సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో తూర్పు గాలులు తక్కువ ఎత్తులో రాష్ట్రం వైపు బలంగా వీస్తున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. (చదవండి: AP: దైన్యాన్ని తరిమి.. ధాన్యం భరోసా)
ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. నవంబర్ మొదటి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు.(చదవండి: బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!)
రెండో వారంలో అల్ప పీడనం
నవంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందా లేక దిశ మార్చుకుంటుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదంటున్నారు. గడచిన 24 గంటల్లో పెదకాకానిలో 79.75 మి.మీ., శృంగవరపుకోటలో 55.5, అద్దంకిలో 54.25, జీకే వీధిలో 53, అనంతగిరిలో 51, వేమనపురంలో 49, జగ్గయ్యపేటలో 48.25, చింతలపూడిలో 46.5, తాడిమర్రిలో 45.75 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment