జిల్లాలో రానున్న మూడు రోజుల్లో ఓ మాదిరిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని రేకులకుంటలోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగం శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో రానున్న మూడు రోజుల్లో ఓ మాదిరిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని రేకులకుంటలోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగం శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు 6 నుంచి 21 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. కాగా.. శనివారం విడపనకల్లులో 12.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అగళి, లేపాక్షి, చిలమత్తూరు, తాడిమర్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు తదితర 32 మండలాల్లో తుంపర్లు పడ్డాయి. జూన్ సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా.. ఇప్పటివరకు 38.7 మి.మీ నమోదైంది.