సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ సందర్భంగా రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తే హారీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
మరోవైపు.. సీఎం రేవంత్ కూడా రుణమాఫీ ముందుగానే చేశాం.. కానీ, సవాల్ మేరకు ఎవరూ రాజీనామా చేయాల్సిన పనిలేదని అన్నారు. దీంతో, ఈ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఏం మాట్లాడానో ఒక్కసారి చూడాలని మాజీ మంత్రి హారీష్ రావు.. కాంగ్రెస్ నేతలకు చూపించారు. తన రాజీనామా లేఖలో కూడా ఏం ఉందో చూడాలని కౌంటరిచ్చారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చారు..
‘సీఎం రేవంత్ రెడ్డి గారూ!
తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది.
👉పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది.
👉నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను.
మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’ అంటూ కామెంట్స్ చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి గారూ!
తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన… pic.twitter.com/mghX3v2TES— Harish Rao Thanneeru (@BRSHarish) July 18, 2024
Comments
Please login to add a commentAdd a comment