![Tpcc Warning To Youth Congress Leaders](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/7/Maheshkumargoud1.jpg.webp?itok=htH4egCJ)
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్(Youth Congress leaders) నాయకుల దాడిపై టీపీసీసీ(TPCC) సీరియస్ అయ్యింది. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన ఉండాలి.. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవే. కానీ యూత్ కాంగ్రెస్ఇ లా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపైన దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
యూత్ నేతలను పిలిచి మందలించనున్న మహేష్ కుమార్ గౌడ్.. బీజేపీ నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరైంది కాదన్నారు. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా.. ప్రజాస్వామ్యంలో దాడులు పద్ధతి కాదు. శాంతి భద్రతల విషయంలో బీజేపీ నాయకులు సహకరించాలి’’ అని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.
కాగా, ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు.. యూత్ కాంగ్రెస్ నేతలపై కర్రలతో దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
ఇదీ చదవండి: హైకోర్టులో ఎదురుదెబ్బ..కేటీఆర్ రియాక్షన్ ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment