అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో 3 నుంచి 13 మిల్లీమీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 నుంచి 35 డిగ్రీలు, కనిష్టం 25 నుంచి 26 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 9 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.