తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రేపు లక్షన్నరలోపు రుణమాఫీ నిధులు జమ | CM Revanth Reddy To Release Rythu Runa Mafi Funds Tomorrow | Sakshi
Sakshi News home page

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రేపు లక్షన్నరలోపు రుణమాఫీ నిధులు జమ

Published Mon, Jul 29 2024 9:28 AM | Last Updated on Mon, Jul 29 2024 10:17 AM

CM Revanth Reddy To Release Runa Mafi Funds To Farmers Tomorrow

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రైతులకు మరో శుభవార్త అందించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. రేపు తెలంగాణలో రెండో విడతలో రైతులకు రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. లక్షన్నరలోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి రేపు నిధులు జమ చేయనున్నారు.

కాగా, సీఎం రేవంత్‌ రెడ్డి రేపు అసెంబ్లీ ఆవరణలో రైతుల రుణమాఫీపై చెక్కులను ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో లక్షన్నరలోపు ఉన్న రుణాలను రేపు విడుదల చేయనున్నారు. ఇక, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా రుణమాఫీపై చర్చ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. రెండు లక్షలలోపు రుణాలను వచ్చే నెలలో జమ చేయనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement