సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీపై తీవ్ర చర్చ నడుస్తోంది. రుణమాఫీ చేసినట్టు హస్తం పార్టీ నేతలు చెబుతుండగా.. అర్హులకు మాఫీ కాలేదని, అసలు డబ్బులే ఇవ్వలేదని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్‌ఎస్ నేతలకు కూడా రుణాలు మాఫీ కావడం ఆసక్తికరంగా మారింది.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారిలో కొందరు బీఆర్‌ఎస్ నేతలు కూడా ఉన్నారు. వారిలో మాజీ మంత్రి జోగు రామన్న, గంప గోవర్ధన్, బొడిగే గాలేయ్య, బిగాల గణేష్, పాయల్ శంకర్, దుర్గం అశోక్, హర్ష్ పటేల్ గుప్తా వంటి నేతలు ఉన్నారు. వీరిలో లక్షల్లో రుణాలు మాఫీ జరిగినట్టు సమాచారం. వీరి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు తెలుస్తోంది.
వీరికి రుణమాఫీ ఇలా..
హర్ష్ పటేల్ గుప్తా: లక్షా 60వేలు
జోగు రామన్న: లక్షా ఆరు వేలు
గంప గోవర్ధన్: లక్షా 51వేలు
దుర్గం అశోక్: 81వేలు
ఇదిలా ఉండగా.. రుణమాఫీపై కాంగ్రెస్ నేతలకు ప్రతిపక్ష పార్టీల నేతలు సవాల్ విసురుతున్నారు. రుణమాఫీ జరిగనట్టు ఎవరైనా చెబితే తాము వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, తాజాగా బీఆర్‌ఎస్ నేతల ఖాతాల్లో కూడా డబ్బులు జమ కావడంతో మిగతా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment