rain information
-
వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు 4 నుంచి 21 మిల్లీమీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీలు, కనిష్టం 21 నుంచి 22 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గంటకు 2 నుంచి 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు 24 నుంచి 28 మి.మీ వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 నుంచి 32 డిగ్రీలు, కనిష్టం 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. గంటకు 7 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. -
వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు 11 నుంచి 21 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించారు. పగటి ఉష్ణోగ్రత 32 నుంచి 33 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 82 నుంచి 85, మధ్యాహ్నం 66 నుంచి 69 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొర్ర, పొద్దుతిరుగుడు, ఉలవ, పెసర, అలసంద లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవచ్చన్నారు. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటివరకు 82.8 మి.మీ నమోదైంది. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, తనకల్లు, ఓడీ చెరువు, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, అమడగూరు, కూడేరు, నల్లచెరువు, బత్తలపల్లి, సోమందేపల్లి, ధర్మవరం, గోరంట్ల తదితర మండలాల్లో వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతం 4.3 మి.మీ నమోదైంది. -
33 మండలాల్లో తేలికపాటి వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడ్డాయి. శనివారం కూడా 33 మండలాల్లో వర్షపాతం నమోదైంది. కదిరి 23.7 మి.మీ, అమడగూరు 13.4 మి.మీ, బుక్కపట్టణం 12.6 మి.మీ వర్షం పడింది. చిలమత్తూరు, సోమందేపల్లి, రొద్దం, పెనుకొండ, పుట్టపర్తి, ఓడీ చెరువు, నల్లచెరువు, తనకల్లు, ధర్మవరం, రాప్తాడు తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 2.1 మి.మీ నమోదైంది. -
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు 8 నుంచి 17 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 34, కనిష్టం 23 నుంచి 24 డిగ్రీలు ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 85 నుంచి 88, మధ్యాహ్నం 64 నుంచి 69 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 7 నుంచి 9 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
ఆగస్టులో ఆశాజనకంగా వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: జూన్, జూలైలో దారుణంగా దెబ్బతీసిన వర్షాలు ఆగస్టులో మాత్రం ఆశాజనకంగా కురిశాయి. అయితే అప్పటికే ప్రధాన పంట వేరుశనగ, ప్రత్తి, ఆముదం, కంది లాంటి పంటలు వేసుకునేందుకు పుణ్యకాలం ముగిసిపోవడంతో ఖరీఫ్ నిరాశాజనకంగా సాగుతోంది. జూన్‌లో 63.9 మి.మీ గానూ 59.2 మి.మీ, జూలైలో మరీ దారుణంగా 67.4 మి.మీ గానూ 31 మి.మీ వర్షం కురిసింది. దీంతో ఈ సారి కరువు ఛాయలు ముందుగానే ఆవరించడంతో జిల్లా అంతటా ఆందోళన నెలకొంది. ఆగస్టు 5 నుంచి వాతావరణం మారిపోవడం, తేలికపాటి నుంచి చెప్పుకోదగ్గ వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. నెల ముగిసేనాటికి 88.7 మి.మీ గానూ 9 శాతం ఎక్కువగా 96.8 మి.మీ వర్షం కురిసింది. అందులోనూ గత 15 రోజుల్లోనే 80 మి.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. అంతవరకు 32 శాతం లోటు వర్షపాతం కొనసాగుతుండగా ప్రస్తుతం 15 శాతానికి చేరుకుంది. ఆగస్టులో తాడిపత్రి, ఉరవకొండ, బొమ్మనహాల్, డి.హిరేహాల్, వజ్రకరూరు, విడపనకల్, గుంతకల్లు, పెద్దవడుగూరు, యాడికి, శింగనమల, పామిడి, గార్లదిన్నె, కూడేరు, బెళుగుప్ప, కనేకల్లు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, నల్లచెరువు, కంబదూరు, తలుపుల, పుట్లూరు, సోమందేపల్లి, పరిగి తదితర మండలాల్లో 100 నుంచి 150 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. ఇక చెన్నేకొత్తపల్లి, అనంతపురం, కనగానపల్లి, ఆత్మకూరు, రాయదుర్గం, బత్తలపల్లి, గోరంట్ల, కొత్తచెరువు మండలాల్లో తక్కువగా వర్షాలు పడ్డాయి. మిగతా మండలాల్లో 60 నుంచి 100 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి వేసిన పంటలు పచ్చదనం సంతరించుకున్నా దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు అంతోఇంతో ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల అంటే సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 118 మి.మీ నమోదు కావాల్సి ఉంది. -
49 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా జిల్లాలోని 49 మండలాల పరిధిలో 3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దపప్పూరు 36.3 మి.మీ, తాడిపత్రి 21.4 మి.మీ, గుంతకల్లులో 14.6 మి.మీ, గార్లదిన్నెలో 11.6 మి.మీ, యాడికిలో 10.5 మి.మీ వర్షం కురిసింది. డి.హిరేహాళ్, వజ్రకరూరు, గుత్తి, పెద్దవడుగూరు, శింగనమల, పామిడి, కూడేరు, ఉరవకొండ, కనేకల్లు, గుమ్మఘట్ట, పుట్లూరు, రామగిరి, చెన్నేకొత్తపల్లి, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, అమరాపురం, రొళ్ల తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. 14 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ఇప్పటికే 96.3 మి.మీ నమోదైంది. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 215 మి.మీ గానూ 13 శాతం తక్కువగా 186.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షసూచన: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు 4 నుంచి 26 మి.మీ మేర వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. గంటకు 6 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
57 మండలాల్లో వర్షపాతం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 57 మండలాల పరిధిలో 7.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రాయదుర్గం 35.9 మి.మీ, యాడికి 33.9 మి.మీ, కళ్యాణదుర్గం 30.4 మి.మీ, బెళుగుప్ప 29.7 మి.మీ, బ్రహ్మసముద్రం 27.2 మి.మీ, ఉరవకొండ 26.4 మి.మీ, వజ్రకరూరు 23.9 మి.మీ, శెట్టూరు 20.3 మి.మీ, రొళ్ల 16.3 మి.మీ, తనకల్లు 14.4 మి.మీ, గుత్తి 14.1 మి.మీ, అమరాపురం 13.6 మి.మీ, పెద్దవడుగూరు 12.3 మి.మీ, అగళి 12.1 మి.మీ, గుమ్మగట్ట 11.7 మి.మీ, కుందుర్పి 11.3 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో 10 మండలాల్లో తేలికపాటి వర్షం పడగా 31 మండలాల్లో చిరుజల్లులు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షంపడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు 10 నుంచి 35 మిల్లీమీటర్లు (మి.మీ) మేర మోస్తరు నుంచి భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 నుంచి 35 డిగ్రీలు, కనిష్టంగా 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 9 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ వర్షం కాగా శుక్రవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చిరుజల్లులు పడ్డాయి. కంబదూరు, ధర్మవరం, హిందూపురం, అమరాపురం, శింగనమల, కూడేరు, గుడిబండ, బుక్కపట్టణం, రొద్దం, కొత్తచెరువు, పామిడి, వజ్రకరూరు, లేపాక్షి, పరిగి, పుట్టపర్తి, మడకశిర, పుట్లూరు, గార్లదిన్నె, అనంతపురం, సోమందేపల్లి, గుంతకల్లు, ఓడీ చెరువు, పెనుకొండ, కళ్యాణదుర్గం, పెద్దవడుగూరు తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. -
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో 3 నుంచి 13 మిల్లీమీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 నుంచి 35 డిగ్రీలు, కనిష్టం 25 నుంచి 26 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 9 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగం శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి సమాచారం అందినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు రోజులూ ఆకాశం మేఘావృతమై 4 నుంచి 21 మిల్లీమీటర్ల మేర వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుంచి 39, కనిష్టం 26 నుంచి 27 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని పేర్కొన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 69 నుంచి 74, మధ్యాహ్నం 40 నుంచి 43 మధ్య ఉంటుందని, గాలులు గంటకు 9 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వివరించారు. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు శుక్రవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్ విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 29 నుంచి మే 3వతేదీ వరకు 5 నుంచి 7 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా కాస్తంత పెరిగే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలు, కనిష్టంగా 24 నుంచి 25 డిగ్రీలు నమోదుకావచ్చన్నారు. గంటకు 7 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. -
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి మంగళవారం తెలిపారు. 2, 3, 4 తేదీల్లో 4 నుంచి 7 మి.మీ మేర వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 31, రాత్రిళ్లు 16 నుంచి 22 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. కాగా మంగళవారం అగళి మండలంలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీలు, కనిష్టం 13 నుంచి 16 డిగ్రీల వరకు కొనసాగాయి. -
తేలికపాటి వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పగలు తేలికపాటి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యల్లనూరులో 22 మి.మీ, పుట్లూరు 19 మి.మీ, బొమ్మనహాల్ 13 మి.మీ, అనంతపురం 12 మి.మీ, అగళి 12 మి.మీ, ఆత్మకూరు 10 మి.మీ వర్షపాతం కురిసింది. తాడిమర్రి, రాప్తాడు, కూడేరు, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, తనకల్లు, ఉరవకొండ, గాండ్లపెంట, కనగానపల్లి, కనేకల్లు, గుత్తి, వజ్రకరూరు, ఓడీ చెరువు, రొద్దం, శింగనమల, గార్లదిన్నె, ముదిగుబ్బ తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. -
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వాతావరణ కేంద్రం అందించిన సమాచారం మేరకు.. జిల్లాలో అక్కడక్కడ 4 నుంచి 20 మి.మీ వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు పగలు 29 నుంచి 35, రాత్రిళ్లు 23 నుంచి 25 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు. -
వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో ఓ మాదిరి వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం నుంచి శనివారం వరకు 5 నుంచి 25 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 36, రాత్రిళ్లు 22 నుంచి 23 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు. గంటకు 18 నుంచి 23 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపారు. -
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన అధిపతి డాక్టర్ బి.రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రధాన శాస్ర్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 6 నుంచి 15 మిమీ మేర వర్షపాతం నమోదుకావచ్చన్నారు. పగలు 31 నుంచి 33, రాత్రిళ్లు 22 నుంచి 23 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. గాలిలో తేమ ఉదయం 71 నుంచి 74, మధ్యాహ్నం 50 నుంచి 61 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 20 నుంచి 25 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. వేరుశనగకు గడువు ముగిసిపోవడంతో జొన్న, సజ్జ, కొర్ర, అలసంద, పొద్దుతిరుగుడు వేసుకోవాలని సూ చించారు. జూన్, జూలైలో వేసుకున్న వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, పెసర పంటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. -
తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బుధవారం భారీ వర్షం కురిసింది. తెలంగాణలో వరుసగా మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం బుధవారం వెల్లడించింది. హైదరాబాద్ క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఉండటంతో మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కురిసిన వర్షపాతం కాకుండా.. హైదరాబాద్‌లో గరిష్టంగా 5 సెంటీ మీటర్ల వర్షపాతం.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇవే వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ విభాగం తెలిపింది.