
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్లతో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో, వర్షాలు తగ్గుముఖం పట్టేలోపే.. హైదరాబాద్ వాతవరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం కారణంగా రేపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, ద్రోణి ప్రభావంతో ఈనెల 25, 26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ కురవనున్నట్టు తెలిపారు.
మరోవైపు, ద్రోణి కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి.. సాయంత్రం సమయంలో వడగండ్ల కురిసే అవకాశం ఉందని స్పష్టంచేశారు. అలాగే, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశముందన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కురిసిన అకాల వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత నష్టం కలిగే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment