రాగల నాలుగు రోజుల్లో వర్షసూచన | rain in four days | Sakshi
Sakshi News home page

రాగల నాలుగు రోజుల్లో వర్షసూచన

Published Fri, Jul 7 2017 10:45 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

rain in four days

అనంతపురం అగ్రికల్చర్‌ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.వపన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం ప్రకారం నాలుగు రోజుల్లో 2.5 మి.మీ నుంచి 34.5 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు పగలు 32 నుంచి 34 డిగ్రీలు, రాత్రిళ్లు 23 నుంచి 24 డిగ్రీలు నమోదవుతాయన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 80, మధ్యాహ్నం 40 నుంచి 51 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 11 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement