100% మాఫీ నిరూపిస్తే రాజీనామా | KTR Open Challenge To Revanth Reddy On Runa Mafi Scheme | Sakshi
Sakshi News home page

100% మాఫీ నిరూపిస్తే రాజీనామా

Published Fri, Aug 23 2024 6:06 AM | Last Updated on Fri, Aug 23 2024 8:45 AM

KTR Open Challenge To Revanth Reddy On Runa Mafi Scheme

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌

ఏ గ్రామానికైనా ఇద్దరం కలిసి వెళ్దాం.. నీ స్వగ్రామమైనా సరే, కొడంగల్‌ అయినా సరే

రుణ మాఫీని రూ.49 వేల కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు తెచ్చారు 

వందశాతం రుణమాఫీ నిజమైతే జర్నలిస్టులపై దాడి ఎందుకని నిలదీత

చేవెళ్ల: ‘రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా నీవు, నేను ఇద్దరం కలిసి వెళ్దాం.. నీ స్వగ్రామం కొండారెడ్డిపల్లి అయినా, కొడంగల్‌ అయినా.. సరే. రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే నేను అక్కడికక్కడే రాజీనామా చేసి వెళ్లిపోతా..’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌  సీఎం రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు. సంపూర్ణ రుణమాఫీ డిమాండ్‌తో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాజీ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  
రూ.49 వేల కోట్ల నుంచి 

రూ.7,500 కోట్లకు తెచ్చారు 
‘ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎలాంటి షరతులు లేకుండా డిసెంబర్‌ 9 నాడే మొదటి సంతకం చేసి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సోనియాగాంధీ మీద ఒట్టేసి చెప్పిన రేవంత్‌ అధికారంలోకి రాగానే తప్పించుకునే లెక్కలు చెబుతున్నాడు. మొదట రూ.49 వేల కోట్లు అని బ్యాంకర్ల సమావేశంలో గుర్తించిన తర్వాత.. ఏడాది కడుపు కట్టుకుని అయినా రూ.40 వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పాడు. ఆ తర్వాత కేబినెట్‌లో దానిని రూ.31 వేల కోట్లకు తగ్గించాడు. అనంతరం బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టాడు. తర్వాత కనీసం రూ.17 వేల కోట్లయినా మాఫీ అయ్యాయని అనుకుంటుండగా.. రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లే జమయ్యాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు..’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

సంపూర్ణ రుణమాఫీ కాకపోతే అదే జరుగుతుంది 
‘రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు.. ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా రూ.2 లక్షల రుణ మాఫీ వర్తింపజేసే వరకూ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు గ్యారంటీలతో పాటు అదనంగా చెప్పిన 420 హామీలను సైతం అమలు చేయాలి. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన మాట లు.. ‘చెట్టుకు కట్టేసి కొడతాం’.. లాగుల్లో తొండలు వదిలిపె డతాం’. సంపూర్ణ రుణమాఫీ కాకపోతే అదే జరుగుతుంది. కేసీఆర్‌ ఉన్నప్పుడు లేని ఆధార్‌ నంబర్ల తప్పులు, రేషన్‌ కార్డుల తప్పులు ఇప్పుడు ఎక్కడినుంచి వచ్చాయి? రుణమాఫీ ఏమైందని, రైతుబంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారని.. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్‌ నేతలు, ఎమ్మెల్యేలను నిలదీయాలి..’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

100% రుణమాఫీ నిజమైతే జర్నలిస్టులపై దాడి ఎందుకు?
రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన మహబూ బ్‌నగర్‌ జిల్లా కొండారెడ్డిపల్లిలో సర్వే చేసేందుకు వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్‌ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ ఇదేనా? అని ప్రశ్నించారు. వందశాతం రుణమాఫీ నిజమైతే సర్వేకు వచ్చిన జర్నలి స్టులు విజయారెడ్డి, సరితపై రేవంత్‌ తొత్తులు ఎందుకు దాడి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్య మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్,  బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ద్రోహికి విగ్రహం పెట్టే అర్హత ఉందా?
మహాత్మాగాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్టుగా ఉంటుంది
అనేక అంశాల్లో రాహుల్‌తో సీఎం రేవంత్‌కు భిన్నాభిప్రాయాలు
తెలంగాణ నుంచి ప్రాంతేతరులకు పదవుల అప్పగింత
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాల యం ఎదుట ప్రతిష్ఠించాలన్నది ప్రజల కోరిక. రాహుల్‌గాంధీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు రేవంత్‌ తెలంగాణ జాతి మొత్తాన్ని అవమానిస్తున్నాడు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో.. తెలంగాణతల్లి విగ్ర హాన్ని రేవంత్‌రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. చేవెళ్లలో రైతుధర్నాలో పాల్గొన్న అనంతరం కేటీఆర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఆయన ఏమన్నారంటే.. 
‘ప్రధాని మోదీతో మొదలుకొని అనేక అంశాలపై రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌కు నడుమ భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. రేవంత్, రాహుల్‌ చర్చించుకొని అదానీ మంచివాడో.. చెడ్డవాడో చెప్పాలి. పదేళ్ల పాటు మా మెడ మీద కేంద్రం కత్తిపెట్టినా రాష్ట్రంలో అదానీని అడుగుపెట్ట నివ్వ లేదు. కానీ ప్రస్తుతం ఆయనతో రేవంత్‌ ప్రభుత్వం రూ.12,400 కోట్ల మేర ఒప్పందం కుదుర్చుకుంది.

కాంగ్రెస్‌ డిక్లరేషన్లపై బీఆర్‌ఎస్‌ పోరు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు డిక్లరేషన్ల అమలు కోసం బీఆర్‌ఎస్‌ పోరాడుతుంది. గతంలో డిక్లరేషన్‌ల పేరిట కాంగ్రెస్‌ సమా వేశాలు పెట్టినచోటే సెప్టెంబర్‌లో బీఆర్‌ఎస్‌ తరఫున కార్య క్రమాలు నిర్వహిస్తాం. రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమ లయ్యేదాకా గ్రామస్థాయి వరకు తెలంగాణ ఉద్యమకాలం నాటి నిరసన రూపాలన్నీ కొనసాగిస్తాం. ఓవైపు రుణ మాఫీ పూర్తి చేయకుండా, మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతుందని అనుకోవడం లేదు. ప్రజా అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే రేవంత్‌ బజారుభాష మాట్లాడుతున్నాడు.

తెలంగాణ పేరును కూడా మారుస్తారా
అధికార పార్టీ నాయకులు అహంకారంతో మాట్లాడితే మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ నాయకుల పేర్లతో ఉన్న ప్రతీ పథకం పేరును మార్చడం ఖాయం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అహంకారంగా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేను. తొమ్మిది నెలల్లో సీఎం రేవంత్‌ 20 సార్లు ఢిల్లీకి వెళ్లి రావడం ద్వారా కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీకి బానిసలు అని రుజువు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లేకుండా చేసేందుకు రేవంత్‌ కుట్రలు పన్నుతున్నాడు. తెలంగాణ అనే పేరును ఏమైనా మారుస్తాడేమో చూడాలి. తెలంగాణ నుంచి అభిషేక్‌ సింఘ్వీని రాజ్యసభకు పంపడం మొదలుకొని అన్ని పదవులను ప్రాంతేతరులకు కాంగ్రెస్‌ అప్పజెప్తోంది. సింఘ్వీ తెలంగాణ కోసం కొట్లాడుతాడు అని సీఎం చెబుతున్నాడు. మరి రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎనిమిది మంది ఎంపీలు గాడిదలు కాస్తారా’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement