అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు రాగల నాలుగు రోజుల్లో వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగాపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం ప్రకారం 22 నుంచి 26వ తేదీ వరకు 7 నుంచి 20 మిల్లీమీటర్లు (మి.మీ) మేర మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు.
ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 నుంచి 35, కనిష్టం 23 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 69 నుంచి 73, మధ్యాహ్నం 63 నుంచి 65 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. కాగా శుక్రవారం శెట్టూరు, బ్రహ్మసముద్రం, కూడేరు, రాయదుర్గం, కనేకల్లు తదితర 10 నుంచి 15 మండలాల్లో తుంపర్లు పడ్డాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా ప్రస్తుతానికి కేవలం 23.1 మి.మీ నమోదైంది.
నాలుగు రోజుల్లో వర్షసూచన
Published Fri, Jul 21 2017 10:30 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement