కేటీఆర్ చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు రైతు ధర్నాలో పాల్గొన్నారు. రైతులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆలేరు, జనగామ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేవుళ్ల మీద ఒట్లు వేసి సీఎం రేవంత్ రైతులను మోసగించారంటూ, ఆయన చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా రక్షించాలని యాదాద్రి ఆలయం తూర్పు రాజగోపురం వద్ద హరీశ్‌రావు పాప పరిహార పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు, పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొంది.ఈ సందరభంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ పరామర్శించారు. కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ధర్నా శిబిరాల్లో రైతులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఎమ్మె ల్సీలు, ఇతర నేతలు ధర్నాకు నేతృత్వం వహించారు.తిరుమలగిరిలో రాళ్లు, కోడిగుడ్లతో పరస్పరం దాడులుతిరుమలగిరి (తుంగతుర్తి): సూర్యాపేట జిల్లా తిరుమల గిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు గురువారం పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టణ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఇందుకు పోటీగా అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ శిబిరం వద్ద పలువురు నాయకులు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శిబిరం వైపు వెళ్లడానికి ప్రయత్నించారు.పోలీసులు అడ్డుకున్నప్పటికీ కొంతమంది నాయకులు బారికేడ్లను తోసుకొని శిబిరం వద్దకు వెళ్లడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసురుకున్నారు. దీంతో ప్రజలు, ఆర్టీసీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాళ్లు రువ్విన సంఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరు పార్టీల నాయకులకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి అందరినీ చెదరగొట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సాయంత్రం వరకు పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. సీఎం డైరెక్షన్లోనే బీఆర్ఎస్పై దాడులు: జగదీశ్‌రెడ్డి సంపూర్ణ రైతురుణ మాఫీ కోసం తిరుమలగిరిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే బీఆర్ఎస్పై దాడులు జరుగుతున్నా యని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
100% మాఫీ నిరూపిస్తే రాజీనామా
చేవెళ్ల: ‘రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా నీవు, నేను ఇద్దరం కలిసి వెళ్దాం.. నీ స్వగ్రామం కొండారెడ్డిపల్లి అయినా, కొడంగల్ అయినా.. సరే. రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే నేను అక్కడికక్కడే రాజీనామా చేసి వెళ్లిపోతా..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు. సంపూర్ణ రుణమాఫీ డిమాండ్‌తో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాజీ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.49 వేల కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు తెచ్చారు ‘ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎలాంటి షరతులు లేకుండా డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం చేసి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సోనియాగాంధీ మీద ఒట్టేసి చెప్పిన రేవంత్ అధికారంలోకి రాగానే తప్పించుకునే లెక్కలు చెబుతున్నాడు. మొదట రూ.49 వేల కోట్లు అని బ్యాంకర్ల సమావేశంలో గుర్తించిన తర్వాత.. ఏడాది కడుపు కట్టుకుని అయినా రూ.40 వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పాడు. ఆ తర్వాత కేబినెట్లో దానిని రూ.31 వేల కోట్లకు తగ్గించాడు. అనంతరం బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టాడు. తర్వాత కనీసం రూ.17 వేల కోట్లయినా మాఫీ అయ్యాయని అనుకుంటుండగా.. రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లే జమయ్యాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు..’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.సంపూర్ణ రుణమాఫీ కాకపోతే అదే జరుగుతుంది ‘రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు.. ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా రూ.2 లక్షల రుణ మాఫీ వర్తింపజేసే వరకూ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు గ్యారంటీలతో పాటు అదనంగా చెప్పిన 420 హామీలను సైతం అమలు చేయాలి. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన మాట లు.. ‘చెట్టుకు కట్టేసి కొడతాం’.. లాగుల్లో తొండలు వదిలిపె డతాం’. సంపూర్ణ రుణమాఫీ కాకపోతే అదే జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు లేని ఆధార్ నంబర్ల తప్పులు, రేషన్ కార్డుల తప్పులు ఇప్పుడు ఎక్కడినుంచి వచ్చాయి? రుణమాఫీ ఏమైందని, రైతుబంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారని.. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలను నిలదీయాలి..’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.100% రుణమాఫీ నిజమైతే జర్నలిస్టులపై దాడి ఎందుకు?రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన మహబూ బ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో సర్వే చేసేందుకు వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ ఇదేనా? అని ప్రశ్నించారు. వందశాతం రుణమాఫీ నిజమైతే సర్వేకు వచ్చిన జర్నలి స్టులు విజయారెడ్డి, సరితపై రేవంత్ తొత్తులు ఎందుకు దాడి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్య మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ద్రోహికి విగ్రహం పెట్టే అర్హత ఉందా?మహాత్మాగాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్టుగా ఉంటుందిఅనేక అంశాల్లో రాహుల్‌తో సీఎం రేవంత్‌కు భిన్నాభిప్రాయాలుతెలంగాణ నుంచి ప్రాంతేతరులకు పదవుల అప్పగింతబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాల యం ఎదుట ప్రతిష్ఠించాలన్నది ప్రజల కోరిక. రాహుల్‌గాంధీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు రేవంత్ తెలంగాణ జాతి మొత్తాన్ని అవమానిస్తున్నాడు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో.. తెలంగాణతల్లి విగ్ర హాన్ని రేవంత్‌రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చేవెళ్లలో రైతుధర్నాలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘ప్రధాని మోదీతో మొదలుకొని అనేక అంశాలపై రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌కు నడుమ భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. రేవంత్, రాహుల్ చర్చించుకొని అదానీ మంచివాడో.. చెడ్డవాడో చెప్పాలి. పదేళ్ల పాటు మా మెడ మీద కేంద్రం కత్తిపెట్టినా రాష్ట్రంలో అదానీని అడుగుపెట్ట నివ్వ లేదు. కానీ ప్రస్తుతం ఆయనతో రేవంత్ ప్రభుత్వం రూ.12,400 కోట్ల మేర ఒప్పందం కుదుర్చుకుంది.కాంగ్రెస్ డిక్లరేషన్లపై బీఆర్ఎస్ పోరు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు డిక్లరేషన్ల అమలు కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది. గతంలో డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ సమా వేశాలు పెట్టినచోటే సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ తరఫున కార్య క్రమాలు నిర్వహిస్తాం. రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమ లయ్యేదాకా గ్రామస్థాయి వరకు తెలంగాణ ఉద్యమకాలం నాటి నిరసన రూపాలన్నీ కొనసాగిస్తాం. ఓవైపు రుణ మాఫీ పూర్తి చేయకుండా, మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతుందని అనుకోవడం లేదు. ప్రజా అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే రేవంత్ బజారుభాష మాట్లాడుతున్నాడు.తెలంగాణ పేరును కూడా మారుస్తారాఅధికార పార్టీ నాయకులు అహంకారంతో మాట్లాడితే మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతీ పథకం పేరును మార్చడం ఖాయం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అహంకారంగా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేను. తొమ్మిది నెలల్లో సీఎం రేవంత్ 20 సార్లు ఢిల్లీకి వెళ్లి రావడం ద్వారా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బానిసలు అని రుజువు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లేకుండా చేసేందుకు రేవంత్ కుట్రలు పన్నుతున్నాడు. తెలంగాణ అనే పేరును ఏమైనా మారుస్తాడేమో చూడాలి. తెలంగాణ నుంచి అభిషేక్ సింఘ్వీని రాజ్యసభకు పంపడం మొదలుకొని అన్ని పదవులను ప్రాంతేతరులకు కాంగ్రెస్ అప్పజెప్తోంది. సింఘ్వీ తెలంగాణ కోసం కొట్లాడుతాడు అని సీఎం చెబుతున్నాడు. మరి రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎనిమిది మంది ఎంపీలు గాడిదలు కాస్తారా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. -
నీ గాడ్ ఫాదర్‌కే భయపడలేదు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీని పాక్షికంగా అమలు చేసి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెట్టి.. సీఎం నోరు పెద్దగా చేసుకుని మాట్లాడితే లాభం ఉండదు. బూతులు తిడితే రుణమాఫీ జరిగి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా. దమ్ముంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయి. తప్పు జరిగిందని రైతులకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘రుణమాఫీలో కోతలపై ప్రశ్నిస్తే మేము చావాలని రోత మాటలు మాట్లాడుతున్నాడు. నీ గాడ్ ఫాదర్‌కే భయపడలేదు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. రైతులందరికీ రుణమాఫీ వర్తించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌ను వదిలి పెట్టం. బీఆర్ఎస్ పక్షాన మరో రైతాంగ ఉద్యమానికి త్వరలో కార్యాచరణ ప్రకటించి పోరాటం చేస్తాం’ అని హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేటలో తన క్యాంపు ఆఫీసుపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.ఎక్కడికి రమ్మంటావో దమ్ముంటే చెప్పు‘రైతులందరికీ రుణమాఫీ జరిగిందని మభ్యపెడుతూ మోసగిస్తున్న రేవంత్‌రెడ్డి సిద్దిపేట, కొడంగల్ సహా ఏ నియోజకవర్గానికి ఏ తేదీన, ఏ టైమ్‌కు రావాలో దమ్ముంటే చెప్పాలి. రైతులందరికి రుణమాఫీ జరిగిందని నిరూపించాలి. ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారంటీల సంపూర్ణ అమలు చేయాలనే నా డిమాండ్‌ను పక్కన పెట్టి నేను రాజీనామా చేయాలని రంకెలు వేస్తున్నవు. రుణమాఫీ జరగని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ అధికారుల కాళ్ల మీద పడుతున్నరు.అయినా ప్రభుత్వం కళ్లు, చెవులు, నోరు లేనట్లు వ్యవహరిస్తోంది’ అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పరిపాలన ఫ్లాప్.. తొండి చేయడంలో తోపు.. బూతులు మాట్లాడ్డంలో టాప్ అన్నట్లుగా రేవంత్ పనితీరు ఉంది. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగవేసినట్లు ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రుణమాపీ అర్హుల సంఖ్య 47 లక్షలుగా చూపి, మూడు విడతల్లో 22 లక్షల మందికే వర్తింప చేశారు’ అని చెప్పారు.ప్రజలకు కీడు చేయొద్దని వేడుకుంటా..‘ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తానంటూ గుడులు, చర్చి, మసీదు సాక్షిగా హిందూ, క్రిస్టియన్లు, ముస్లింలు నమ్ముకున్న దేవుళ్లపై రేవంత్ ఒట్లు వేసి మాట తప్పి రైతు, దైవద్రోహానికి పాల్పడ్డాడు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు. అది రాష్ట్రానికి చుట్టుకుంటుందని ప్రజలు భయపడుతున్నారు. ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశం సీఎంకు లేదు కాబట్టి ఆయన చేసిన పాపం ప్రజలకు శాపం కావద్దని మా పార్టీ నేతలతో కలిసి నేను తీర్థయాత్రకు బయలుదేరుతా.ఈ పాపాత్ముడు చేసిన తప్పులకు ప్రజలకు కీడు చేయొద్దని ముక్కోటి దేవతలతోపాటు అల్లా, జీసస్‌ను వేడుకుంటా. త్వరలో పర్యటన షెడ్యూలు ప్రకటిస్తా’ అని హరీశ్ చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొందరికి రుణమాఫీ కాలేదు: మల్లు రవి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు.. ఆ విషయం తమకు తెలుసు అని కామెంట్స్ చేశారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.కాగా, ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల నిధుల కింద 1800 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఐదేళ్ళ నుంచి ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్ఎస్ పదేళ్లలో 20వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే, మా ప్రభుత్వం 31 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కొందరు రైతులకు రుణమాఫీ కాలేదనే విషయం మాకు తెలుసు. రుణమాఫీ ఫిర్యాదులపై కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తాం. రెండు లక్షలలోపు ఉన్న వారికే రుణాలు మాఫీ అవుతుంది. ఎవరికైనా మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తాం. బీఆర్ఎస్ తరహాలో రియల్ ఎస్టేట్ భూములకు రుణమాఫీ చేయం.ఇక, అందరికీ రుణమాఫీ చేసేందుకు బడ్జెట్ అందుబాటులో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులలో తెలంగాణను ముంచింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. బీజేపీ జెండా కప్పుకుని చచ్చిపోతానని రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో అన్నారని కేటీఆర్ చెప్పడం పిచ్చికి పరాకాష్ట. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. బండి సంజయ్ మాటలు వింతగా ఉన్నాయి. ఇప్పటిదాకా బండి సంజయ్ మాటలు విని ఇక నుంచి వినడం అనవసరం. కేటీఆర్‌కు పీసీసీ అనడంలో అర్థం ఉందా?. కాలేశ్వరంపై విచారణ జరుగుతోంది. ఎవరికైనా చట్ట ప్రకారమే శిక్షలు పడతాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ నేతలకూ రుణమాఫీ!!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీపై తీవ్ర చర్చ నడుస్తోంది. రుణమాఫీ చేసినట్టు హస్తం పార్టీ నేతలు చెబుతుండగా.. అర్హులకు మాఫీ కాలేదని, అసలు డబ్బులే ఇవ్వలేదని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ నేతలకు కూడా రుణాలు మాఫీ కావడం ఆసక్తికరంగా మారింది.కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారిలో కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. వారిలో మాజీ మంత్రి జోగు రామన్న, గంప గోవర్ధన్, బొడిగే గాలేయ్య, బిగాల గణేష్, పాయల్ శంకర్, దుర్గం అశోక్, హర్ష్ పటేల్ గుప్తా వంటి నేతలు ఉన్నారు. వీరిలో లక్షల్లో రుణాలు మాఫీ జరిగినట్టు సమాచారం. వీరి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు తెలుస్తోంది.వీరికి రుణమాఫీ ఇలా.. హర్ష్ పటేల్ గుప్తా: లక్షా 60వేలుజోగు రామన్న: లక్షా ఆరు వేలుగంప గోవర్ధన్: లక్షా 51వేలుదుర్గం అశోక్: 81వేలుఇదిలా ఉండగా.. రుణమాఫీపై కాంగ్రెస్ నేతలకు ప్రతిపక్ష పార్టీల నేతలు సవాల్ విసురుతున్నారు. రుణమాఫీ జరిగనట్టు ఎవరైనా చెబితే తాము వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, తాజాగా బీఆర్ఎస్ నేతల ఖాతాల్లో కూడా డబ్బులు జమ కావడంతో మిగతా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
బీఆర్ఎస్ పోరుబాట.. కాంగ్రెస్‌పై యాక్షన్ ప్లాన్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీ అంశంగా రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై పోరుబాటకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్దమవుతోంది.ఇక, తెలంగాణలో రుణమాఫీ కాని రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు తెలంగాణభవన్‌లో రుణమాఫీ పోరుబాట యాక్షన్ ప్లాన్‌పై కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
రాజీనామా ఏది..? హరీశ్‌రావుపై వెలసిన ఫ్లెక్సీలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ ఫ్లెక్సీల్లో హరీశ్‌రావును ప్రశ్నించారు. ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేర్లున్నాయి. కాగా, ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో హరీశ్‌రావు ప్రకటించారు. తుదివిడత రూ.2 లక్షల రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా హరీష్‌రావు రాజీనామా అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వైరా సభలో ప్రస్తావించారు. మొత్తం 3 విడతల్లో రూ. 2లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
TG: రైతులకు శుభవార్త.. మూడో విడతలో రుణమాఫీ నిధులు విడుదల
సాక్షి, వైరా: తెలంగాణలో మూడో విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు. 14.45లక్షల మంది రైతులకు మూడో విడతలో రుణాలను విడుదల చేశారు. ఇక, ఇప్పటికే రెండు విడతల్లో రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో రూ.12వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.👉వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 140 కోట్ల మంది స్వేఛ్చావాయువులు పీల్చేలా కాంగ్రెస్ స్వాతంత్ర్యం తెచ్చింది. ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్‌కు అడ్డా. వరంగల్ డిక్లరేషన్‌లో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ మాట్టిచ్చారు. మే 6, 2022న రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా రుణమాఫీ చేస్తున్నాం. ఎనిమిది నెలల్లోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఈరోజు రూ.18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం.. చేశాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం.. చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం. మేం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయ్యింది. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు. సీతారామ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత మాది. 2026 కల్లా సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ప్రతీ నియోజకవర్గంలో 3400 ఇళ్లను మంజూరు చేశాం. సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణకు ఇచ్చారు. ఆ గ్యారంటీలను అమలు చేయడానికి మేం కృషి చేస్తున్నాం. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలోకి విసిరేసే బాధ్యత తీసుకుంటా. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. 65వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు గాడిత గుడ్డు ఉంది. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి. బీఆర్ఎస్ను బద్దలకొడుతాం.. బీజేపీని బొందపెడతాం. 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేడు చరిత్రలో లిఖించదగిన రోజు. సాధ్యం కాదన్న రూ.2లక్షల రుణమాఫీని చేసి చూపిస్తున్నాం. రుణమాఫీ చేయలేమని అందరూ అన్నారు. కానీ, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ చేశాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం.. సంకల్పాన్ని నిజం చేశాం. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే.. ఆ డబ్బులు వడ్డీలకే సరిపోయాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ కూడా చేయలేదు. సీఎం రేవంత్ ఆదేశించిన మరుక్షణమే రైతుల ఎకౌంట్లలోకి రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ ఒక్కటే కాదు.. రైతుల సమస్యలపై కూడా దృష్టిపెట్టాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా వ్యవసాయ శాఖకు నిధులు కేటాయించాం. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య తేడాను చూడండి. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు రుణమాఫీనే నిదర్శనం. ఆర్థిక మంత్రిగా రుణమాఫీ బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయపరంగా, పారిశ్రామికపరంగా కీలక అడుగులు వేస్తున్నాం. రూ.36వేల కోట్ల పెట్టుబడులను సీఎం తీసుకువచ్చారు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రాకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేసింది. ఇందిరాసాగర్‌ను రీడిజైన్ చేసి ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. రూ.1000 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.23వేల కోట్లకు పెంచారు. డబ్బులు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ మానసపుత్రిక అని మాట్లాడుతున్నారు. ఒక్క ఎకరాకు కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వలేదు. దోపిడీ చేయడం కోసమే వాళ్లకు మానసపుత్రిక. గోదావరిపైనే ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌తో రూ.23వేల కోట్లకు అంచనాలు పెంచి దోపిడీ చేశారు. కాంగ్రెస్ ఎక్కువ ప్రాజెక్ట్‌లు కట్టిందా? బీఆర్ఎస్ ఎక్కువ కట్టిందా? అనే చర్చకు సిద్ధం. 👉మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీతారామకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. తెలంగాణలో రైతులకు ఈరోజు పండుగ రోజు. గత బీఆర్ఎస్ సర్కార్ నాలుగుసార్లు రుణమాఫీ చేస్తే మిత్తిలకు కూడా సరిపోలేదు. రూ.31వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మకం. ఆరేళ్లలోనే సీతారామ ప్రాజెక్ట్‌కు రూ.600 కోట్లు ఇచ్చాం. ఎంత ఖర్చు అయినా సరే మిగిలిన పనులు పూర్తి చేస్తాం.👉మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం సంతోషకరం. తెలంగాణలో మార్పు కోసమే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఎన్నికల కష్టాలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది.👉మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా రూ.2లక్షలు రుణమాఫీ చేయలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది. గతంలో సీతారామ ద్వారా బీఆర్ఎస్ ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదు. ఇందిర, రాజీవ్ ప్రాజెక్ట్‌లను రీడిజైన్ చేసి సీతారామ తెచ్చారు. సీతారామ ప్రాజెక్ట్‌ను పదేళ్లు సాగదీస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీతారామ పనులు వేగవంతం చేశాం. మిగిలిన సీతారామ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తాం.👉మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ప్రజా ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు గోదావరి నీటిని తీసుకొచ్చాం. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తికి కట్టుబడి ఉన్నాం అంటూ కామెంట్స్ చేశారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపు లక్షన్నరలోపు రుణమాఫీ నిధులు జమ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులకు మరో శుభవార్త అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు తెలంగాణలో రెండో విడతలో రైతులకు రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. లక్షన్నరలోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి రేపు నిధులు జమ చేయనున్నారు.కాగా, సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీ ఆవరణలో రైతుల రుణమాఫీపై చెక్కులను ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో లక్షన్నరలోపు ఉన్న రుణాలను రేపు విడుదల చేయనున్నారు. ఇక, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా రుణమాఫీపై చర్చ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. రెండు లక్షలలోపు రుణాలను వచ్చే నెలలో జమ చేయనున్నారు. -
రుణమాఫీ సరే.. వడ్డీ సంగతేంటి: హరీష్ రావు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ తొమ్మిదో తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడు నెలల కాలయాపన చేసిందన్నారు. దీంతో, రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు.కాగా, హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. డిసెంబర్ తొమ్మిదో తేదీన రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పి, ఏడు నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ… pic.twitter.com/MdHZsSeOcO— Harish Rao Thanneeru (@BRSHarish) July 26, 2024 ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఉచిత కరెంట్ ఏది.. గృహజ్యోతిలో గందరగోళం: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గృహజ్యోతి పథకంలో గందరగోళం ఏర్పడిందన్నారు. అలాగే, రేవంత్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా అనాలోచిత నిర్ణయం అని కామెంట్స్ చేశారు. కాగా, తాజాగా హరీష్‌రావు మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రతరమైంది. కరెంట్ పోతుంది అంటే తొండలు పడ్డాయి అంటున్నారు. కరెంట్ పోతుంది అంటే హరీష్ రావు కరెంట్ తీయించేస్తున్నారని చెప్తున్నారు. నిర్వహణ లేక కరెంట్ సమస్యలు వస్తున్నాయి. కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని మా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఉచిత కరెంటు ఇచ్చే వృత్తి కులాలకు ఫ్రీగా ఇవ్వటం లేదు. 91 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు గృహ జ్యోతి అందరికీ రావటం లేదు. గృహ జ్యోతి పథకంలో గందర గోళం ఏర్పడింది.ఇదే సమయంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వటం లేదు అని చెప్పాను. ఆ వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులకు జీతాలు విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు అధ్వాన్నంగా మారాయి. సమస్యలతో కొట్టు మిట్టాడుతుంది. పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం లో గ్రామ పంచాయతీలకు 270 కోట్లు ఇచ్చేవాళ్ళం. 750 కోట్లు కేంద్రం పంచాయతీ ఎన్నికలు జరపలేదని నిధులు ఆపింది.తాజా మాజీ సర్పంచులు నా దగ్గరికి వచ్చి పిర్యాదు చేసారు. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సర్పంచులు మాజీలు అయ్యారు. పంచాయతీ సెక్రటరీలు ఖర్చులు పెట్టుకొని గ్రామ పంచాయతీలు ఈ రెండు నెలలు నడిపించారు. కానీ, వారిని బదిలీలు చేస్తున్నారు. ఆ ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి వస్తాయా లేదా అనే డైలమాలో ఉన్నారు. పాఠశాలలకు కూడా కూడా నిధులు ఇవ్వకపోగా పారిశుద్ధ్యం లేక స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల పెండింగ్ బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన నిధులు ఆపడం వల్ల వడ్డీలు కట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల్లో పని చేసే సిబ్బందికి ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలు నుంచి జీతాలు లేవు.రైతు రుణమాఫీకి రేషన్ కార్డు వద్దని చెప్పాను. పాస్ బుక్ ఉంటే చాలని రాత్రికి మళ్ళీ ప్రభుత్వం చెప్పింది. కానీ గ్రౌండ్ లెవల్లో మాత్రం రేషన్ కార్డుతోనే రుణమాఫీ చేస్తున్నారు. గ్రామాల్లో లక్ష రుణమాఫీ అంశంలో దాదాపు 30 నుంచి 35 శాతం మందికి రుణమాఫీ కాలేదు. మేము చేసిన సర్వేలో ఇది తేలింది. కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి తండ్రికి రుణమాఫీ ఆపుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అర్హులందరికీ రైతు రుణమాఫీ చేయాలి. రేషన్ కార్డు నిబంధన తొలగించాలి. రైతును గుర్తించి రుణమాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
రైతులకు అలర్ట్.. వారికి రుణమాఫీ కాదు: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీపై రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలు ఉంటే నాలుగు అకౌంట్స్‌కు రుణమాఫీ జరుగుతుందని కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి తుమ్మల శనివారం సచివాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆనాడు దివంగత వైఎస్సార్ ప్రభుత్వంలో రుణమాఫీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రుణమాఫీ జరుగుతోంది. ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఆర్బీఐ తప్పిదాల వల్ల రుణమాఫీ రిజెక్ట్ అయితే 24 గంటల్లోనే వివరణ ఇస్తారు. రైతులు ఆందోళన చెందకండి. పాత పద్దతిలోనే రుణమాఫీ అమలు జరుగుతుంది.సాంకేతిక అంశాల కారణంగా ఇబ్బంది కలిగితే ప్రతీ బ్యాంక్ వద్ద అధికారులు అందుబాటులో ఉంటారు. ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలు ఉంటే నాలుగు ఖాతాల్లో రుణమాఫీ జరగుతుంది. రుణమాఫీపై కొంత మంది కావాలనే రాజకీయం చేస్తున్నారు. వారి వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ మొత్తం సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు రైతుల ఖాతాలోకి జమ అవుతాయి. మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆధార్ సాంకేతిక సమస్య ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బడాబాబులు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ కాదు. ఒకేరోజు 500 ఖాతాల్లో రుణం డబ్బులు జమ అయ్యాయి. వాటిపై విచారణ జరుగుతుంది. ఐదారు కోపరేటివ్ సొసైటీ బ్యాంకుల రుణాలపై అనుమానాలు ఉన్నాయి. అవి రెండు వేల ఖాతాలు ఉన్నాయి. 44లక్షల రైతుల ఖాతాలు, 25లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ రుణమాఫీ జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. -
సీఎం రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్.. రాజీనామా లేఖలో..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ సందర్భంగా రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తే హారీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.మరోవైపు.. సీఎం రేవంత్ కూడా రుణమాఫీ ముందుగానే చేశాం.. కానీ, సవాల్ మేరకు ఎవరూ రాజీనామా చేయాల్సిన పనిలేదని అన్నారు. దీంతో, ఈ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఏం మాట్లాడానో ఒక్కసారి చూడాలని మాజీ మంత్రి హారీష్ రావు.. కాంగ్రెస్ నేతలకు చూపించారు. తన రాజీనామా లేఖలో కూడా ఏం ఉందో చూడాలని కౌంటరిచ్చారు.సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చారు.. ‘సీఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది.👉పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది.👉నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను.మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’ అంటూ కామెంట్స్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన… pic.twitter.com/mghX3v2TES— Harish Rao Thanneeru (@BRSHarish) July 18, 2024 -
రైతు రుణమాఫీ.. కాంగ్రెస్ సంబురాలు దేనికి?: బండి సంజయ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబురాలు చేసుకుంటున్నాయి. కాగా, కాంగ్రెస్ సంబురాలపై బీజేపీ ఎంపీ సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.రైతుల రుణమాఫీపై బండి సంజయ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘ఏం సాధించారని కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకుంటుంటోంది. రబీ, ఖరీఫ్‌లో రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకా? నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా?’ అని నిలదీశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో లక్ష వరకు రుణాలు ఉన్న రైతులకు ఈరోజులు రుణమాఫీ జరిగింది. వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మరో విడతల్లో రూ.రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. -
రుణమాఫీకి రేషన్‌కార్డు కాదు.. పాసుబుక్‌లే ముఖ్యం: సీఎం రేవంత్
రుణమాఫీ నిధుల సందర్భంగా కాంగ్రెస్ నేతల కామెంట్స్ అప్డేట్స్..రైతులతో కలిసి రాహుల్ సభ..👉సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నాం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు. మరోసారి 2019లో కూడా అదే హామీ ఇచ్చి రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరోసారి రుజువైంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రుణమాఫీ చేస్తున్నాం.👉రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌లో భాగంగా రూ.2లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చుతున్నాం. నా జీవితంలో ఇది మరపురాని రోజు. రైతు రుణమాఫీ అద్భుతమైన కార్యక్రమం. ప్రభుత్వం తరఫున రైతులందరికీ కృతజ్ఞతలు. దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఇచ్చారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రూ.లక్ష వరకు తొలివిడతలో రుణమాఫీ చేస్తున్నాం. మూడు విడుతల్లో రూ.31వేల కోట్లు వచ్చే నెలలోపు రుణమాఫీ చేస్తాం. రైతు రుణమాఫీకి పాస్ పుస్తకాలే ముఖ్యం. రేషన్ కార్డు ముఖ్యం కాదు. రుణమాఫీలో సాంకేతిక సమస్యలు వస్తే అధికారులు సరిచేస్తారు. కొందరు రుణమాఫీపై అపోహాలు, అబద్దాలు చెబుతున్నారు వాటిని నమ్మకండి.👉గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రతీనెలా రూ.7వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. ఎల్లుండి ఢిల్లీ వెళ్తాను.. రాహుల్ గాంధీతో సమావేశమవుతాను. వరంగల్‌లో భారీ సభ పెడతామంటూ రైతులకు రేవంత్ చెప్పారు. ఐదు లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేద్దామన్నారు. వరంగల్‌లో రైతులతో కాంగ్రెస్ సభ జరుగుతుంది. ఈనెలాఖరులో సభకు ఏర్పాట్లు చేసుకుందామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించి సంబురాలు చేసుకుందామని రైతులను కోరారు. 👉వరంగల్ రైతు డిక్లరేషన్ ఎక్కడ చేసామో అక్కడే సభ జరుగుతుంది. వరంగల్ సభకు రాహుల్ కృతజ్ఞత సభగా నామకరణం చేశారు. రైతు రుణమాఫీ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్లమెంటులో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేశారు. రుణమాఫీ జరిగిన పలువురు రైతులకు సీఎం రేవంత్ చెక్‌లు అందజేశారు.👉ఇక, ఇదే సమయంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నవాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు. మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం.. మీ విజ్ణతకే వదిలేస్తున్నాం.👉రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుంది. ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో 29వేల కోట్లు ఖర్చు చేశాం. 👉రైతు రుణమాఫీ నిధులు విడుదల సందర్భంగా రైతువేదికల్లో ఉన్న రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పలు జిల్లాల నుంచి రైతులు నేరుగా సీఎం రేవంత్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతీ జిల్లా నుంచి రైతులు మాట్లాడారు. 👉తెలంగాణ సచివాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. పలు జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క కామెంట్స్..👉రుణమాఫీ నేపథ్యంలో రైతు లోకానికి శుభాకాంక్షలు. రైతన్నకు రుణ విముక్తి, తెలంగాణ ప్రగతికి నాంది. రైతురాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యం. కేసీఆర్ పదేళ్లలో చేయలేనిది..మేము కేవలం నెలన్నరలో చేస్తున్నాం. విపక్షాలకు మాట్లాడే నైతిక అర్హత లేదు. జై కిసాన్ జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్.. 👉నల్లగొండలో రైతువేదికలో రైతులతో కలిసి మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎం రేవంత్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేస్తూ చరిత్ర సృష్టించాం. రైతులు అప్పులాపాలు కాకుండా ఉండేందుకు రుణమాఫీ చేశాం. రూ.481 కోట్ల రూపాయల మాఫీ నల్లగొండ జిల్లాలో జరిగింది. బ్యాంకు వాళ్లు ఇబ్బందులు పెడితే అధికారులు, నా దృష్టికి తీసుకురండి. త్వరలో లక్షన్నర, రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తాం. డిండి, ఎస్సెల్బీసీ సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్..👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు ఇది పండుగ రోజు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీని నెరవేర్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ హామీని నెరవేర్చలేదు. ప్రతీ రూపాయి పోగేసి.. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్నాం. ఒకేసారి రూ.31వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. తుమ్మల నాగేశ్వర రావు కామెంట్స్..👉రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మకరోజు.. రైతులకు పండుగరోజు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎంత మంది అపహాస్యం చేసినా.. రైతుల రుణమాఫీ చేస్తున్నాం. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అత్యంత కష్టతరమైన ఈ బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేసి చూపిస్తోంది. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం. రాహుల్ గాంధీ మాట ఇచ్చారు.. మేము నెరవేరుస్తున్నాం. భవిష్యత్‌లో రైతులకు ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం. రుణమాఫీ నిధుల విడుదల..👉తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యాయి. ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 11.42 లక్షల మంది రైతుల ఖాతాలోకి ఏడు వేల కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. నేడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ కానుంది.👉కాగా, తెలంగాణ సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. పలుచోట్ల రైతువేదికల్లో ఉన్న రైతులతో మాట్లాడనున్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సంబురాల్లో పాల్గొననున్నారు. మరోవైపు.. రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. 👉ఇక, ఈ నెలాఖరులోగా రెండో విడత, ఆగస్టు మొదటి వారంలో మూడో విడతతో మిగిలిన రుణాలను మాఫీ చేయనున్నారు. రైతుల రుణమాఫీ కోసం మొత్తం రూ.31వేలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, ఆగస్టు దాటకముందే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తోంది. కాసేపట్లో రైతులతో సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. -
రుణమాఫీపై మార్గదర్శకాలు.. అది కాంగ్రెస్‌కు అలవాటే: హరీష్ రావు సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ వాళ్లు చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఇది వారికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.కాగా, తెలంగాణలో రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై హరీష్‌రావు కౌంటరిచ్చారు. కాగా, హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం. సంబంధిత వార్త: రుణమాఫీపై బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వం మార్గదర్శకాలు ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం.ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది.…— Harish Rao Thanneeru (@BRSHarish) July 15, 2024 డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నది. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే. ఎన్నికలప్పుడు మభ్య పెట్టారు, అధికారం వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ రుణమాఫీ..!
కరీంనగర్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అన్నదాతల ఆశలు ఫలించాయి. లక్షలోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా సదరు ప్రక్రియ నాలుగేళ్ల అనంతరం తుదిదశకు చేరుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధానమైంది సాగురంగమే. ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడే ఉమ్మడి కరీంనగర్‌ది ప్రత్యేక ముద్ర. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, చెరకు పంటలకు ప్రసిద్ధి కాగా చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఈక్రమంలో బ్యాంకు రుణంతోనే ఏటా రెండు పంటలను సాగు చేస్తుంటారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుండగా దిగుబడులు ఒక్కోసారి దిగదుడుపే. ఈ నేపఽథ్యంలో ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీ ప్రకటనే రైతులకు ధైర్యాన్నిస్తుండగా మాఫీ అమలు ఆగుతూ సాగింది. 2018 డిసెంబర్ 11 వరకు రూ.లక్షలోపు రుణం తీసుకున్నవారికి రుణమాఫీ ప్రకటించగా ఉమ్మడి జిల్లాలో 3,49,474 మంది లబ్ధి చేకూరనుంది. రూ.1200 కోట్ల మేర రుణమాఫీ జరగనుంది. ఆగుతూ సాగిన ప్రక్రియ టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగా నాలు గు విడతలుగా మాఫీ చేస్తామని గతంలో ప్రకటించింది. రూ.25 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు ఒకసారి, రూ.50 వేలలోపు మరోసారి, రూ.75 వేలు, రూ.లక్ష చివరిసారి ఇలా నాలుగు విడతలుగా మాఫీ ఇలా 2019లోనే సదరు ప్రక్రియ పూర్తికావాలి. కానీ.. కేవలం రూ.25 వేల లోపు రుణం తీసుకున్నవారికి మాత్రమే మొదటి విడత మాఫీ చేశారు. ఆ త ర్వాత మిగతా ప్రక్రియ ఆగిపోయింది. ఓసారి సమాచారం సేకరించడం మళ్లీ అటకెక్కించడం చేశారు. మొదటి విడతలో కరీంనగర్ జిల్లాలో 15,200 మంది లబ్ధిపొందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,663, పెద్దపల్లి జిల్లాలో 14,636, జగిత్యాల జిల్లాలో 27 వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. వడ్డీ డబ్బులు తిరిగొచ్చేనా? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కర్శకులు రుణమాఫీ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తుందని ప్రకటించడంతో చాలామంది రుణాలు తిరిగి చెల్లించలేదు. వడ్డీ డబ్బులు కడుతూ వచ్చారు. మొత్తంగా రూ.400ల కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్లు సమాచారం. ధాన్యం డబ్బులు ఖాతాలో జమైతే చాలు బ్యాంకర్లు వాటిని రుణానికి మిత్తికింద జమచేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 50 శాతానికి పైగా రైతులది ఇదే పరిస్థితి. 2019లోనే పూర్తిగా రుణమాఫీ జరగాల్సి ఉండగా నాలుగేళ్లుగా వడ్డీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ఈ క్రమంలో సదరు డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మాఫీ చేసినా పెద్దగా రైతులకు ఒరిగిందేమి లేదని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 76,791 మందికి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉండగా రాజన్న సిరిసిల్ల 57,210, పెద్దపల్లి 78,064, జగిత్యాల జిల్లాలో 76 వేల మంది రైతులు ఇప్పటికీ రెన్యువల్ కింద వడ్డీ చెల్లిస్తూ రుణాలు తీసుకుంటున్నారు. రైతుబాంధవుడు సీఎం దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా, రైతాంగ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, ఎప్ఆర్బీఎం పరిమితులు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయినా తెలంగాణలో రైతుల కోసం కృషి చేస్తున్నారు. నేడు రూ. 19 వేల కోట్ల భారాన్ని భరిస్తూ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకం. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, విత్తనాలు, ఎరువులు, కాళేశ్వరం జలాలతో రాష్ట్రాన్ని ధాన్యగారంగా తీర్చిదిద్దారు. – గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి -
టీడీపీ హయాంలో దగాపడ్డ రైతన్న
సాక్షి, చిత్తూరు రూరల్: తెలుగుదేశం రుణమాఫీ హామీ మాయలో రైతులు ఓడిపోయారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకుల్లో పరపతి కోల్పోయారు. 2014 ఎన్నికల ముందు అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న బాబు .. ఆ తర్వాత మాట మార్చి సవాలక్ష నిబంధనలతో నాలుగున్నరేళ్లు దాటినా అరకొర రుణమాఫీతో చుక్కలు చూపించారు. 2019 ఎన్నికలు సమీపిం చడంతో రైతుల ఓట్లను దండుకోవడానికి రూట్ మార్చారు. అన్నదాత సుఖీభవ అంటూ నారా మంత్రంతో మళ్లీ రైతులను నట్టేట ముంచడానికి సిద్ధమయ్యారు. అయితే మట్టిని నమ్ముకున్న రైతన్నలు నిన్ను నమ్మం బాబూ.. ఈ సారీ రైతు బిడ్డ, ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డికే మా మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 2013 డిసెంబర్ నాటికి అన్ని రకాల వ్యవసాయ రుణాలు 5,800 మంది ఖాతాల్లో రూ. 78.2 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఇవన్నీ బేషరతుగా మాఫీ చేయాలి. కానీ అలా చేయలేదు. కమిటీలు, నిబం ధనలు, షరతుల పేరుతో ఏడాది పాటు కాలయాపన చేసి మాఫీ సొమ్ముపై కొర్రీలు వేశారు. ఆంక్షల కారణంగా 4,296 మంది రైతులు మాత్ర మే రుణమాఫీకి అర్హులయ్యారు. 1,504 మంది అనర్హులని వేటు వేశారు. దీంతో వారందరూ చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తేశారు... అంతంతమాత్రంగా చేసిన మాఫీ రుణాన్ని విడతల వారీగా అంటూ మాఫీ పత్రాలతో మాయ చేశారు. ఇవన్నీ చూసి రైతులు కంగుతున్నారు. మాఫీ కోసం బ్యాంకులు వ్యవసాయశాఖ, కలెక్టరేట్, కార్యాలయాలు తిరిగి అలసిపోయారు. ఇందుకోసం రోజుల తరబడి పనులు మానేసి వేలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా చాలా మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదు. వేలాది మంది రైతులు అరకొర మాఫీకి నోచుకున్నారు. నాలుగు, ఐదు విడతలకు గాను రూ. 345 లక్షలు విడుదల కావాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటూ ఏడాదిగా ఊరిస్తున్నా అతీగతీ లేకపోయింది. ఎన్నికల మాయ.. రుణమాఫీని గాలికొదిలేసిన చంద్రబాబు తర్వాత ఎన్నికల కొత్తమాయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ రైతులను మోసం చేయడానికి అన్నదాత సుఖీభవ పేరుతో ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. రైతుల ఖాతాలోకి రూ. 1000 చొప్పున జమ చేసి రైతుల కంట్లో కారం చల్లుతున్నారు. ఇదీ కూడా అరకొరగానే జమ కావడంతో రైతాంగం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. రైతులకు నేనున్నా.. ‘రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుం డా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం రూ.12, 500 ఇస్తాం. రైతులందరకీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్‌ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. గిట్టుబాటు ధర కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం’ అంటూ ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. న్యాయం లేదు.. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోవిందరెడ్డి. చిత్తూరు మండలంలోని తాళంబేడు గ్రామం. ఇతనికి 2.33 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2012లో ఈ పొలంపై బ్యాంకులో రూ. 60 వేలు రుణం తీసుకున్నా రు. ఇందుకు గాను అతనికి వడ్డీతో కలిపి ఇప్పటి వరకు రూ. 97.50 వేలకు అప్పు చేరింది. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇతనికి రుణం పూర్తిగా మాఫీ అవుతుందని సంబరపడ్డారు. తీరా ఒక్కపైసా కూడా మాఫీ కాలేదు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన న్యాయం జరగడం లేదని గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి రుణం తీర్చుకున్నా.. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరుమొగిలిరెడ్డి. ఇతనిది మండలంలో టీ.వేపనపల్లి గ్రామం. ఎకరా పొలంకు రూ. 47 వేలు బ్యాంకులో అప్పు తీసుకున్నారు. చంద్రబాబు అమలు చేసిన రుణమాఫీ నుంచి ఇతనికి ఒక్క పైసా రాలేదు. బ్యాంకు అధికారులు కోర్టు నుంచి నోటీసులు పంపారు. చేసేదీ లేక వారి సమక్షంలో వడ్డీకి అప్పు చేసి బ్యాంకు రుణం తీర్చుకున్నారు. దీనిపై ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పేవారు లేరు. ఆశలు అడియాసలు చేశారు టీ. వేపనపల్లె గ్రామానికి ఈయన పేరు మునిరత్నం రెడ్డి ఇతనికున్న 2 ఎకరాలకు గాను రూ. 65 వేలు బ్యాంకులో అప్పు చేశారు. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి వస్తే రుణమాఫీ అవుతుందని భావించారు. బ్యాంకుకు వడ్డీ, అసలు కట్టడం మానేశారు. చివరకు వారి నిరాశే మిగిలింది. రుణమాఫీకి వీరు అర్హులు కారని ప్రభుత్వం పక్కనబెట్టింది. బ్యాంకు నుంచి ఒత్తిడి రావడంతో తీసుకున్న రుణాన్ని ఏడాది క్రితమే వడ్డీతో కలిపి చెల్లించారు. -
చేతకాకపోతే తప్పుకోండి
సాక్షి, విజయవాడ: రైతులకు న్యాయం చేయలేకపోతే గద్దె దిగండి.. మీకంటే చక్కగా పాలించే వారు చాలామంది ఉన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతును రాష్ట్రానికి రాజుగా చేద్దామని నినాదాలు చేస్తున్నారు.. నిజానికి రైతులను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారన్నారు. రూ.5వేల కోట్ల తో ధరల స్థిరీకరణ అన్నారు.. రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. నాలుగేళ్లు గడుస్తున్నా రూ.12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ అన్నారు.. కనీసం అవికూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు రైతులను రుణగ్రస్తులను చేశారని, సహకార సొసైటీలను తెలుగు తమ్ముళ్లు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు. రైతుల పేరుతో మిల్లులకు ధాన్యం అమ్మినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారని, కోట్ల రూపాయల మేర మిల్లర్లతో కలిసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని మిల్లర్లు రీసైకిల్ చేసి తిరిగి ప్రభుత్వానికే లెవీగా ఇస్తున్నారన్నారు. ఈ అక్రమార్కులకు మంత్రులే అండగా నిలుస్తున్నారని, కృష్ణాజిల్లా ముస్తాబాద్ సొసైటీలో జరిగిన అవినీతే ఇందుకు నిదర్శనమని పార్థసారథి అన్నారు. -
రైతులు చస్తుంటే షోకులా?
సచివాలయంపై జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ లేక, ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మూఢవిశ్వాసాల కోసం సచివాలయాన్ని కూల్చేసి, కొత్త భవనాలతో షోకులు చేసుకుంటారా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాల పేరిట దారిమళ్లిస్తోందని ఆరోపించారు. కేంద్రం నిధులు ఆయా పథకాలకు, లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు జీవన్‌రెడ్డి లేఖ రాశారు. కరువు మండలాల్లోని రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ నిధులను వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతన బకారుులను వెంటనే చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీకి, ఫీజు రీరుుంబర్స్‌మెంటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదన్నారు. రూ.720 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి 8 నెలలు దాటుతున్నా రైతులకు అందించలేదని విమర్శించారు. 4 నెలలుగా ఉపాధి కూలీలకు చెల్లింపుల్లేవని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులను ఇవ్వడం లేదని చెప్పారు. అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యాయా, లేదా చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.