వర్షసూచన | rain information | Sakshi
Sakshi News home page

వర్షసూచన

Published Tue, Sep 19 2017 9:49 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

rain information

అనంతపురం అగ్రికల్చర్‌: రాగల నాలుగు రోజుల్లో జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు 4 నుంచి 21 మిల్లీమీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీలు, కనిష్టం 21 నుంచి 22 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గంటకు 2 నుంచి 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement