summer temperatures
-
ఏపీలోని 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్
-
నేటి నుంచి భగభగలు.. 43 డిగ్రీల వరకు? జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. కొన్నిచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. నేడు బంగాళాఖాతంలో తుపాను ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. ఇది బుధవారం నాటికి అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. ఇది 11వ తేదీ వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుంది. ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. అదే సమయంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి వాయుగుండం ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి, సత్యసాయి జిల్లా నల్లమడ, మడకశిరలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో వేడి తాళలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. కాగా రాష్ట్రంలోని 28 మండలాల్లో బుధవారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఆయా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో మంగళవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు కేంద్రం ఉష్ణోగ్రత నల్లగొండ 40.5 ఆదిలాబాద్ 40.0 రామగుండం 39.6 ఖమ్మం 39.4 భద్రాచలం 38.2 హనుమకొండ 38.0 మెదక్ 37.8 నిజామాబాద్ 37.4 హైదరాబాద్ 36.7 మహబూబ్‌నగర్ 35.8 -
Alert: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఉక్కుపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైసద్‌లో 45.7, జగిత్యాలలోని ఐలాపూర్ 45.1 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవే ఈ ఏడాదిలో గరిష్ట ఉష్ణోగ్రతలు కావడం విశేషం. మరో పది జిల్లాల్లో సైతం 43-44 డిగ్రీల వరకు ఎండ మండిపోయింది. pic.twitter.com/Kal4GMQr3H — IMD_Metcentrehyd (@metcentrehyd) April 27, 2022 ఇదిలా ఉండగా.. గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అలాగే, శనివారం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. -
నిప్పుల కొలిమిలా రెంటచింతల@ 44.7 డిగ్రీలు!
నాడు గుంటూరు పరగణాలో ఎండుమిరప ఘాటునైనా, మండుటెండ ధాటినైనా తట్టుకొనేంత దిట్టలుండేవారట. అలాంటి దిట్టలకు కూడా ఇవాళ భానుడు ఠారెత్తిస్తున్నాడు. పౌరుషంలోనే కాదు భానుడి ప్రతాపంలోనూ పల్నాడు ఏమాత్రం తగ్గడం లేదు. ఉష్ణోగ్రతల రికార్డును మరొకరు బద్దలు కొట్టలేనంతగా ఈసారి రెంటచింతల 45.2 డిగ్రీలు దాటిపోయింది. భరణి కార్తె ఆరంభమే కాలేదు (రేపటి నుంచి), కృత్తిక రావడానికి ఇంకా 16 రోజుల గడువు ఉన్నా (వచ్చేనెల 11న) ఇప్పుడే ఎండలు బెంబేలెత్తిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రెంటచింతల(పల్నాడు): రెంటచింతల మంటచింతలగా మారిపోతోంది. భానుడి ఉగ్రరూపంతో ఈ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారడంతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. ఆదివారం గ్రామంలో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 కనిష్ట ఉష్ణోగ్రత 30.5 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 10 గంటల నుంచే ఎండకు వడగాడ్పులు తోడవడం.. భూమి నుంచి సెగ మండల వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటకు రాలేక.. ఉక్కపోతకు తట్టకోలేకపోతున్నట్లు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలింతలు, చిన్నారులు, గర్భిణుల అవస్థలు అన్నిఇన్నీ కావు. ఎండతీవ్రత నుంచి కొబ్బరిబోండాలు, చెరుకురసం, శీతల పానియాలతో కొంత వరకు గ్రామ ప్రజలు ఉపశమనం పొందుతుంటే మేతకు (పశుగ్రాసం) కోసం పొలం వెళ్లిన గేదలు ఎండ తీవ్రత తట్టుకోలేక కుంటలలో, పారుతున్న వాగులలో పడుకుని సేదతీరుతున్నాయి. గతంలో రెంటచింతల గ్రామంలో 49 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంఘటనలు ఉన్నాయి. 1920లోనే ఉష్ణోగ్రత నమోదు కేంద్రం ఎండలకు రెంటచింతల ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఎండాకాలం ఆరంభం కాగానే రాష్ట్రంలోని అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది. బ్రిటీష్ పాలకులు సైతం ఈ విషయాన్ని గమనించి రెంటచింతలలోని ఏఎల్సీకి చెందిన కాంపౌండ్‌లో ఉష్ణోగ్రత నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి అంటే పెద్దలకు వణుకే ప్రతి ఏటా వేసవి కాలం వచ్చిందంటే ఈ ప్రాంతంలోని వృద్ధులు భయందోళనకు గురౌతుంటారు. ఈ ప్రాంతంలోని భూమిలో నాపరాయి నిక్షేపాలు అత్యధికంగా ఉండటం వలనే మార్చి నుంచి మే నెలవరకు ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతకు భయటకు రాలేక.. ఉక్కపోతకు ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెట్లు నాటే కార్యక్రమాన్ని గ్రామస్తులు విజయవంతం చేసినప్పుడే వాతావరణ సమతూల్యత కారణంగా కొంతవరకు ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. –అల్లం మర్రెడ్డి, మాజీ సర్పంచ్, రెంటచింతల -
48 గంటల్లో వర్ష సూచన.. మస్తుగా ఎండలు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం గరిష్టంగా 38.2 డిగ్రీలు, కనిష్టంగా 24.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 58 శాతం నమోదైంది. మరో వారం రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 37– 38 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల రెండోవారం తర్వాత పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల్లో వైరస్ సంబంధిత జబ్బులు విజృంభించే అవకాశాలు అంతగా ఉండవని.. అయిననప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా.. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో ఆకాశం మేఘావృతం కానుంది. రానున్న 48 గంటల్లో నగరంలో అక్కడక్కడా స్వల్పంగా వర్షం పడే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా కర్ణాటక నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి, ఉత్తర ఇంటీరియర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. -
హెచ్చరికో హెచ్చరిక
ఓ వైపు ఉదయభానుడి ఉగ్రరూపం క్రమేపీ పెరుగుతోంది...ఇంకో వైపు వడదెబ్బలకు గురై పలువురు చనిపోతూనే ఉన్నారు. అధికారుల ప్రకటనలు పత్రికలకే పరిమితమై క్షేత్రస్థాయిలో ఉపశమన చర్యలేవీ కనిపించకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ దేవుడెరుగు ... కనీసం తాగునీరు కూడా అందివ్వని దుస్థితి నెలకొంది. దీంతో ప్రధాన పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా రహదారులునిర్మానుష్యంగా మారిపోతున్నాయి. కాకినాడ సిటీ: జిల్లాలో రానున్న రెండు రోజుల్లో వేసవి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీలు నమోదు కావచ్చని వెలువడిన వాతావరణ హెచ్చరిక దృష్ట్యా ప్రజలు వడదెబ్బ, ఆరోగ్య సమస్యలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాత్రి అత్యవసర ప్రకటన జారీ చేస్తూ ఇస్రో, యూరోపియన్ వెదర్ ఫోర్కాస్ట్ సంస్థలు తెలిపిన వాతావరణ సూచనల ప్రకారం ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ఎదురయ్యే ఎండ తీవ్రత, వడగాడ్పుల వల్ల ఆరోగ్య సమస్యలు, వడదెబ్బ సోకకుండా జిల్లా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కార్తికేయమిశ్రా కోరారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆరుబయట ఎండలో సంచరించవద్దని, తప్పని సరైతే ఎండ ముదిరేలోపు పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, తలపాగా తదితరాలను ఉపయోగించాలని, నలుపు రంగు మందంగా ఉండే దుస్తులకు బదులు లేత రంగుల్లో, తేలికైన నూలు వస్త్రాలను ధరించాలని కోరారు. మద్యం సేవించరాదని, ఆహారంలో మాంసాహారాన్ని తగ్గించి, తేలికగా అరుగుదలకు వచ్చే ఆకుకూరలు తినాలని విజ్ఞప్తి చేశారు. ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలన్నారు. తరచుగా పరిశుభ్రమైన నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ధ్రువ పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలని వివరించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే సత్వరం చల్లని నీడ, గాలి తగిలే ప్రదేశానికి చేర్చి తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజు ద్రావణం, లేదా ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలని సూచించారు. వడదెబ్బ తగిలి అపస్మారక స్ధితిలో ఉన్న రోగికి నీరు తాగించవద్దని, చికిత్స కోసం వీలైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలన్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలన్నారు. వడదెబ్బకులోను కాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు 3,309 చలివేంద్రాలను ఏర్పాటు చేసి చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ద్వారా 1424, ఎన్జీవోల ద్వారా 462, రెవెన్యూ శాఖ ద్వారా 219, డీఆర్డీఏ ద్వారా 191, ఆరోగ్యశాఖ ద్వారా 1013 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అత్యవసర మందులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచామని, ఆసుపత్రులు, అంగన్వాడీ, ఆశా, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది ద్వారా ఇప్పటి వరకూ సుమారు 6 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రజలకు పంపిణీ చేసినట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల వేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు బదులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులు కూడా 11 గంటలలోపే ముగించాలన్నారు. ఆ ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ పంపిణీ, షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వడదెబ్బ మరణాలుమూడే నమోదు జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా మూడు మరణాలు నమోదయ్యాయన్నారు. వడగాడ్పుల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు జీవో 75 ప్రకారం తహసీల్దార్, వైద్యాధికారి, సబ్ ఇన్స్పెక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రూ.లక్ష మంజూరు చేయనున్నట్టు కలెక్టర్ వివరించారు. దీనికి వయోపరిమితి ఏమీ లేదన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా వడగాడ్పులతో మరణిస్తే ముందు ఆరోగ్యశాఖ మెడికల్ అధికారికి తెలియజేయాలన్నారు. శవ పరీక్ష, త్రిసభ్య కమిటీ ధ్రువీకరణ అనంతరం అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. -
అగ్నిగుండంగా ఏపీ
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలతో ఆంధ్రప్రదేశ్ అగ్ని గుండాన్ని తలపించింది. ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆదివారం తిరుపతిలో 45.7 డిగ్రీల సెల్సియస్‌తో కొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది వేసవిలో ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వడదెబ్బ మరణాల సంఖ్య 500 దాటిపోయిందని అనధికార వర్గాల అంచనా. అయినా ప్రభుత్వం వడదెబ్బ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చలివేంద్రాల ఏర్పాటు చేసి మజ్జిగ అందించేందుకు జిల్లాకు మూడు కోట్లు చొప్పున 36 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని మంత్రివర్గం ప్రకటించి వారం రోజులైనా ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోడం పట్ల జిల్లాల్లో అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సెగలు.. వచ్చే మూడు రోజులు కోస్తా లోని తొమ్మిది జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రాత్రి వెబ్సైట్లో ప్రకటించింది. ప్రముఖ వేసవి విడిది కేంద్రం, ఆంధ్రా ఊటీగా పేరొందిన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ నిప్పుల కుంపటిలామారింది. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండపై ఆదివారం ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు చేరుకోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడదెబ్బకు 68 మంది మృతి భానుడి ప్రతాపంతో వడదెబ్బ బారిన పడి వివిధ జిల్లాల్లో ఆదివారం 68మంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం,శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 13 మంది చొప్పున, చిత్తూరు జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఐదుగురు, వైఎస్సార్ జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. -
సండే కూడా మండేశాడు..
► వడదెబ్బకు 48 మంది మృత్యువాత.. హైదరాబాద్‌లో నవ వరుడు కూడా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ ఉధృతమవుతూనే ఉంది. మే నెల రాకముందే ఆస్థాయి ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం తెలిపిన ప్రకారం.. రాష్ట్రంలో ఐదు చోట్ల 47 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల, కోదాడ మండలం తొగర్రి, మెట్పల్లి మండలం పెద్దవేడ, ఖమ్మం జిల్లా వైరా, వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం కోమలవంచల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 46.11, ముదిగొండ మండలం పమ్మిలో 46.58, బాణాపురంలో 46.96, బూర్గుంపాడులో 46.83, వేంసూరులో 46.15, నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం చీదెళ్లలో 46.48, మేళ్లచెరువు మండలం దొండపాడులో 46.21, పెద్దవూర మండలం పులిచెర్లలో 46.67 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం నల్లగొండలో 45.2, రామగుండం, ఖమ్మంలలో 45 చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 44.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో తీవ్రంగా వీస్తున్న వడగాడ్పులు, రాత్రి 10 గంటలైనా కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరికొన్ని రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 48 మంది మృతి.. వివిధ జిల్లాల్లో వడదెబ్బతో 48 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో 14 మంది, నల్లగొండ జిల్లాలో 12 మంది, వరంగల్ జిల్లాలో 11 మంది, ఖమ్మం జిల్లాలో నలుగురు, మెదక్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున వడదెబ్బకు బలయ్యారు. హైదరాబాద్‌లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో చంపాపేటకు చెందిన కాచీపురం రాఘవేంద్ర(34) అనే నవ వరుడు కూడా ఉన్నాడు. వడదెబ్బ చావులన్నీ ప్రభుత్వ హత్యలే: నారాయణ వడదెబ్బ చావులన్నీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ ఆరోపించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద వడదెబ్బ నివారణకుగాను హోమియోపతి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
చెన్నూర్ రూరల్ : జిల్లాలో వడదెబ్బ ధాటికి బుధవారం ఇద్దరు మృత్యువాపడ్డారు. చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి గ్రామానికి చెందిన చంటి కిష్టయ్య(28) అనే ఆటో డ్రైవర్ బుధవా రం వడదెబ్బ తగిలి మృతిచెందాడు. బంధువు ల కథనం ప్రకారం... కిష్టయ్య బుధవారం కు టుంబ సభ్యులతో కలసి మండలంలోని సుందరశాలలో గల గోదావరి నదికి స్నానం ఆచరించేందుకు వెళ్లాడు. స్నానాల తర్వాత తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ప్రభుత్వ సాయం అందేలా కృషి కిష్టయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తామని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, ఎంపీపీ మైదం కళావతి పేర్కొన్నారు. కిష్టయ్య మృతి విషయాన్ని తహశీల్దార్ దిలీప్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తాళ్లపల్లిలో వృద్ధుడు... శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియాలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన బొడ్డు రాజయ్య(70) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజయ్య మధ్యాహ్నం నస్పూర్ కాలనీలోని న్యూ కమ్యూనిటీ హాల్లో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తరువాత ఇంటికి వెళ్లే క్రమంలో నడుచుకుంటూ వెళ్తుండగా సొమ్మసిల్లి కంకర కుప్పపై పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వడబెబ్బతోనే మృతి చెందాడని భార్య రాజమ్మ పేర్కొంది. వీరికి ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్లు కలరు. మృతుడి కుటుంబ సభ్యులను సర్పంచ్ ఐత శంకర్, వార్డు సభ్యులు రుకుం తిరుమల్, ముదాం చందు పరామర్శించారు. -
ఒంటిపూట బడైనా వణుకే
♦ పెరుగుతున్న ఉష్ణోగ్రత లు ♦ పరీక్షల సెంటర్లలో మిట్టమధ్యాహ్నం బడులు ♦ పేరుకి ఒంటిపూటే .. నడిఎండలోనే ఇంటికి తిరుగుముఖం ఒంగోలు: వేసవి ఉష్ణోగ్రతలు విద్యార్థులను వణికిస్తున్నాయి. బడి వేళలు నిర్ణయించడంలో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాఠశాలలకు అయినా, ఉన్నత విద్యకు అయినా ఒకే మంత్రి ఉన్నప్పటికి పాఠశాల, కాలేజీ స్థాయి అధికారుల మధ్య సరైన అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే వేసవి వస్తే పలు పాఠశాలల విద్యార్థులు వేసవి తాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. వేళలు ఇలా : వేసవి ప్రారంభం అయిందంటే ఒంటిపూట బడులు ప్రారంభించడం ప్రతి ఏటా జరుగుతున్నదే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. బడి 12.30 గంటలకు ముగిస్తే వారికి మధ్యాహ్న భోజన ప్రక్రియ ముగిసేసరికి ఒంటి గంట లేదా 1.30 గంట అవుతుంది. అంటే వడగాడ్పులలో, మండుటెండల్లో విద్యార్థులు తిరుగుముఖం పట్టడం అంటే ఒంటి పూట బడుల ఆశయానికి గండిపడినట్లే .. నూతన వేళలూ ఇబ్బందే .. ఈ నేపథ్యంలో జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ నూతన నిర్ణయాన్ని తీసుకున్నారు. బడి వేళలను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాలని ఆదేశించారు. బడి ముగియగానే మధ్యాహ్న భోజన ప్రక్రియ ముగించి వాతావరణం మరీ వేడెక్కకముందే విద్యార్థులను ఇంటిముఖం పట్టించే పరిస్థితులకు శ్రీకారం చుట్టారు. ఒంటిపూట బడులు .. సమస్యలు 4 ఉదయం 7గంటలకే పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించడంతో సుదూర ప్రాంతాల నుంచి బస్సుల్లో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పెను సమస్యగా మారింది. 6 గంటలకే విద్యార్థులు బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ప్రహసనంగా మారింది. 4 జిల్లావ్యాప్తంగా 184 పాఠశాలల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల వల్ల ఆ కేంద్రాల్లో ఒంటిపూట బడులు ఒక ప్రహసనంగా మారింది. ఈ పాఠశాలల్లో పిల్లలు మధ్యాహ్నం ఒంటిగంటకు పాఠశాలకు హాజరుకావాల్సి వస్తోంది. 12.30 గంటలకు పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుండడంతో అప్పుడు వారికి బడిలోకి అనుమతి ఉంటుంది. మిట్టమధ్యాహ్నం ఈ పిల్లలు బడికి రావాల్సి వస్తోంది. మరి పెరిగే ఉష్ణోగ్రతల ప్రభావం ఈ పిల్లలపై ఉండదా? 4 పట్టణాల్లో ఒంటిపూట బడుల్లో పిల్లలను వదిలితే 90 శాతం మంది పిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. పల్లెల్లో తల్లిదండ్రులు పొలం బాట పడుతుండడంతో ఇంటికి వెళ్లిన పిల్లలు ఇంటిపట్టునే ఉండని పరిస్థితులు నెలకొన్నాయి. 4 తాము పొలం బాట పడుతుంటే పిల్లలు ఈతల పేరుతో చెరువులు, నీటికుంటలకు వెళుతున్నారని, అందువల్ల వారిని మీ బడిలోనే మధ్యాహ్నం ఉండనిచ్చేలా చేయాలని కోరుతున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే... ♦ గతంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య వేర్వేరు మంత్రుల పరిధిలో ఉండేవని, కాని ప్రస్తుతం ఒకే మంత్రి పరిధిలో ఉన్నందున కొంత మార్పులు అవసరమని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఇంటర్ పరీక్షలు ముగియగానే పదో తరగతి పరీక్షలు ప్రారంభిస్తే(రెండు పరీక్షల తేదీలు ఒకే రోజు రాకుండా) జాగ్రత్త వహించాల్సి ఉంటుందంటున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 184 సెంటర్లకు సంబంధించిన విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీల్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యను సులువుగా అధిగమించవచ్చనేది వారి వాదన. ♦ సాధారణంగా పది పరీక్షలు ముగియగానే విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఎలాగు ప్రైవేటు కాలేజీలు పోటీపడడం సహజం అయిన దృష్ట్యా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇందుకు సంపూర్ణ సహకారాన్ని అందించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ♦ రేకుల షెడ్లు కాకుండా కాస్త పక్కా భవనాలు ఉండి, ఫ్యాన్లు, ఏసీ తరగతి గదులు ఉన్న పాఠశాలలకు కాస్త మినహాయింపు ఇస్తే పిల్లలు నీడపట్టునే ఉంటారనేది వాస్తవం. ♦ కనీస వసతులకు సంబంధించిన అంశాలపై విద్యాశాఖ ఇకనుంచైనా శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
చెరుకు రైతు చేదు సాగు!
విద్యుత్ కోతలు సాగునీటి సంక్షోభం ఎండిపోతున్న పంట హనుమాన్‌జంక్షన్ : ఓవైపు విద్యుత్ కోతలు, మరోవైపు సాగునీటి సంక్షోభం వెరసి చెరుకు రైతును ఆందోళనకు గురిచేస్తున్నాయి.బాపులపాడు మండలంలో విద్యుత్ బోరు బావులు, వర్షాధారంపైనా ఆధారపడి చెరకు సాగు చేస్తున్నారు. వర్షాలు కురుస్తాయని, ఈ లోగా విద్యుత్ బోరు బావులతో నీరు అందించవచ్చన్న ఆశతో రైతులు చెరుకు నాట్లు వేశారు. కానీ సకాలంలో తొలకరి వర్షాలు కురవకపోవడం, తీవ్రమైన విద్యుత్ కోతలవల్ల బోరుబావులనుంచి నీరందించలేకపోవడంతో పాటు విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతలతో మొక్క, గెడలు కట్టే దశలో ఉన్న చెరుకు తోటలు ఎండిపోతున్నాయి. హనుమాన్‌జంక్షన్ శివారులో ఉన్న డెల్టా చక్కెర కార్మాగారం పరిధిలో సుమారు 8600 ఎకరాల్లో చెరుకు పంట సాగులో ఉంది. ఇప్పటికే 5100 ఎకరాల్లో పిలక తోటలు సాగులో ఉండగా, ఈ ఏడాది మరో 3500 ఎకరాల్లో మొక్క తోటలు వేశారు. బాపులపాడు మండలంలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో చెరుకు సాగులో ఉంది. మునుపెన్నడూ లేని విధంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరగటంతో మొక్కతోటలు ఎండిపోతున్నాయి. మరో పక్క గెడలు కట్టే దశలో ఉన్న పిలక తోటలకు సైతం సకాలంలో సరిపడినంత నీరందక ఎండిపోతుండడం రైతన్నకు అందోళన కలిగిస్తుంది. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరాలో కోత విధిస్తుండటంతో నీరందక చెరకు తోటలు ఎండిపోతున్నాయి. రోజుకు కనీసం మూడు, నాలుగు గంటలు కుడా విద్యుత్ సరఫరా లేకపోవటంతో మెట్టప్రాంత భూముల్లో సాగునీటి ఎద్దడి నెలకొంది. దిగుబడిపై ప్రభావం... అధిక ఉష్ణోగ్రతలు, సాగునీరు ఎద్దడి, వాతావరణ పరిస్థితులు చెరుకు పంట దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు, చక్కెర కార్మగారం యాజమాన్యం అభిప్రాయపడుతుంది. సాధారణంగా చెరుకు పంట సగటు దిగుబడి ఎకరాకు 30 టన్నులు కాగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎకరాకు 22- 25 టన్నులకు మించి దిగుబడి రావటం కష్టమని చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లో డెల్టా చక్కెర కార్మాగారం సుమారు 2.50 లక్షల టన్నుల చెరుకు దిగుబడిని ఆశిస్తుండగా, అది కాస్త 2 లక్షల టన్నులకు మించకపోవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఓ పక్క చెరుకు పంటకు సరైన గిట్టుబాటు ధరలు లభించక నష్టాలను ఎదుర్కొంటున్న రైతాంగానికి ఈ పరిస్థితులు ములిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారైంది. తొలకరి వర్షాలు కురుస్తాయన్న గంపెడాశతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.