four days
-
వారానికి 4 రోజులే పని.. కొత్త లేబర్ కోడ్ వచ్చేస్తుందా?
మోదీ ప్రభుత్వం రానున్న బడ్జెట్లో (Budget 2025-26) కొత్త లేబర్ కోడ్ (New Labor Code) నిబంధనల అమలును ప్రకటించవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రాబోయే బడ్జెట్లో లేబర్ కోడ్లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అధికార వర్గాల ప్రకారం.. ఈ కొత్త లేబర్ కోడ్లు మూడు దశల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో ఉద్యోగులకు రోజువారీ పని గంటలు పెరుగుతాయి. అలాగే వారానికి 4 రోజులే పని చేసే అవకాశం ఉంటుంది. పీఎఫ్ కోసం కట్ చేసే డబ్బు పెరిగితే ప్రతి నెలా వచ్చే జీతం తగ్గవచ్చు.మూడు దశల్లో కొత్త లేబర్ కోడ్లేబర్ కోడ్ కొత్త కొత్త విధానాలను అమలు చేయడానికి ఆయా యాజమాన్యాలకు తగిన సమయం ఇచ్చేందుకు మూడు దశల్లో దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. 2025-26 బడ్జెట్లోనే ప్రభుత్వం ఈ కోడ్లను ప్రకటిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమలులోకి వస్తుంది. ఈ లేబర్ కోడ్లు అటు యాజమాన్యాలకు అనువుగా ఉండటమే కాకుండా ఇటు ఉద్యోగులకు కూడా మెరుగైన సామాజిక భద్రత కల్పిస్తాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: Budget 2025: కొత్త ట్యాక్స్ శ్లాబ్ రాబోతోందా?మొదటి దశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు ఈ కోడ్లను అనుసరించడం తప్పనిసరి. రెండో దశలో 100-500 మంది ఉద్యోగులున్న మీడియం కంపెనీలను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. మూడో దశలో 100 మందిలోపు ఉద్యోగులున్న చిన్న కంపెనీలపై ఈ కోడ్లను అమలు చేయనున్నారు. లేబర్ కోడ్ కొత్త నియమాలు, పథకం ప్రకారం, ఈ నిబంధనలను అమలు చేయడానికి చిన్న సంస్థలకు సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. దేశ వ్యాపార నిర్మాణంలో 85 శాతం కంటే ఎక్కువ వాటా ఎంఎస్ఎంఈలు అంటే చిన్న పరిశ్రమలదే.రాష్ట్రాలతో చర్చలుఈ కోడ్లను అమలు చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే పనిలో మంత్రిత్వ శాఖ బిజీగా ఉంది. మొదటి దశలో వేతనాలు, సామాజిక భద్రతా కోడ్‌పై కోడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి అన్ని రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలు ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.ఏమిటీ లేబర్ కోడ్లు?భారత ప్రభుత్వం 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది. యాజమాన్యాలతోపాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. నాలుగు కోడ్లు ఇవే.. వేతనాలపై కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, చివరిది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్.4 రోజులు పని.. 3 రోజులు సెలవుకొత్త లేబర్ కోడ్లలో వారంలో నాలుగు రోజుల పని, మూడు రోజుల విశ్రాంతి విధానం కూడా ఉండవచ్చు. ఉద్యోగుల పని, జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే ఈ విధానం ఉద్దేశం. అయితే వారానికి నాలుగు రోజులే పని చేయాలనే నిబంధన వల్ల రోజువారీ పని గంటలు పెరుగుతాయి. మరోవైపు ప్రావిడెంట్ ఫండ్ కోసం మినహాయించే మొత్తం పెరిగే పరిస్థితిలో ఉద్యోగుల చేతికి అందే జీతం తగ్గవచ్చు. -
మణిపూర్ హింసాకాండ.. మేం 4 రోజుల్లో ఆపేవాళ్లం: రాహుల్
కలియబోర్: ప్రధానమంత్రి పదవిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఉండి ఉంటే మణిపూర్‌లో హింసకు నాలుగు రోజుల్లోనే పుల్‌స్టాప్ పడి ఉండేదని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం అస్సామ్‌లోని నగావ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తలుచుకుంటే మణిపూర్ హింసను సైన్యం సాయంతో మూడు రోజుల్లో ఆపగలిగేవారని అన్నారు. కానీ, అలా చేయడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ నాలుగు నెలలుగా మండుతున్నా, మన ప్రధాని ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదు. అదే కాంగ్రెస్ ప్రధానే ఉంటే మూడు రోజుల్లోనే అక్కడికి వెళ్లి ఉండేవారు. నాలుగో రోజుకల్లా అక్కడ హింస ఆగిపోయి ఉండేది’అని ఆయన చెప్పారు. ‘నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ, మనస్సు నిండా విద్వేషాన్ని, అహంకారాన్ని నింపుకున్న వారు త్వరలోనే కనుమరుగవుతారు’అని రాహుల్ పేర్కొన్నారు. జై శ్రీ రాం, మోదీ నినాదాలు, రాహుల్ ఫ్లయింగ్ కిస్‌లు... నగావ్ జిల్లాలో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్‌కు నిరసన సెగ తగిలింది. ఒక చోట బీజేపీ కార్యకర్తలు జై శ్రీ రాం, మోదీ, మోదీ.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌లు విసురుతూ వారిని కలుసుకునేందుకు వెళ్లారు. సంబంధిత వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. తర్వాత ర్యాలీలో మాట్లాడుతూ.. ‘సుమారు 3 కిలోమీటర్ల దూరంలో 20 నుంచి 25 మంది వరకు బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని మా బస్సు ముందుకు వచ్చారు. నేను బస్సు దిగి వచ్చే సరికి వారంతా పారిపోయారు. ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వశర్మ ఎవరొచ్చినా మేం భయపడేది లేదు’అని రాహుల్ తెలిపారు. -
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ తేదీల్లో మస్త్ వానలు!
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్లతో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో, వర్షాలు తగ్గుముఖం పట్టేలోపే.. హైదరాబాద్ వాతవరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం కారణంగా రేపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, ద్రోణి ప్రభావంతో ఈనెల 25, 26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ కురవనున్నట్టు తెలిపారు. మరోవైపు, ద్రోణి కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి.. సాయంత్రం సమయంలో వడగండ్ల కురిసే అవకాశం ఉందని స్పష్టంచేశారు. అలాగే, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశముందన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కురిసిన అకాల వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. -
ముగిసిన మౌనపోరాటం ఒక్కటైన ప్రేమజంట
సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న యువతి మౌన పోరాటం మంగళవారం ముగిసింది. యువకుడి కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పుకోవడంతో రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం పట్టణానికి చెందిన లలిత.. వెంకట్రావుపేటకు చెందిన అరుణ్ ప్రేమించుకున్నారు. కాని వివాహానికి యువకుడి కుటుంబసభ్యులు నిరాకరించడంతో లలిత కుటుంబసభ్యులతో కలిసి అరుణ్ ఇంటి ఎదుట నాలుగు రోజులుగా మౌన పోరాటం చేస్తున్నారు. మంగళవారం పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేయడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అడ్డుకొని శాంతింపజేశారు. యువకుడిని రప్పించి స్థానిక పెద్దమ్మ గుడి వద్ద రెండు కుటుంబాల వ్యక్తులు, ప్రజాప్రతినిధులు మాట్లాడి యువకుడి కుటుంబసభ్యులను వివాహానికి ఒప్పించారు. అనంతరం ఇద్దరికి నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం జరిపిస్తామని హామీ ఇవ్వడంతో యువతి కుటుంసభ్యులు శాంతించారు. -
ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు!
సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నాలుగు రోజులు తీరం ప్రాంతం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాగల నాలుగు రోజుల వాతావరణ వివరాలు: ఆగష్టు 13 వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన. ఆగష్టు 14వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగష్టు 15వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన. ఆగష్టు 16వ తేది: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. -
మహిళపై 40 మంది అత్యాచారం
చండీగఢ్: హరియాణాలోని పంచ్‌కుల జిల్లాలోని మోర్ని ప్రాంతంలో ఓ 22 ఏళ్ల వివాహితను బంధించి నాలుగు రోజుల పాటు దాదాపు 40 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగమిస్తామని చెప్పి తెలిసిన వ్యక్తి ఒకరు తన భార్యను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారని అక్కడే నాలుగు రోజుల పాటు బంధించి డ్రగ్స్ ఇచ్చి చిత్రహింసలు పెడుతూ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి భర్త మీడియాకు తెలిపారు. ‘జూలై 15 నుంచి 18 వరకు ప్రతిరోజూ 10 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడిన ఆమె నాకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పింది. నా భార్య ఇంటికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం’అని చెప్పారు. గెస్ట్‌హౌస్ యజమానితో పాటు మేనేజర్, మరొకర్ని పోలీసులు అరెస్టు చేశారు. -
వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు 4 నుంచి 21 మిల్లీమీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీలు, కనిష్టం 21 నుంచి 22 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గంటకు 2 నుంచి 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు 24 నుంచి 28 మి.మీ వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 నుంచి 32 డిగ్రీలు, కనిష్టం 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. గంటకు 7 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. -
వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు 11 నుంచి 21 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించారు. పగటి ఉష్ణోగ్రత 32 నుంచి 33 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 82 నుంచి 85, మధ్యాహ్నం 66 నుంచి 69 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొర్ర, పొద్దుతిరుగుడు, ఉలవ, పెసర, అలసంద లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవచ్చన్నారు. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటివరకు 82.8 మి.మీ నమోదైంది. -
రాగల నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు రాగల నాలుగు రోజుల్లో వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు 15 నుంచి 32 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీలు, కనిష్టం 22 డిగ్రీలు ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 88 నుంచి 90, మధ్యాహ్నం 70 నుంచి 75 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు 8 నుంచి 17 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 34, కనిష్టం 23 నుంచి 24 డిగ్రీలు ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 85 నుంచి 88, మధ్యాహ్నం 64 నుంచి 69 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 7 నుంచి 9 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
49 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా జిల్లాలోని 49 మండలాల పరిధిలో 3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దపప్పూరు 36.3 మి.మీ, తాడిపత్రి 21.4 మి.మీ, గుంతకల్లులో 14.6 మి.మీ, గార్లదిన్నెలో 11.6 మి.మీ, యాడికిలో 10.5 మి.మీ వర్షం కురిసింది. డి.హిరేహాళ్, వజ్రకరూరు, గుత్తి, పెద్దవడుగూరు, శింగనమల, పామిడి, కూడేరు, ఉరవకొండ, కనేకల్లు, గుమ్మఘట్ట, పుట్లూరు, రామగిరి, చెన్నేకొత్తపల్లి, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, అమరాపురం, రొళ్ల తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. 14 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ఇప్పటికే 96.3 మి.మీ నమోదైంది. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 215 మి.మీ గానూ 13 శాతం తక్కువగా 186.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షసూచన: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు 4 నుంచి 26 మి.మీ మేర వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. గంటకు 6 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు 14 నుంచి 23 మిల్లీమీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 7 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. -
నాలుగు రోజుల్లో వందలాది పెళ్లిళ్లు
-
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షంపడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు 10 నుంచి 35 మిల్లీమీటర్లు (మి.మీ) మేర మోస్తరు నుంచి భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 నుంచి 35 డిగ్రీలు, కనిష్టంగా 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 9 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ వర్షం కాగా శుక్రవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చిరుజల్లులు పడ్డాయి. కంబదూరు, ధర్మవరం, హిందూపురం, అమరాపురం, శింగనమల, కూడేరు, గుడిబండ, బుక్కపట్టణం, రొద్దం, కొత్తచెరువు, పామిడి, వజ్రకరూరు, లేపాక్షి, పరిగి, పుట్టపర్తి, మడకశిర, పుట్లూరు, గార్లదిన్నె, అనంతపురం, సోమందేపల్లి, గుంతకల్లు, ఓడీ చెరువు, పెనుకొండ, కళ్యాణదుర్గం, పెద్దవడుగూరు తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. -
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో 3 నుంచి 13 మిల్లీమీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 నుంచి 35 డిగ్రీలు, కనిష్టం 25 నుంచి 26 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 9 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జిల్లాకు 3 నుంచి 12 మిల్లీమీటర్లు (మి.మీ) మేర తేలికపాటి వర్ష సూచన ఉందన్నారు. -
నాలుగు రోజుల్లో తేలికపాటి వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు 5 నుంచి 7 మిల్లీ మీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టం 24 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 68 నుంచి 70, మధ్యాహ్నం 49 నుంచి 51 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 9 నుంచి 11 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు రాగల నాలుగు రోజుల్లో వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగాపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం ప్రకారం 22 నుంచి 26వ తేదీ వరకు 7 నుంచి 20 మిల్లీమీటర్లు (మి.మీ) మేర మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 నుంచి 35, కనిష్టం 23 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 69 నుంచి 73, మధ్యాహ్నం 63 నుంచి 65 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. కాగా శుక్రవారం శెట్టూరు, బ్రహ్మసముద్రం, కూడేరు, రాయదుర్గం, కనేకల్లు తదితర 10 నుంచి 15 మండలాల్లో తుంపర్లు పడ్డాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా ప్రస్తుతానికి కేవలం 23.1 మి.మీ నమోదైంది. -
రాగల నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.వపన్కుమార్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం ప్రకారం నాలుగు రోజుల్లో 2.5 మి.మీ నుంచి 34.5 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు పగలు 32 నుంచి 34 డిగ్రీలు, రాత్రిళ్లు 23 నుంచి 24 డిగ్రీలు నమోదవుతాయన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 80, మధ్యాహ్నం 40 నుంచి 51 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 11 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు 3 నుంచి 8 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 34 డిగ్రీలు, కనిష్టం 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 70 నుంచి 80, మధ్యాహ్నం 54 నుంచి 65 శాతం మధ్య ఉండొచ్చన్నారు. గంటకు 16 నుంచి 20 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఈనెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈ నాలుగు రోజుల్లో ఆకాశం మేఘావృతమై 8 నుంచి 28 మిల్లీ మీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 35 నుంచి 36 డిగ్రీలు, కనిష్టం 25 నుంచి 26 డిగ్రీలు నమోదవుతుందన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 74 నుంచి 78, మధ్యాహ్నం 40 నుంచి 49 శాతం ఉండొచ్చన్నారు. గంటకు 13 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
రాగల నాలుగు రోజుల్లో వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాకు రానున్న నాలుగు రోజుల్లో అంటే ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు వచ్చే నాలుగు రోజుల్లో 4 నుంచి 35 మి.మీ. మేర తేలికపాటి నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 79, మధ్యాహ్నం 55 నుంచి 59 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 9 నుంచి 13 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. 48 మండలాల్లో వర్షపాతం : జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి 48 మండలాల్లో వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు 22.2 మి.మీ, మడకశిర 17.7 మి.మీ, కూడేరు 14.2 మి.మీ, నల్లచెరువు 13.8 మి.మీ, బుక్కపట్నం 12.1 మి.మీ, బుక్కరాయసముద్రం 10.7 మి.మీ మేర వర్షం పడగా మిగతా మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 55.8 మి.మీ నమోదైంది. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంటలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 7 నుంచి 35 మిల్లీమీటర్ల (మి.మీ) మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 31-32 డిగ్రీలు, కనిష్టం 22 -24 డిగ్రీల మధ్య నమోదుకావచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 76 -78, మధ్యాహ్నం 54- 59 మధ్య ఉంటుందన్నారు. గంటకు 12 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. -
నాలుగు రోజుల్లో తేలికపాటి వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు నాలుగు రోజుల్లో అక్కడక్కడ 2 నుంచి 7 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41, రాత్రిళ్లు 25 నుంచి 26 డిగ్రీల మేర ఉండొచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 69, మధ్యాహ్నం 33 నుంచి 35 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. గంటకు 12 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
నాలుగు రోజుల్లో వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు వచ్చే నాలుగు రోజుల్లో 5 నుంచి 35 మి.మీ మేరకు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గురువారం వర్షసూచన ఎక్కువగా ఉందని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 36, రాత్రిళ్లు 25 నుంచి 28 డిగ్రీలు, గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 82, మధ్యాహ్నం 38 నుంచి 56 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. 4 నుంచి 28 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా అందులో 20, 21 తేదీల్లోనే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని వివరించారు. -
వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగం శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి సమాచారం అందినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు రోజులూ ఆకాశం మేఘావృతమై 4 నుంచి 21 మిల్లీమీటర్ల మేర వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుంచి 39, కనిష్టం 26 నుంచి 27 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని పేర్కొన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 69 నుంచి 74, మధ్యాహ్నం 40 నుంచి 43 మధ్య ఉంటుందని, గాలులు గంటకు 9 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వివరించారు. -
నాలుగు రోజుల్లో వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుందన్నారు. 7 నుంచి 28 మి.మీ మేర తేలికపాటి నుంచి చెప్పుకోదగ్గ వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు గరిష్టం 38 నుంచి 40 డిగ్రీలు, కనిష్టం 26 నుంచి 27 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 62 నుంచి 65, మధ్యాహ్నం 40 నుంచి 42 శాతం మధ్య ఉండవచ్చని తెలిపారు. గంటకు 7 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు శుక్రవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్ విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 29 నుంచి మే 3వతేదీ వరకు 5 నుంచి 7 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా కాస్తంత పెరిగే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలు, కనిష్టంగా 24 నుంచి 25 డిగ్రీలు నమోదుకావచ్చన్నారు. గంటకు 7 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. -
నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 26 నుంచి 29 తేదీల మధ్య కొన్ని ప్రాంతాల్లో 2 మి.మీ. నుంచి 10 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 32 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 21 డిగ్రీల మధ్య నమోదుకావచ్చని తెలిపారు. కాగా జిల్లాలో చలితీవ్రత ఇంకా కొనసాగుతోందన్నారు. మంగళవారం తనకల్లులో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. మిగతా మండలాల్లో 12 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదైనట్లు తెలిపారు. -
నాలుగురోజుల్లో పాస్‌పోర్ట్
అమెరికాలో ఉన్న తమ కుమారుడు,కుమార్తె దగ్గరకు వెళ్లాలని ఓ తల్లిదండ్రి ఆశ.. లండన్‌లో ఉంటున్న మనువడు,మనుమరాలిని చూడాలని తాత నాయనమ్మ ఆరాటం.. రష్యాకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలని మరో యువకుడి అభిలాష. ఇలా ఎవరైనా విదేశాలకు వెళ్లేవారికి పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఇది ఉంటే ఆశయం, ఆకాంక్ష నెరవేరుతుంది. వారి కలను నెరవేర్చేందుకు ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న నాలుగురోజుల్లోనే అభ్యర్థులకు పాస్‌పోర్ట్ అందిస్తూ మన్ననలు పొందుతున్నారు. నల్లగొండ క్రైం : గతంలోపాస్ పోర్టు పొందాలంటే కనీసం 3 నెలల సమయం పట్టేది. విదేశాల్లో ఉన్నవారి వద్దకు వెళ్లాలనే కల కొన్ని సందర్భాల్లో కలగానే ఉండేది. చోట.మోట నాయకుడిని పట్టుకుని తృణమో...ఫలమో అప్పగించి పాస్‌పోర్టు పొందేవారు. ఆర్థికంగా ఇబ్బంది పడటంతో పాటు నెలల తరబడి పాస్‌పోర్టు కోసం అనేక కార్యాలయాలు తిరిగేవారు. డబ్బు ఉన్న మహరాజుకే పాస్‌పోర్టు అందేది. సామాన్యుడికి అందడం కష్టం అనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. వెరీఫాస్ట్గా.. నేడు సామాన్యుడికి పాస్‌పోర్టు అందే విధంగా వెరిపాస్ట్ ఇన్సాఫ్ట్వేర్ ద్వారా దరఖాస్తు చేసుకున్న నాలుగురోజుల్లోనే పాస్‌పోర్టు చేతికి అందుతోంది. వెరీఫాస్ట్గా ఐపాడ్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు విచారణ పోలీసులు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేశారు. దరఖాస్తు దారుడి వివరాలు, నేరచరిత్ర, నేర అభియోగాలు, కేసులు, పెండింగ్ కేసులు, వ్యక్తి ప్రవర్తన తదితర అంశాలు అ న్ని ఇంటెలిజెన్స, ప్రత్యేక పోలీసులు, ఆయా ప్రాంత పోలీసులు విచారణ చేస్తారు. వారి నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు కేంద్ర కార్యాలయం నుంచి పాస్‌పోర్టు చేతికి అందుతోంది. ఈ విషయమై విదేశాల్లో ఉన్న వారికి చెబితే డాడి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసి రెండు నెలలు తిరిగావు...ఇప్పుడు నాలుగు రోజుల్లో ఎలా సాధ్యమరుు్యంది ? ఏమైన పైరవీ చేశావా లంచం ఎంత ఇచ్చావు ? అని తండ్రితో కుమారుడు అన్న మాటలవి. విచారణ ఇలా .. దరఖాస్తు దారుడు ఇచ్చిన అడ్రస్ ఆధారంగా ప్రత్యేక పాస్‌పోర్టు అధికారి ఇంటికి వెళ్లి విచారణ చేస్తాడు. ఇంటి ముందు నిలబెట్టి ఐపాడుతో ఫొటోతీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాడు. అదే సమయంలో అన్ని విభాగాలు విచారణ చేస్తారుు. అంతా ఆన్లైన్లో కేంద్ర పాస్‌పోర్టు కార్యాలయానికి చేరవేస్తారు. దరఖాస్తు దారుడిని విచారణ అధికారి సెల్‌నంబర్, పేరు, ఏ సమయానికి వస్తారో అన్న సమాచారం అభ్యర్థి ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా చేరుతుంది. జనవరి నుంచి నేటి వరకు 10026 దరఖాస్తులను విచారించి పాస్‌పోర్టు అందజేయడంతో జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉంది. ఫీడ్ బ్యాక్ సేకరణ.. పాస్‌పోర్టు ఇచ్చే సమయంలో అభ్యర్థి దగ్గర సంబంధిత అధికారులు డబ్బులు అడిగారా? పాస్‌పోర్టు ఇవ్వడానికి డబ్బుల కోసం తిప్పించుకున్నారా? విచారణకు వస్తున్నట్లు ఎస్ఎంఎస్ వచ్చిన దాని ప్రకారం విచారణ అధికారి వచ్చారా ? లేదా ? అన్న విషయం పై ఎస్పీ స్వయంగా అభ్యర్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకుని ప్రక్షాళన చేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది గతంలో నా కుమార్తె పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే 45 రోజులు పట్టింది. తెలిసిన వారితో సంప్రదించి పాస్‌పోర్టు పొందడంలో ఇబ్బంది ఉండేది. నేను దరఖాస్తు పెట్టుకున్న నాలుగు రోజుల్లో పాస్‌పోర్టు చేతికందడం ఆశ్చర్యంగా ఉంది. - కృష్ణవేణి, అబ్బాసియాకాలనీ ఏ ఒక్కటి లేకపోయినా.. స్లాట్‌బుక్ అయిన తరువాత నిర్ణీత తేదీరోజు దరఖాస్తులు పొందుపర్చిన ఆధారంగా అన్ని ఓరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుపోవాలి. ఏ ఒక్కటి లేకపోయినా ఆలస్యమవుతుంది. విచారణ సమయంలో సరైన ధ్రువపత్రాలు ఇవ్వనందుకు పాస్‌పోర్టు అందడం వారం పట్టింది. - ఆలెగ్జాండర్ , నల్లగొండ ఇంత ఫాస్ట్‌గా వస్తుందనుకోలేదు నాలుగు రోజుల్లో పాస్‌పోర్టు వస్తుందని నాకు తెలియదు. పాస్‌పోర్టు చేతికి అందగానే ఆశ్చ ర్యం అనిపించింది. గతంలో మా బంధువులు పాస్‌పోర్టు పొందడానికి 3 నెలల సమయం పట్టింది. - సీఐ సురేష్‌బాబు, సీసీఎస్ అంతా ఆన్లైన్ ద్వారా.. పాస్‌పోర్టు ఆఫీస్ నుంచి జిల్లా కార్యాలయానికి ఆన్లైన్లో సమాచారమం దుతుంది. దరఖాస్తుదారుడి వివరా లు అతని ప్రాంత పోలీసుస్టేషన్లకు ,ఎస్ బి అధికారికి ఆన్లైన్లో ఐప్యాడ్ అందిం చి విచారణ చేపట్టి కేంద్ర కార్యాలయాని కి అందజేస్తాం. -ధనుంజయ ఎస్బి సీఐ -
నాలుగు రోజుల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రారెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 14, 15, 16 తేదీల్లో 10 నుంచి 20 మి.మీ మేర వర్షసూచన ఉందన్నారు. -
జిల్లాలో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో ఓ మాదిరి వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 31, వచ్చే నెల 1, 2 తేదీల్లో 5 నుంచి 22 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావచ్చునన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35, రాత్రిళ్లు 18 నుంచి 21 డిగ్రీలు , గాలిలో తేమ ఉదయం 53 నుంచి 80, మధ్యాహ్న సమయంలో 46 నుంచి 74 శాతం మధ్య ఉండవచ్చునన్నారు. వర్ష సూచనలు ఉన్నందున నాలుగు రోజుల పాటు వేరుశనగ పంట తొలగింపు, కొర్ర, సజ్జ లాంటి పంట కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తొలగించిన పంటను ఎండబెట్టుకుని వెంటనే వాములు వేసుకుని అవకాశం ఉంటే టార్పాలిన్లతో కప్పిపెట్టుకోవాలన్నారు. -
పెరుగుతున్న ‘సింగూర్’ మట్టం
ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పుల్కల్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగూర్ ప్రాజెక్టులోకి భారగా వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టులోకి 3 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 30 టీఎంసీలు కాగా.. సాంకేతిక కారణాల దృష్ట్యా 29 టీఎంసీలే నిల్వ చేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున 12.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం 9.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ఽఫ్లో 19 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని ఈఈ రాములు తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటన భారీగా వరద నీరు చేరుతున్న సింగూర్ ప్రాజెక్టును కలెక్టర్ రోనాల్డ్‌రోస్ శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 9.5 టీఎంసీల నీరు ఉందని కలెక్టర్‌కు ఇరిగేషన్ ఎస్ఈ పద్మారావు తెలిపారు. అక్కడి నుంచి కొండపూర్ మండలం మల్కపూర్ చెరువును కలెక్టర్ పరిశీలించారు. చెరువులో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షంతో 10 అడుగుల నీరు వచ్చి చేరిందని కలెక్టర్ అధికారులు వివరించారు. -
12న జిల్లా హాకీ జట్టు ఎంపిక
భీమవరం : జూనియర్, సబ్ జూనియర్ బాలికల 7వ అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఈనెల 12నlభీమవరం సెయింట్æమేరీస్ స్కూల్లో ఎంపిక చేయనున్నట్టు జిల్లా హాకీ క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆరేటి రామకృష్ణప్రకాష్, గద్దే సతీష్‌బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 29వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు అనంతపురంలో అంతర్ జిల్లాల పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జూనియర్ విభాగంలో పాల్గొనే క్రీడాకారులు 1998కి ముందు, సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనేవారు 2001కి ముందు జన్మించి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 94922 95396 నంబర్లో సంప్రదించాలని ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లు అప్పారావు పేర్కొన్నారు. -
ఇప్పట్లో వర్షాల్లేవ్
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు లేవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలు నమోదవుతాయన్నారు. గాలిలో తేమ ఉదయం 81 నుంచి 86, మధ్యాహ్నం 69 నుంచి 73 శాతం మధ్య ఉండవచ్చని తెలిపారు. గంటకు 15 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కాగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో తుంపర్లు పడ్డాయి. సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గానూ ప్రస్తుతానికి 3.8 మి.మీ నమోదైంది. -
నాలుగు రోజుల్లో వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: రానున్న నాలుగు రోజుల్లో నాలుగు నుంచి 6 మి.మీ మేర అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అలాగే ఉష్ణోగ్రతలు కాస్తంత పెరిగి పగలు 36 నుంచి 37 డిగ్రీలు, రాత్రిళ్లు 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. -
బ్యాంకులకు వరుస సెలవులు.. ఏటీఎంలలో సందడి
న్యూఢిల్లీ: సాధారణంగా బ్యాంకులకు ఒకటి రెండు రోజులు సెలవులు వస్తేనే సాధారణ ప్రజలు ఇబ్బందులు పడతారు. కానీ మార్చిలో వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. మార్చి 24 నుంచి 27 వరకు బ్యాంకులకు సెలవులు కావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు కాస్త విరామం రానుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ముందుగానే జాగ్రత్త పడి ఏటీఎంలపై వైపు పరుగులు తీసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వరుస సెలవుల కారణంగా జాగ్రత్తగా నగదు నిల్వకు బ్యాంకులు ప్లాన్ చేయకపోతే వినియోగదారులకు సమస్యలు తప్పవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎంలలో నగదు లోడింగ్‌ను ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో ఆయా బ్యాంక్ ఏటీఎంలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఆ నాలుగు రోజులు సెలవులు ఇవే.. ♦ మార్చి 24 గురువారం హోలీ ♦ మార్చి 25 శుక్రవారం గుడ్ ఫ్రైడే ♦ మార్చి 26 నాలుగో శనివారం, 27 ఆదివారం ప్రస్తుతం నెలలో రెండు శనివారాలు బ్యాంకులకు సెలవు, మరో రెండు శనివారాలు పూర్తి పని వేళలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కార్యాలయానికి తాళం!
అట్లూరు: నాలుగు రోజులు తాగునీటి సరఫరా లేకపోవడంతో వారు నానా అగచాట్లు పడ్డారు. ఇదేమీ పట్టనట్లున్న అధికారుల తీరుపై ఆవేదన ఆక్రోషం పెల్లుబికారుు. విన్నపాలకు వినని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఎమ్పీడీఓ కార్యాలయూనికి తాళం వేసి తమ ఆవేదనను తెలియజెప్పారు. మండల కేంద్రమైన అట్లూరు గ్రామస్థులు మంగళవారం ఖాళీ బిందెలతో వచ్చి ఎంపిడిఓ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం అక్కడే నిలబడి ఆందోళన చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు బిల్లులు చెల్లించలేదంటూ నాలుగు రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్తు మోటార్లకు సరపరా నిలిపి వేశారన్నారు. ఫలితంగా తాగునీటి సరఫరా ఆగిపోరుుంది. దీనిపై ఇంతవరకూ ప్రజా ప్రతినిధులు గాని అధికారులుగానీ పట్టించుకున్న పాపానపోలేదన్నారు. తాగు నీటికోసం అల్లాడుతున్నా ఎవరూ స్పందించలేదన్నారు. గత్యంతరంలేక ఎంపిడిఓ కార్యలయానికి తాళం వేసి ఇలా నిరసన తెలిపామన్నారు. ఆ సమయంలో ఎంపిడిఓ మధుసూధన్‌రెడ్డి కలెక్టరు కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యేందుకు కడపకు వెళ్లడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి తహసిల్దారు మాధవకృష్ణారెడ్డికి సమస్యను వివరించారు. స్పందించిన ఆయన ఎంపిడిఓతో పాటు ఉన్నత అధికారులకు తాగునీటి సమస్య తెలియ జేశారు. ఎంపిడిఓ మధుసూదన్‌రెడ్డి జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ట్రాన్సుకో ఎస్ఈతో చర్చించి సత్వరం విద్యుత్తు సరఫరా పునఃరుద్దరించాలని సూచించారు. ఈ మేరకు ఎంపిడిఓ ఫోన్లో తెలపడంతో ఆందోళన విరమించారు. -
ఆ నాలుగు రోజులూ పెళ్లి సందడే
అమలాపురం :వచ్చేది శూన్యమాసం.. నాలుగు నెలల పాటు శుభకార్యాలు నిర్వహించే అవకాశం లేదు. అందుబాటులో రెండు బ్రహ్మాండమైన ముహూర్తాలు. ఇం కేం.. ముందుగా కుదుర్చుకున్నవారే కాకుండా ఇప్పటికిప్పుడు సంబంధాలు కుదుర్చుకున్నవారూ తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో వచ్చే వారంలో జిల్లాలో పెళ్లి భాజాలు ఘనంగా మోగనున్నాయి. ఈనెల 13, 14,15,19 తేదీల్లో శుభముహూర్తాలు రావడంతో జిల్లాలో వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిళ్లే కాదు.. గృహప్రవేశాలు, కొత్త వ్యాపార సంస్థలు, దుకాణాల ఆరంభం వంటి కార్యక్రమాలు జోరుగా సాగనున్నాయి. 13వ తేదీన రాత్రి 7.54 గంటలకు, 12.33 గంటలకు, 14న రాత్రి 7.54, అర్ధరాత్రి 12.36, తిరిగి తెల్లవారు జామున 3.21కి, 15న రాత్రి 12.29కి, 19న తెల్లవారు జామున నాలుగు గంటలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో 14న తెల్లవారుజామున 3.21, 15న అర్ధరాత్రి 12.29 గంటల ముహూర్తాలు మిథునలగ్నంలో రావడంతో ఈ రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి శూన్య మాసం మొదలవుతోంది. దీంతో డిసెంబర్ వరకూ ముహూర్తాలు లేవు. డిసెంబరులో ముహూర్తాలున్నా అవి చెప్పుకునేంత పెద్దవి కావు. బలమైన ముహూర్తాలు కావాలంటే ఫిబ్రవరి, మార్చి వరకూ వేచి చూడాల్సిందే. ఈ కారణాల వల్లే ఈ నాలుగు రోజుల్లో పెళ్లిళ్లు గృహప్రవేశాలు పూర్తి చేస్తున్నారు. 14న ఒక్కరోజే జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వెయ్యి వరకు వివాహాలు జరగనున్నాయి. మిగిలిన ముహూర్తాల సమయంలో కూడా భారీగానే పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. అమలాపురం శ్రీభూసమేత వెంకటేశ్వరరావు ఆలయంలో 150 వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. సమయం దగ్గర పడే నాటికి వీటి సంఖ్య ఇంకా పెరుగుతుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అన్నీ గిరాకీనే అటు పెళ్లిళ్లు.. ఇటు గృహప్రవేశాలు.. వేలాది సంఖ్యలో జరుగుతుండడంతో పురోహితుల వద్ద నుంచి వంట మేస్త్రుల వరకు, లైటింగ్ నుంచి పూల డెకరేషన్ వరకు గిరాకీ ఏర్పడింది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం వంటి పట్టణాలతోపాటు మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కల్యాణమంటపాలు బుక్కయ్యాయి. ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటున్నవారు ప్రైవేట్ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలపై ఆధారపడుతున్నారు. మిగిలినవారికి ఖాళీస్థలాలు.. ఇంటి ముందు రోడ్లే వివాహ వేదికలు కానున్నాయి. అయితే వర్షాకాలం కావడం వల్ల ఎక్కువ మంది కల్యాణ మంటపాలకే మొగ్గు చూపుతున్నారు. పురోహితులకు, వంటవారికి చేతి నిండా పనే అన్నట్టుగా ఉంది. లైటింగ్, బ్యాం డ్ మేళాల వారు సైతం ఇప్పటికే శ్రావణమాసం కారణంగా అరటి, పువ్వుల ధరలకు రెక్కలొచ్చాయి. ముహూర్తాలు దగ్గర పడే కొద్దీ వీటి రేటు పెరుగుతుందని వ్యాపారులు అంచనా. -
4 రోజుల్లో 10 లక్షలమంది.. ఆమ్ ఆద్మీ హవా
ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్): న్యూఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అధికారం కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది. గత నాలుగు రోజుల్లో పది లక్షల మందికిపైగా పార్టీలో చేరారు. ఆసక్తిగలవారు హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా ఉచితంగా సభ్యత్వం తీసుకోవచ్చని ఆప్ ప్రకటించడం ఆలస్యం అనూహ్య స్పందన వచ్చిందని ఆప్ సీనియర్ మెంబర్ గోపాల్ రాయ్ చెప్పారు. హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఓ మిస్డ్ కాల్ ఇస్తే ఆప్ వర్గాలు స్పందించేలా ఏర్పాట్లు చేశారు. కాగా పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఇంతకంటే పెద్ద సంఖ్యలో స్పందించారని, కాగా సాంకేతిక సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదని రాయ్ తెలిపారు. తొలుత ప్రకటించిన నెంబర్ 07798220033 ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, ఆప్ కొత్తగా మరో రెండు నెంబర్లను '08082807715', '08082807716' ఏర్పాటు చేసింది.