జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, తనకల్లు, ఓడీ చెరువు, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, అమడగూరు, కూడేరు, నల్లచెరువు, బత్తలపల్లి, సోమందేపల్లి, ధర్మవరం, గోరంట్ల తదితర మండలాల్లో వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతం 4.3 మి.మీ నమోదైంది.