సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబురాలు చేసుకుంటున్నాయి. కాగా, కాంగ్రెస్ సంబురాలపై బీజేపీ ఎంపీ సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
రైతుల రుణమాఫీపై బండి సంజయ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘ఏం సాధించారని కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకుంటుంటోంది. రబీ, ఖరీఫ్‌లో రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకా? నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా?’ అని నిలదీశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో లక్ష వరకు రుణాలు ఉన్న రైతులకు ఈరోజులు రుణమాఫీ జరిగింది. వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మరో విడతల్లో రూ.రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment