వడగళ్లు.. కడగండ్లు.. | Suddenly Rains In Vizianagaram | Sakshi
Sakshi News home page

వడగళ్లు.. కడగండ్లు..

Published Sun, Apr 21 2019 11:51 AM | Last Updated on Sun, Apr 21 2019 11:51 AM

Suddenly Rains In Vizianagaram - Sakshi

రామభద్రపురం: జిల్లాలో పలుచోట్ల శనివారం ఒక మోస్తరునుంచి భారీ వర్షం కురిసింది. వేసవితో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఊర ట లభించగా... వర్షానికి వడగండ్లు తోడవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు కూడా వీయడంతో అరటివంటి చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా బొబ్బిలి, రామభద్రపురం, శృంగవరపుకోట, లక్కవరపుకోట, సీతానగరం, బలి జిపేట మండలాల్లో ఒక మోస్తరునుంచి భారీ వర్షం కురిసింది. బొబ్బిలి పట్టణంలో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం పడే ముందు ఈదురుగాలులు ఒక్కసారి వచ్చినా వర్షం కురిసేటప్పుడు పెద్దగా గాలి లేకపోవడంతో భారీ వర్షం కురిసింది. సుమారు గంట కు పైగా వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబ డింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి. మెయిన్‌రోడ్డు నుంచి గొల్లపల్లి, చాకలివీధి, మల్లంపేట, పాత బొబ్బిలి, నా యుడు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.
 
మామిడికి భారీ నష్టం: 
బొబ్బిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి, ఈదురు గాలులకు మామిడి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. చాలా చోట్ల మామిడి కాయలు రాలిపోయి మామిడి రైతులు, కొనుగోలు దారులకు నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో చాలా చోట్ల మామిడి కాయలు రాలిపోయినట్టు రైతులు ఆవేదన చెందుతూ చెబుతున్నారు. బొబ్బి లి మండలం పారాది, మెట్టవలస, గొర్లె సీతారాంపురం, పిరిడి, అలజంగి, చింతాడ తదితర గ్రామాలలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాలలో వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలినట్లు సమాచారం అందింది. మామిడి కాయలు రాలిపోయాయి.

ఆందోళనలో మామిడి రైతులు
రామభద్రపురం మండలకేంద్రంలో అనుకోకుండా శనివారం మధ్యాహ్నం ఐదు గంటల సమయంలో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కూరగాయ రైతులకు ఈ వర్షం అనుకూలిస్తుండగా... ఈదురుగాలుల వల్ల మామిడి రైతులు నష్టపోవాల్సి వస్తోందని ఆందో ళన చెందుతున్నారు. ఈ వర్షం మెట్ట పంటలైన కూరగాయలు, మొక్కజొన్న, పల్లపు పంటలైన నువ్వులు, కట్టెజనుము పంటలకు ఎంతో ఉపయోగమని రైతులు చెబుతున్నారు.

జీడిమామిడికి అపార నష్టం
సీతానగరం: మండలంలోని పెదంకలాం, బూర్జ, వెంకటాపురం, నిడగల్లు, చెల్లన్నాయుడు వలస, నీలకంఠాపురం, మరిపివలస, దయానిధిపురం, గాదెలవలస, జానుమల్లువలస, పి.బి.పేట, గుచ్చిమి, సూరంపేట గ్రామాల్లో భారీ గాలులతో వర్షం రావడంతో పొలాల్లో పక్వదశకు వచ్చే నువ్వు పంట పూర్తిగా పాడైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నరాయుడు పేట, ఆర్‌.వెంకంపేట, సీతారాంపురం, బక్కుపేట, గుచ్చిమి, జోగింపేట గ్రామాల్లోని తోటల్లో పిందె దశలో ఉన్న జీడి, మామిడి పంట రాలి పోవడంతో తోటలు కొనుగోలు చేసినవారు లబోదిబో మంటున్నారు.

నేలరాలిన అరటి
బలిజిపేట: వడగళ్ళవాన దెబ్బకు నువ్వు పంట, అరటిపంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వడగళ్ళ వానతో పెదపెంకిలో చీకటి నారాయణ, దత్తి వెంకటరమణ, అక్కపోలు గౌరునాయుడు, రౌతు పైడిపునాయుడు, ఎం.శ్రీరాములునాయు డు, బి.బుద్ది, డి.సింహాచలం, కె.రామకృష్ణ, డి.బలరాంలకు చెందిన నువ్వుపంట ఎదకు వచ్చే సమయంలో మొత్తం నేలమట్టమయింది. చిలకలపల్లిలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. చిలకలపల్లిలో టి.రవికుమార్‌కు చెందిన అరటిపంట నేలకూలింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement