అందుకే బీజేపీ నేతలు భయపడుతున్నారు: టీపీసీసీ చీఫ్‌ | TPCC Chief Mahesh Kumar Goud Comments On BJP Leaders, More Details Inside | Sakshi
Sakshi News home page

అందుకే బీజేపీ నేతలు భయపడుతున్నారు: టీపీసీసీ చీఫ్‌

Published Sun, Nov 17 2024 3:38 PM | Last Updated on Sun, Nov 17 2024 4:15 PM

Tpcc Chief Mahesh Kumar Goud Comments On Bjp Leaders

గుజరాత్‌కు తెలంగాణ పోటీ వస్తుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌కు తెలంగాణ పోటీ వస్తుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కాకూడదన్నది బీజేపీ నేతల ఉద్దేశంగా ఉందన్నారు. గుజరాత్‌ గులామ్‌లా ఎందుకు వ్యవహరిస్తున్నారు. మూసీ సుందరీకరణను ఎందుకు అడ్డుకుంటున్నారు?. క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను పరిశీలించండి’’ అని మహేష్‌కుమార్‌ గౌడ్‌ హితవు పలికారు.

మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై ఆపేందుకు కుట్ర చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోటో షూట్ కోసం మూసీ నిద్ర చేశారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల, ఈగల మందు కొట్టారు. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయి. మూసీ  పక్కన మూడు నెలల బస చేయండి అని మా సీఎం సవాల్.. నేను కూడా వస్తాను. మీరు నేను ఇద్దరం కలసి మూడు నెలలు అక్కడ బస చేద్దాం రండి. అక్కడి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు.

బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిన ప్రతీ సారి కిషన్‌రెడ్డి బయటకి వస్తాడు. బీఆర్‌ఎస్‌ను ప్రొటెక్ట్ చేయడానికి కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారు?. తెలంగాణ అభివృద్ధికి అందుకు అడ్డుపడుతున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్‌కి ఒక న్యాయం.. మూసీ రివర్‌కి ఒక న్యాయమా?. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకుంటాం. వారి పిల్లలకు విద్యావకాశాలు కల్పిస్తున్నాం. గుజరాత్ గులామ్‌లా ఎందుకు వ్యవహరిస్తున్నారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందనగానే వీళ్లకు భయం పట్టుకుంది.

ఒక్కరోజు నిద్రతో అక్కడి ప్రజల అవస్థలు ఏం తెలుసుకున్నారో చెప్పండీ. డీపీఆర్‌ వచ్చాక ఎక్కడ రిటర్నింగ్ వాల్ కట్టలో తెలుస్తుంది. ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. పదేళ్లు తెలంగాణ అభివృద్ధి కుంటూ పడింది. అభివృద్ధిలో తెలంగాణ మార్పు చూస్తారు. తెలంగాణ రైజింగ్‌గా ముందుకు వెళ్తుంది. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. కిషన్‌రెడ్డి కాళ్లకు సాక్సులు వేసుకొని నిద్రపోయారు. అంటే అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అర్థం అవుతుంది.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎవరికి ఆపద వచ్చినా ఒకరిని ఒకరు పరస్పరం ఆడుకుంటున్నారు. బుల్డోజర్‌ పాలన మాది కాదు. కిషన్‌ రెడ్డి నడిపి అన్న యోగి అధిత్యనాథ్‌ది బుల్డోజర్ పాలన. నిజాం కాలంలో మూసీ బోర్డు కూడా ఉండేది. లగచర్ల దాడిలో కేటీఆర్ ఉన్నాడని స్పష్టమైంది.. కాబట్టే డైవర్ట్ చేయడానికి కిషన్‌రెడ్డి బస చేస్తున్నారు. మేము అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే నువ్వు అక్కడ ప్లాట్ కొనుక్కుంటావా కిషన్ రెడ్డి’’ అంటూ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఎద్దేవా చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement