విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఘటన
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. నెల్లిమర్ల ఎస్‌ఐ బి.గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండవెలగాడ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న బయాలజీ ఉపాధ్యాయుడు ఎం. వెంకటరావు అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత శనివారం విద్యార్థినీని అసభ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌పై తాకాడు. దీంతో మూడు రోజులుగా బాలిక ముభావంగా ఉంటూ తిండితినడం మానేసింది.
తల్లి ఏమైందంటూ బాలికను ప్రశ్నించగా, ఉపాధ్యాయుడు తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని బయటకు చెప్పింది. ఆదివారం సెలవు కావడం, సోమవారం సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరు కావడంతో తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడితో పాటు హెచ్‌ఎంను ప్రశ్నించారు. అనంతరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కీచక ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ గణేష్, సిబ్బంది పాఠశాలకు వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఉండడం గమనార్హం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
మద్యం మత్తులో కుమార్తెపై తండ్రి లైంగిక దాడి
పెద్దముడియం: కూటమి ప్రభుత్వ విచ్చలవిడి మద్యం విధానం వావివరసలను మర్చిపోయేలా చేస్తోంది. బంధాలను, అనుబంధాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కూతురి మీదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె (16) పదో తరగతి వరకూ చదివి తల్లితో పాటు కూలి పనులకు వెళుతోంది.
ఆమె తండ్రి హమాలీ పనికి వెళుతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య లేకపోవడంతో కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు రోజులుగా కూతురు అనారోగ్యంగా ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో తండ్రి చేసిన అకృత్యాన్ని కూతురు బయటపెట్టింది. వెంటనే భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.
బాలికలపై లైంగిక దాడి చేసిన యువకుడికి పాతికేళ్లు జైలు
పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు
విశాఖ లీగల్: బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనంది మంగళవారం తీర్పు చెప్పారు. బాలికలకు నిందితుడు రూ.లక్ష చొప్పున చెల్లించాలని, ప్రభుత్వం చెరో రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు.. వివాహితుడైన అమరాపల్లి అరవింద్(25) పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర వుడా కాలనీలో నివసిస్తున్నాడు.
బాధిత బాలికలు(15, 13), వారి తల్లి.. పాత పెందుర్తి దగ్గర బీసీ కాలనీలో నిందితుడి ఇంటికి సమీపంలో ఉండేవారు. నిందితుడు బాలికలతో చాలా చనువుగా మెలిగేవాడు. ఈ నేపథ్యంలో ముందుగా పెద్ద బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2019 జూలైలో తల్లికి తెలియకుండా ఇద్దరు బాలికలనూ తన కారులో ఒంగోలు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరిపైనా లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు నేరాభి యోగపత్రంలో పేర్కొ న్నారు. విషయం తెలియడంతో బాలికల తల్లి 2019 నవంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ స్వరూపరాణి దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment