
రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న రెండురోజుల్లో మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న రెండురోజుల్లో మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి. గురువారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.
అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. మరోవైపు డిసెంబర్ నాలుగో తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం విలీనం కానుంది. తరువాత అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్