అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 57 మండలాల పరిధిలో 7.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రాయదుర్గం 35.9 మి.మీ, యాడికి 33.9 మి.మీ, కళ్యాణదుర్గం 30.4 మి.మీ, బెళుగుప్ప 29.7 మి.మీ, బ్రహ్మసముద్రం 27.2 మి.మీ, ఉరవకొండ 26.4 మి.మీ, వజ్రకరూరు 23.9 మి.మీ, శెట్టూరు 20.3 మి.మీ, రొళ్ల 16.3 మి.మీ, తనకల్లు 14.4 మి.మీ, గుత్తి 14.1 మి.మీ, అమరాపురం 13.6 మి.మీ, పెద్దవడుగూరు 12.3 మి.మీ, అగళి 12.1 మి.మీ, గుమ్మగట్ట 11.7 మి.మీ, కుందుర్పి 11.3 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో 10 మండలాల్లో తేలికపాటి వర్షం పడగా 31 మండలాల్లో చిరుజల్లులు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.