ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి శుక్రవారమే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు (శనివారం) అల్పపీడనం కొనసాగుతుంది, మరియు దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని, రాగల 6 గంటలలో ఇది వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది.
ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈనెల 26వ తేదీ ఉదయానికి ఒడిస్సా-పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతము ప్రాంతమునకు చేరుకుంటుందని వెల్లడించింది. అదే రోజు సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన
దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా ఉండనుంది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
- సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రము
Comments
Please login to add a commentAdd a comment