అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు లేవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలు నమోదవుతాయన్నారు.
గాలిలో తేమ ఉదయం 81 నుంచి 86, మధ్యాహ్నం 69 నుంచి 73 శాతం మధ్య ఉండవచ్చని తెలిపారు. గంటకు 15 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కాగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో తుంపర్లు పడ్డాయి. సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గానూ ప్రస్తుతానికి 3.8 మి.మీ నమోదైంది.
ఇప్పట్లో వర్షాల్లేవ్
Published Fri, Sep 2 2016 11:47 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement