చెన్నూర్ రూరల్ : జిల్లాలో వడదెబ్బ ధాటికి బుధవారం ఇద్దరు మృత్యువాపడ్డారు. చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి గ్రామానికి చెందిన చంటి కిష్టయ్య(28) అనే ఆటో డ్రైవర్ బుధవా రం వడదెబ్బ తగిలి మృతిచెందాడు. బంధువు ల కథనం ప్రకారం... కిష్టయ్య బుధవారం కు టుంబ సభ్యులతో కలసి మండలంలోని సుందరశాలలో గల గోదావరి నదికి స్నానం ఆచరించేందుకు వెళ్లాడు. స్నానాల తర్వాత తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
ప్రభుత్వ సాయం అందేలా కృషి
కిష్టయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తామని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, ఎంపీపీ మైదం కళావతి పేర్కొన్నారు. కిష్టయ్య మృతి విషయాన్ని తహశీల్దార్ దిలీప్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
తాళ్లపల్లిలో వృద్ధుడు...
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియాలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన బొడ్డు రాజయ్య(70) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజయ్య మధ్యాహ్నం నస్పూర్ కాలనీలోని న్యూ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తరువాత ఇంటికి వెళ్లే క్రమంలో నడుచుకుంటూ వెళ్తుండగా సొమ్మసిల్లి కంకర కుప్పపై పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వడబెబ్బతోనే మృతి చెందాడని భార్య రాజమ్మ పేర్కొంది. వీరికి ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్లు కలరు. మృతుడి కుటుంబ సభ్యులను సర్పంచ్ ఐత శంకర్, వార్డు సభ్యులు రుకుం తిరుమల్, ముదాం చందు పరామర్శించారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
Published Thu, Apr 21 2016 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement