మహారాణిపేట (విశాఖ దక్షిణ): ద్రోణి విస్తరించడం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర–దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉంది. 0.9 కిలోమీటర్లు ఎత్తు వద్ద ఇప్పటికే ద్రోణి కొనసాగుతోంది.
సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వద్ద బిహార్ తూర్పు ప్రాంతాల నుంచి ఉత్తర ప్రాంత ఒడిశా వరకు వ్యాపించి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. దీంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
చదవండి: అమరావతి జేఏసీ వెబినార్ అట్టర్ ఫ్లాప్
తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత
Comments
Please login to add a commentAdd a comment