రైతులు చస్తుంటే షోకులా?
సచివాలయంపై జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ లేక, ఇన్‌పుట్ సబ్సిడీ అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మూఢవిశ్వాసాల కోసం సచివాలయాన్ని కూల్చేసి, కొత్త భవనాలతో షోకులు చేసుకుంటారా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాల పేరిట దారిమళ్లిస్తోందని ఆరోపించారు. కేంద్రం నిధులు ఆయా పథకాలకు, లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు జీవన్‌రెడ్డి లేఖ రాశారు.
కరువు మండలాల్లోని రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతన బకారుులను వెంటనే చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీకి, ఫీజు రీరుుంబర్స్‌మెంటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదన్నారు. రూ.720 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి 8 నెలలు దాటుతున్నా రైతులకు అందించలేదని విమర్శించారు. 4 నెలలుగా ఉపాధి కూలీలకు చెల్లింపుల్లేవని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులను ఇవ్వడం లేదని చెప్పారు. అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యాయా, లేదా చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.