
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వల్ల కురిసిన వర్షాల ప్రభావం 9 జిల్లాల్లో 71,821 హెక్టార్లలో పంటలపై పడింది. వైఎస్సార్ కడప, అనంతపురం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలపై వర్ష ప్రభావం ఉన్నట్టు గుర్తించింది.
తక్షణమే నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించింది. 54,694 హెక్టార్లలో వరి, 12,047 హెక్టార్లలో పత్తి, 1,600 హెక్టార్లలో మినుము, 969 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment