అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన అధిపతి డాక్టర్ బి.రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రధాన శాస్ర్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 6 నుంచి 15 మిమీ మేర వర్షపాతం నమోదుకావచ్చన్నారు. పగలు 31 నుంచి 33, రాత్రిళ్లు 22 నుంచి 23 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.
గాలిలో తేమ ఉదయం 71 నుంచి 74, మధ్యాహ్నం 50 నుంచి 61 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 20 నుంచి 25 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. వేరుశనగకు గడువు ముగిసిపోవడంతో జొన్న, సజ్జ, కొర్ర, అలసంద, పొద్దుతిరుగుడు వేసుకోవాలని సూ చించారు. జూన్, జూలైలో వేసుకున్న వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, పెసర పంటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
తేలికపాటి వర్షసూచన
Published Sat, Aug 6 2016 1:20 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement