అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు రాగల నాలుగు రోజుల్లో వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు 15 నుంచి 32 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీలు, కనిష్టం 22 డిగ్రీలు ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 88 నుంచి 90, మధ్యాహ్నం 70 నుంచి 75 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.