సాక్షి, విశాఖపట్నం: తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 65 కిమీ వేగంతో గాలులు విస్తాయని.. ఏపీలో అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది.
ఇక, తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు
Heavy Rain Forecast to Tirupati, Nellore Districts
Comments
Please login to add a commentAdd a comment