సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు.. ఆ విషయం తమకు తెలుసు అని కామెంట్స్ చేశారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల నిధుల కింద 1800 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఐదేళ్ళ నుంచి ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్‌ఎస్ పదేళ్లలో 20వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే, మా ప్రభుత్వం 31 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కొందరు రైతులకు రుణమాఫీ కాలేదనే విషయం మాకు తెలుసు. రుణమాఫీ ఫిర్యాదులపై కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తాం. రెండు లక్షలలోపు ఉన్న వారికే రుణాలు మాఫీ అవుతుంది. ఎవరికైనా మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తాం. బీఆర్ఎస్ తరహాలో రియల్ ఎస్టేట్ భూములకు రుణమాఫీ చేయం.
ఇక, అందరికీ రుణమాఫీ చేసేందుకు బడ్జెట్ అందుబాటులో ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులలో తెలంగాణను ముంచింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. బీజేపీ జెండా కప్పుకుని చచ్చిపోతానని రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో అన్నారని కేటీఆర్ చెప్పడం పిచ్చికి పరాకాష్ట. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. బండి సంజయ్ మాటలు వింతగా ఉన్నాయి. ఇప్పటిదాకా బండి సంజయ్ మాటలు విని ఇక నుంచి వినడం అనవసరం. కేటీఆర్‌కు పీసీసీ అనడంలో అర్థం ఉందా?. కాలేశ్వరంపై విచారణ జరుగుతోంది. ఎవరికైనా చట్ట ప్రకారమే శిక్షలు పడతాయి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment