వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
విశాఖపట్నం: వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనద్రోణి తీవ్రవాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాగ్పూర్కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని శాఖ తెలిపింది.
ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని సమాచారం. గంటకు 45-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.