
అనకాపల్లి జిల్లా నాతవరంలో 8.8, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 8.5 సెంటీమీటర్ల వర్షం పడింది. రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, విజయనగరం, కాకినాడ జిల్లాల్లో సోమవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
అనకాపల్లి జిల్లా నాతవరంలో 8.8, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 8.5 సెంటీమీటర్ల వర్షం పడింది. రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, వర్షాలు పడుతున్నా వేడి వాతావరణం ఉంటుందని వివరించింది.
చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..!