Heavy rain forecast
-
మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బలపడటం.. బలహీనపడటం.. మళ్లీ బలపడటం.. ఇలా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోజుకో రకంగా రూపాంతరం చెంది, శుక్రవారానికి తుపానుగా మారింది. తీవ్ర వాయుగుండం గమనాన్ని బట్టి మొదట తుపానుగా మారుతుందని అంచనా వేసినా, గురువారానికి బలహీనపడింది. కానీ, మళ్లీ పుంజుకొని గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ శుక్రవారం మ«ద్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫెంగల్ తుపానుగా బలపడింది. వ్యతిరేక దిశలో ఉన్న షీర్ జోన్ బలహీనపడటం వల్లే వాయుగుండం మళ్లీ బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం ట్రింకోమలికి 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 270 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. శనివారం అర్ధరాత్రి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.వేటకు వెళ్లొద్దు..తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిమీ, ఉత్తర కోస్తాలో 40 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు డిసెంబర్ 1 వరకూ వేటకు వెళ్లొద్దని సూచించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 1.5 మీటర్లు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 2.7 నుంచి 3.3 మీటర్ల వరకూ ఎగసి పడుతూ అలలు అల్లకల్లోలం సృష్టిస్తాయని తెలిపారు. సందర్శకులు కూడా సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించారు.పోర్టులకు హెచ్చరికలుఫెంగల్ తుపాను కారణంగా కృష్ణపట్నం పోర్టులో డేంజర్ సిగ్నల్ నం–6 జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్–2 జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
‘ఫెంగల్’ దోబూచులాట!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట రూరల్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను దాగుడుమూతలాడుతోంది. దీన్ని ట్రాక్ చేసేందుకు వాతావరణ శాఖ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇది బుధవారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండం నుంచి తుపానుగా మారినట్లే మారి కాస్తా బలహీనపడిపోయింది. దీంతో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. మళ్లీ తుపానుగా బలపడే అవకాశాలున్నా.. ఎప్పుడనే దానిపై అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది. తుపాను వ్యతిరేక శక్తిలా పనిచేస్తున్న బలమైన గాలులతో కూడిన షియర్ జోన్.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తుపానుకు వ్యతిరేక దిశలో ఇది కొనసాగుతుండటంవల్ల.. 48 గంటలు గడిచినా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని.. ఈ కారణంగానే ఫెంగల్ ముందుకు కదల్లేకపోతోందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఈ తీవ్ర వాయుగుండం గంటకు కేవలం 10 కిమీ వేగంతో నెమ్మదిగా కదులుతూ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ట్రింకోమలికి 200 కిమీ, పుదుచ్ఛేరికి ఆగ్నేయంగా 410 కిమీ, చెన్నైకి దక్షిణాగ్నేయంలో 470 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా సముద్రంలోనే బలహీనపడనుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్న క్రమంలో.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలైన కరైకల్, మహాబలిపురం మధ్య 30వ తేదీ ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 50–60 కిమీ.. గరిష్టంగా 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఒకవేళ తుపానుగా బలపడితే మాత్రం గంటకు 65–75 కిమీ.. గరిష్టంగా 85 కిమీ వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.నేటి నుంచి వర్షాలు..ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. అలాగే 30 నుంచి డిసెంబరు 2 వరకూ కోస్తాంధ్ర అంతటా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. ఈఓఎస్–06, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాల సహాయంతో ఫెంగల్ తుపాను కదులుతున్న తీరుపై ఇస్రో అధికారులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. -
తెలంగాణకు అలర్ట్.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో నేడు ఏడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. Today's Forecast ⚠️⛈️Today will be another day of powerful thunderstorms in North, Central TG districts mainly during afternoon - midnight. Widespread storms aheadHyderabad will get a thunderstorm for 6th consecutive day again like yesterday during afternoon- night ⚠️ pic.twitter.com/c0bt720er9— Telangana Weatherman (@balaji25_t) September 25, 2024 ఇక, మంగళవారం అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది. నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9, తిమ్మాపూర్‌లో 9.9, శాలిగౌరారంలో 9.1, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కూడా పలుచోట్లు మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. Raining here at #Khajaguda Circle ⛈️#Hyderabadrains pic.twitter.com/ySDOSIj8f2— Hyderabad Rains (@Hyderabadrains) September 24, 2024ఇది కూడా చదవండి: యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం -
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే.. హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కూడా శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. మరోవైపు.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజాము నుంచే వర్షం మొదలైంది. పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఇక, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం.. కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు ఆదిలాబాద్, మంచిర్యాల, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, ఆదివారం.. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.Hyderabad and Secunderabad Lashed by Heavy Rains and Thunderstorms, Flooded Roads Cause Major Disruptions.#HeavyRain #Hyderabad #Ghmc #20SEP2024https://t.co/2XG0Rkvr12 pic.twitter.com/zSWot38uPD— Syed iftikhar Ali (@Syedift84721583) September 20, 2024 Income tax tower, Masabtank. pic.twitter.com/3gUXoL7HV4— Sajjad Hussain (@SajjadH98372780) September 20, 2024🚨🇮🇳 | Heavy Rains Lash City, Causing Widespread Flooding📌 #Hyderabad | #India DATE: [September 21.2024]HIGHLIGHTS:- Flash floods in Himayath Nagar and surrounding areas- Relief efforts in progress- Avoid traveling to flooded areas#HyderabadRains | #Rains Stay safe! https://t.co/LeLTD4n6PC pic.twitter.com/pRJRUM3SYV— Weather monitor (@Weathermonitors) September 20, 2024సోమవారం.. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.Weather warning ⚠️!!Now early morning thuders storm action pickup in west telangana Sangareddy medak kamareddy Places see good rains in 1hour Karimnagar siddipet later rains for next 1 hour possible 🌧️⚠️ pic.twitter.com/r3u5YEZ4YL— Telangana state Weatherman (@tharun25_t) September 21, 2024ఇది కూడా చదవండి: కాళేశ్వరం తెలంగాణ రైతుకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్ -
AP: బలపడిన వాయుగుండం.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం పూరీ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.మరోవైపు.. వాయుగుండం కారణంగా భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్‌కు ఛాన్స్ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటలపాటు నదీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. These Red marked Rivers will get huge flood inflows in next 24 hours 👍🙏 #AndhraPradeshRains pic.twitter.com/ZMgPyrl7Vd— Vizag weatherman🇮🇳 (@KiranWeatherman) September 9, 2024 వర్షాలకు ఛాన్స్ ఇలా.. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. కోస్తాలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం. రెండు రోజుల పాటు కోస్తాంధ్రకు వర్ష సూచన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.మరోవైపు తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల తెలంగాణలోనూ సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. మంగళవారం కొన్ని జిల్లాల్లో 30కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. As The Depression(వాయుగుండం) Moving North Light To Moderate Rains Expected In Some Parts Of {Vijayawada - Srikakulam} Belt Till Afternoon.Sun 🌞 Will Be Back From Tomorrow In Many Parts Of Coastal AP.Scattered thunderstorms Expected For Next 2 Weeks.#AndhraPradesh pic.twitter.com/Aa8SJCmv5R— ANDHRA WEATHER (@Andhra_weather) September 9, 2024 -
ఉత్తరాంధ్ర–ఒడిశా తీరంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం సమీపంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం వెల్లడించారు.అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి, అల్పపీడన కేంద్రం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి. ద్రోణి, అల్పపీడన ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 8న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. -
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రానున్న 24 గంట్లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను మరోసారి వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు(గురువారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, ఉత్తరాంధ్రలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ విధించింది.ఇదే సమయంలో విజయవాడకు మరో ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, పలు ప్రాంతాల్లో 7-12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానున్నట్టు అంచనావేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. -
పొంచివున్న వాయు‘గండం’
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ, ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పï³డనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి అనంతరం వాయుగుండంగా మారే సూచనలున్నాయి. అనంతరం పశ్చిమ–వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా విశాఖకు సమీపంలో తీరం దాటవచ్చని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎనీ్టఆర్, కృష్ణా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. -
చెన్నైలో జలప్రళయం
సాక్షి, చెన్నై: ఎక్కడ చూసినా నీరే. అంతటా వరద ప్రవాహమే. తమిళనాడు రాజధాని చెన్నై సముద్రాన్ని తలపించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మిచాంగ్ తుపానుగా మారి తమిళనాడు రాజధానితో పాటు శివారు జిల్లాల్లో జల ప్రళయమే సృష్టించింది. ఆదివారం రాత్రి నుంచీ ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కొనసాగింది. సోమవారం మధ్యాహ్నానికే చెన్నై, శివారు జిల్లాల్లో 35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది! దాంతో వీధులన్నీ వాగులుగా మారాయి. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి! నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్‌వేలను మూసేశారు. రన్ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా మంగళవారం ఉదయం దాకా మూసేస్తున్నట్టు ప్రకటించారు. 160 విమాన సేవలు రద్దయ్యాయి. వండలూరు జూలోకి వరదనీరు పోటెత్తడంతో పెద్ద సంఖ్యలో మొసళ్లు తప్పించుకున్నాయి. దివంగత సీఎం జయలలిత నివాసం, సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖులుండే పోయెస్ గార్డెన్ హైవే 7 అడుగుల మేర కుంగింది! అక్కడ టాన్స్‌ఫార్మర్లు, వాహనాలు అందులో పడిపోయాయి. వాన బీభత్సం కొనసాగుతుండటంతో సహాయ చర్యలూ చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు. మంగళవారం కూడా వర్షాలు కొనసాగుతాయన్న హెచ్చరికలు గుబులు పుట్టిస్తున్నాయి. చెన్నై శివారులోని జాతీయ రహదారి వరద నీటిలో మునగడంతో రాకపోకలు స్తంభించాయి. నగరం, శివార్లలోని చెరువులు, రిజర్వాయర్లు నిండడంతో అడయార్, కూవం నదులు, బకింగ్ హాం కాలువల ద్వారా చెన్నై వైపుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నగరాన్ని చుట్టుముడుతున్న వరదను తొలగించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో మంగళవారం కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఫోన్లో సహాయక చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వేలాది మంది నిర్వాసితులై చెన్నై, శివార్లలో వందలాది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వర్షాలకు చెన్నైలో ఐదుగురు మృతి చెందారు. వందలాది రైళ్లు రద్దయ్యాయి. 47 ఏళ్లలో అతి భారీ వర్షం తాజా వర్ష బీభత్సం చెన్నై నగరంలో గత 47 ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది. 2015 నాటి కుంభవృష్టిని కూడా మించిపోయింది. అప్పటి కష్టాలు పునరావృతం కాకుండా చూసేందుకు డీఎంకే ప్రభుత్వం నగరంలో రూ.4 వేల కోట్లతో నిర్మించిన వరద కాల్వలు పూర్తిగా వాడకంలోకి రాకపోవడంతో ఈసారీ ముంపు సమస్య తలెత్తింది. మంగళవారం నాటికి 10 సెం.మీ. వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్ బంద్, పలు రైళ్లు రద్దు
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. వరదల కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. 12 జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, తమిళనాడువ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కోయంబత్తూరు, తిరువూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండపోత వాన కురిసింది. ఇక, నీలగిరి జిల్లాలోని ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో శుక్రవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తంజావూర్, తిరువారూర్, నాగపట్నం, మైలదుత్తురై, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, విరుదునగర్, తూత్తుకుడి, తెంకాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Due to severe rains #Madurai is water logged #TamilNadu #Rains pic.twitter.com/eTvH8oK4JW — Ashok Varma (@AshokVarmaAA) November 10, 2023 ఇక, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తాజాగా తిరువారూర్ జిల్లా, పుదుచ్చేరిలోని కారైక్కల్లోని పాఠశాలలను నేటి నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేశారు రైల్వే అధికారులు. నీలగిరి మౌంటైన్ రైల్వేలోని కల్లార్, కూనూర్ సెక్షన్ల మధ్య ట్రాక్‌పై కొండచరియలు, చెట్లు కూలిపడటంతో నవంబర్ 16 వరకు ఆ రూట్స్‌లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మెట్టుపాళయం నుంచి ఉదగమండలం వరకు నడిచే 06136, 06137 ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. VIDEO | Schools across Tamil Nadu’s Coimbatore shut due to heavy rains in the region. pic.twitter.com/Y0q73Zw1R7 — Press Trust of India (@PTI_News) November 9, 2023 -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను హెచ్చరించారు. వరద నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలన్నారు. రానున్న మూడు, నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: దంచికొడుతున్న వానలు.. హుస్సేన్ సాగర్ నీటి మట్టం అలర్ట్! -
తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర పారిశుధ్యంపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 13 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని కేటీఆర్ అన్నారు. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే వర్షాకాల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. చదవండి: భారీ వర్షాలు.. బస్ డ్రైవర్లు, కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ సూచనలు అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం భారీ నుంచి అతిభారీ వర్షాలు సిద్దిపేట, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి. భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి మోస్తరు నుంచి భారీ వర్షాలు.. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. -
AP: రేపు అల్పపీడనం.. నాలుగు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. కాగా, ఇది 24వ తేదీ లోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తోంది. ఈ ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీనివల్ల వచ్చే నెల 3వ తేదీ వరకు వర్షాలకు ఆస్కారముంది. నేడు గోదావరికి పెరగనున్న వరద! పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో గోదావరి ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతోంది. ఆ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద నది వరద బుధవారం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువనున్న లక్ష్మి బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీని ప్రభావం ధవళేశ్వరం వద్ద కనిపించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం మంగళవారం 9.55 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 51,268 క్యూసె క్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ.. 9 రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు హాల్ట్ -
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడు రోజులు జోరు వానలే..
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు, ఇళ్లు జలమయ్యాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ఇదిలాఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. వివరాల ప్రకారం.. కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరిత ఆవర్తనం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, పగటి పూట మబ్బులు ఉండి, రాత్రవేళ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించారు. ఇక, శుక్రవారం నుంచి శనివారం వరకు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్‌తో పాటు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడుతాయని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: తొలి ప్రసంగంలో అదరగొట్టిన కేటీఆర్ కొడుకు హిమాన్షు -
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ తేదీల్లో మస్త్ వానలు!
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్లతో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో, వర్షాలు తగ్గుముఖం పట్టేలోపే.. హైదరాబాద్ వాతవరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం కారణంగా రేపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, ద్రోణి ప్రభావంతో ఈనెల 25, 26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ కురవనున్నట్టు తెలిపారు. మరోవైపు, ద్రోణి కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి.. సాయంత్రం సమయంలో వడగండ్ల కురిసే అవకాశం ఉందని స్పష్టంచేశారు. అలాగే, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశముందన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కురిసిన అకాల వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. -
డేంజరస్ మాండూస్.. ఏపీలో ఈదురు గాలులతో భారీ వర్షం!
సాక్షి, అమరావతి /సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ఉదయం తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక, తమిళనాడు వైపు దూసుకు వస్తోంది. బుధవారం రాత్రి ట్రింకోమలీ (శ్రీలంక)కి 410 కిలోమీటర్లు, జాఫ్నాకు (శ్రీలంక) 550 కిలోమీటర్లు, కారైకాల్‌కు 610 కిలోమీటర్లు, చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ తుపానుకు మాండూస్ అని పేరు పెట్టారు. 9వ తేదీ రాత్రి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటుతుందని చెబుతున్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 65–75 కి.మీలు, గరిష్టంగా 85 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. తీరం దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడి చిత్తూరు వైపు కదులుతుందని చెబుతున్నారు. గురువారం నుంచి 10వ తేదీ వరకు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అప్రమత్తమైన యంత్రాంగం తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని కోరారు. మాండూస్ ప్రభావంతో 8వ తేదీ నుంచి 3 రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 10, 11 తేదీల్లో ఏపీలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. Cyclone #Mandous in the Bay of Bengal at night #CycloneMandous #MandousCyclone pic.twitter.com/CqkGULTbRv — Zoom Earth (@zoom_earth) December 8, 2022 -
ఏపీని తాకనున్న ‘మాండూస్’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సూళ్లూరుపేట: దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. మంగళవారం రాత్రికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1,020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం బుధవారం సాయంత్రానికి పశ్చిమ వాయవ్యదిశలో కదులుతూ మాండూస్ తుపానుగా బలపడి గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరుకుంటుంది. అనంతరం అదేదిశలో పయనిస్తూ 48 గంటల పాటు అదేప్రాంతంలో కొనసాగనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. మాండూస్ తుపాను 9వ తేదీన తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపానుగానైనా లేకపోతే బలహీనపడి వాయుగుండంగానైనా తీరం దాటిన తరువాత ఇది చిత్తూరు వైపు కదులుతూ క్రమంగా ఇంకా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావం 8, 9, 10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలపై ఉండనుంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీనుంచి అతిభారీ వర్షాలు పడతాయని, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు ఈ నెల 10వ తేదీ వరకు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగిరావాలని కోరింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కచ్చా ఇళ్లకు నష్టం వాటిల్లుతుందని, విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలకు అంతరాయం కలుగుతుందని, చెట్లు కూలే ప్రమాదం ఉందని, పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యే వీలుందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీ.ఆర్.అంబేద్కర్ కోరారు. బుధవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు పులికాట్ సరస్సులో చేపలవేటకు వెళ్లవద్దని సూళ్లూరుపేట ఆర్డీవో కె.ఎం.రోజ్‌మాండ్ మత్స్యకారులకు సూచించారు. -
తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో రెండు రోజులు ఉరుములతో భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి గురువారం ఉదయం అల్పపీడనంగా మారిందని, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, అల్పపీడనం సముద్ర మట్టం నుంచి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తున పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 22 నాటికి మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈనెల 23 నాటికి తీవ్రవాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ గురువారం నివేదికలో పేర్కొంది. తీవ్ర వాయుగుండం దిశను మార్చుకుంటూ ఉత్తర దిశగా కదలుతూ ఈ నెల 24 నాటికి పశ్చిమ మధ్య, బంగాళాఖాతం దాని పరిసరప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 25 నాటికి పశ్చిమబెంగాల్–బంగ్లాదేశ్ తీరానికి చేరుకుంటుందని పేర్కొంది. రానున్న రెండ్రోజుల్లో వర్షాలు ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండ్రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని చాలాప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ జరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. -
భయపెడుతున్న తుఫాన్ సిత్రాంగ్.. దిశ మార్చుకుంటూ దడ పుట్టిస్తోంది!
భువనేశ్వర్: సిత్రాంగ్ తుపాను హెచ్చరికలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. తుఫాన్ బంగాళాఖాతంలో క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. తుఫాన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుండా తీరం దాటుతుందనే ముందస్తు సంకేతాలతో బిక్కుబిక్కుమంటున్నారు. అక్టోబరు నెలలో పలు తుపానులు ఇప్పటికే ఇక్కడి ప్రజల గుండెల్లో దడ పుట్టించాయి. ఈ భయంతోనే సిత్రాంగ్ తుపాను ఎటువంటి బీభత్సం సృష్టిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై విపత్తు నిర్వహణ యంత్రాంగం సకాలంలో స్పందించేందుకు వాతావరణ విభాగం అనుక్షణం తాజా సమాచారం ముందస్తుగా జారీ చేస్తుంది. ప్రజలు భయపడి ఆందోళన చెందాల్సిందేమీ లేదని పేర్కొంటోంది. తుపాను ముఖచిత్రం ఇంకా స్పష్టం కానందున సిత్రాంగ్ తుపాను ఎక్కడ తీరం దాటుతుందో స్పష్టం కాలేదని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్రో తెలియజేశారు. ఇదిలాఉండగా ఈనెల 25వ తేదీ నాటికి సిత్రాంగ్ తుపాను పశ్చిమ బెంగాల్ దిఘా ప్రాంతంలో తీరం దాటుతుందని అమెరికా గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ జీఎఫ్ఎస్ మంగళవారం ముందస్తు సమాచారం ప్రసారం చేసింది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) సంస్థ సిత్రాంగ్ తుపాను రాష్ట్రంలో బాలాసోర్ ప్రాంతంలో తీరం దాటుతుందని వెల్లడించింది. అత్యవసర సమావేశం విపత్తు నిర్వహణ విభాగం సిత్రాంగ్ తుపాను తీవ్రత నేపథ్యంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈనెల 22వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా తుపాను తీరం దాటే సంకేతాలు క్రమంగా బలపడుతున్నట్లు ప్రాంతీయ వాతావరణ విభాగం తెలిపింది. ఈనెల 23వ తేదీ లేదా 24వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ఖరారు అయ్యే సంకేతాలను ఈ కేంద్రం జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఏర్పడిన వాయుగుండం (సైక్లోనిక్ సర్క్యులేషన్) మంగళవారం నాటికి ఘనీభవించింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తాండవిస్తుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఫలితంగా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఈనెల 23వ తేదీ వరకు వర్షం కురుస్తుంది. ఈనెల 23 లేదా 24వ తేదీ నాటికి ఈ వాతావరణం తుపానుగా పరిణతి చెందుతుందని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టరు మృత్యుంజయ మహాపాత్రో వెల్లడించారు. ప్రస్తుతానికి అల్ప పీడన ప్రాంతం స్పష్టం కానందున తుపాను తీవ్రత, తీరం దాటే ప్రాంతం వివరాలు ధ్రువీకరించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. తుపాను కదలికపై అనుక్షణం నిఘా వేసి ఉన్నట్లు తెలిపారు. క్రమంగా తుపాను వాతావరణం బలపడుతున్నందున గాలుల వేగం పుంజుకుంటుంది. ఈనెల 22వ తేదీ నుంచి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45 కిలో మీటర్ల నుంచి 55 కిలో మీటర్ల వేగంతో వీచే గాలుల తీవ్రత గంటకు 65 కిలో మీటర్ల వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలిపారు. సమావేశం నిర్వహణ బెంబేలెత్తిస్తున్న సిత్రాంగ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ యంత్రాంగం మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రత్యేక సహాయ కమిషనర్ ఇన్చార్జి సత్యవ్రత సాహు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తుపాను తాకిడి ప్రతిపాదిత తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ వర్గం ఓస్డమా కార్య నిర్వాహక అధికారి జ్ఞానదాస్ తెలిపారు. దక్షిణ అండమాన్ సాగరం, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఆవిర్భవించిన వాయుగుండం రానున్న 48 గంటల్లో మరింత ఘనీభవించి బుధవారం లేదా గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన క్షేత్రం స్పష్టమయ్యే సంకేతాలు బలపడుతున్నట్లు వాతావరణ విభాగం ముందస్తు సమాచారం జారీ చేసిందని జ్ఞానదాస్ వివరించారు. అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమ కేంద్రీయ, కేంద్ర బంగాళాఖాతం గుండా కదలిక పుంజుకుంటుంది. దీని ప్రభావంతో ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో వానలు ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 22 లేదా 23వ తేదీ నాటికి అల్పపీడనం తుపాను రూపురేఖలు స్పష్టం అవుతాయని పేర్కొన్నారు. అల్పపీడనం స్పష్టమైతే తప్ప తుపాను తాకిడి, తీవ్రత వివరాలను అంచనా వేయడం అసాధ్యమని వివరించారు. #Rains_thunderStorm_winds activities.. The Latest Updates many version says Probably, if the formation of #Sitrang completed...the cyclone come up #UTurn based perpendicular "Yaas"way Bengal way 23 Oct/3 pm to 26 Oct 7am a #touftimes direction #SWtoNE. pic.twitter.com/QsyrdYCcWo — EverythingIND20 (@EverythingIND20) October 19, 2022 -
ప్రాణ నష్టం జరగకూడదు
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగరాదని, ఏ ఒక్క ప్రాణం పోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బాధితుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు, వ్యక్తికి అయితే రూ.1,000 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల చొప్పున తక్షణం రూ.8 కోట్ల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. గోదావరికి వందేళ్లలో ముందస్తు వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ సహాయ చర్యలపై మార్గ నిర్దేశం చేశారు. వరద నష్టంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి సీఎంవో అధికారులకు రోజువారీ నివేదిక పంపాలని కలెక్టర్లకు సూచించారు. నెల ముందే భారీ వరదలు గోదావరికి ముందస్తు వరదలు వచ్చాయని, గత వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్ధాయిలో వరద రాలేదని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సాధారణంగా ఆగస్టులో 10 లక్షల క్యూసెక్కుల వరద ఉంటుందని, తొలిసారిగా జూలైలోనే అంతకు మించి వరద వచ్చిందని చెప్పారు. ఇది జాగ్రత్త పడాల్సిన అంశమని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తెలిపారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ప్రవాహం 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 24 గంటలు కంట్రోల్ రూమ్‌లు కూనవరం, చింతూరు, వి.ఆర్.పురం, అమలాపురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. లైన్ డిపార్ట్మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్స్ సమర్థంగా 24 గంటలపాటు నిరంతరాయంగా పని చేయాలని స్పష్టం చేశారు. శిబిరాల్లో ఖర్చుకు వెనుకాడొద్దు.. అవసరమైన చోట్ల వరద సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలన్నారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్పష్టం చేశారు. బాధితుల పట్ల మానవతా దృక్ఫధంతో మెలగాలని, శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు వారంతా ప్రశంసించేలా సదుపాయాలు కల్పించాలని సూచించారు. సహాయ శిబిరాల్లో నాణ్యమైన సేవలందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు. అత్యవసర మందులు, నిత్యావసరాలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బందిని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచి అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నిత్యావసర సరుకులకు సంబంధించి తగినంత నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం బాగుండాలని స్పష్టం చేశారు. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు తలెత్తితే అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా జనరేటర్లను, తాగునీటి కోసం ట్యాంకర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. బోట్లు, లైఫ్ జాకెట్లు.. వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. చెరువులు, ఇరిగేషన్ కాల్వలు బలహీనంగా ఉన్నచోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సబ్స్టేషన్లు ముంపు బారిన పడకుండా చర్యలు చేపట్టి బోట్లు, లైఫ్ జాకెట్లు అవసరమైన చోట్ల సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, ఇంధనశాఖ కార్యదర్శి కె.విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సివిల్ సఫ్లైస్ కమిషనర్ గిరిజా శంకర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana Rains: వానలు డబుల్! సాధారణంతో పోలిస్తే రెట్టింపు వర్షపాతం
మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు.. ఆరెంజ్ అలర్ట్: నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు.. ఎల్లో అలర్ట్: మిగతా జిల్లాలకు.. బలపడుతున్న అల్పపీడనం: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని.. అది మరింత బలపడనుందని తెలిపింది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో.. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు వెళ్తున్న వరద సాక్షి, హైదరాబాద్: చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలతో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వానలు పడుతున్నాయి. సగటు సాధారణ వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఏటా జూన్ ఒకటో తేదీ నుంచి నైరుతి సీజన్ మొదలై సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నాలుగు నెలల కాలంలో సాధారణంగా అయితే 72.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఇందులో జూలై 11వ తేదీనాటికి 20.39 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి జూలై 11 నాటికే ఏకంగా 39.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 94 శాతం అధికం కావడం గమనార్హం. వాస్తవానికి జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వాన పడింది. ఈ నెల ప్రారంభంలోనూ అలాగే ఉంది. కానీ గత వారం రోజుల్లోనే ఒక్కసారిగా పెరిగింది. లోటు భర్తీ కావడమేకాదు.. రెండింతల వాన నమోదై రికార్డు సృష్టించింది. 29 జిల్లాల్లో అత్యధికంగా..: వారం రోజులుగా కురుస్తున్న వానలతో రాష్ట్రంలో పలుచోట్ల చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పొలాల్లో నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. ఇందులో 29 జిల్లాల్లో అతి ఎక్కువ స్థాయిలో వానలు పడగా.. ఆదిలాబాద్, హైదరాబాద్, వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాలు మాత్రమే కాస్త ఎక్కువ వానల జాబితాలో ఉన్నాయి. సొమవారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జల దిగ్బంధంలో ఏడుపాయల ఆలయం మెదక్ జిల్లాలో సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ప్రాజెక్టు (ఘనపురం ఆనకట్ట) పొంగి పొర్లుతోంది. దీనితో ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం చుట్టూ నీళ్లు ప్రవహిస్తున్నాయి. -
విజయానికి 6 వికెట్ల దూరంలో టీమిండియా!
‘బాక్సింగ్ డే’ టెస్టు క్లైమాక్స్‌కు చేరింది. భారత్, దక్షిణాఫ్రికా జట్లను విజయం ఊరిస్తోంది. సొంతగడ్డపై మరో 211 పరుగులు చేస్తే సఫారీలకు విజయం దక్కుతుంది. మామూలుగానైతే రోజంతా ఆడితే ఇదేమంత కష్టమైన పని కాదు! అయితే చేతిలో 6 వికెట్లే ఉన్నాయి. భారత పేసర్లు దూకుడు మీదున్నారు. నాలుగో రోజే మన బౌలర్లను అతి కష్టమ్మీద ఎదుర్కొంటూ పోరాడిన ఆతిథ్య జట్టు గురువారం ఎంత వరకు నిలబడగలదనేది ఆసక్తికరం. అయితే అన్నింటికి మించి వాతావరణ శాఖ అంచనా ప్రకారం చివరి రోజు భారీ వర్ష సూచన ఉంది. వాన రాకపోతే భారత్ గెలిచే అవకాశాలు మెండుగా ఉండగా...వరుణుడు కరుణించకపోతే ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సిందే! సెంచూరియన్: భారత్, దక్షిణాఫ్రికాల తొలి టెస్టు ఆట ఫలితం దగ్గరకొచ్చింది. కీలకమైన బ్యాటర్స్ ఇంకా అందుబాటులో ఉండటం ఇటు సఫారీకి, బౌలర్లు నిప్పులు చెరుగుతుండటం ఇరు జట్లకు విజయంపై ఆశలు రేపుతోంది. 305 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బుధవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 94 పరుగులు చేసింది. విజయానికి 211 పరుగుల దూరంలో ఉంది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (122 బంతుల్లో 52 బ్యాటింగ్; 7 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 16/1తో ఆట కొనసాగించిన భారత్ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసి ఆలౌటైంది. రిషభ్ పంత్ (34 బంతుల్లో 34; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. వేగంగా ఆడి ఆలౌట్! లక్ష్యాన్ని నిర్దేశించే క్రమంలో భారత్ వేగంగా ఆడే ప్రయత్నం చేసి వెంటవెంటనే వికెట్లు సమర్పించుకుంది. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన శార్దుల్ ఠాకూర్ (10; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువ సేపు నిలువలేదు. రాహుల్ (74 బంతుల్లో 23; 4 ఫోర్లు), పుజారా (16) స్కోరును 50 పరుగులు దాటించారు. ఆ తర్వాత వచ్చిన వారిలో కోహ్లి (32 బంతుల్లో 18; 4 ఫోర్లు), రహానే (23 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నది కాసేపే అయినా చకచకా పరుగులు జత చేశారు. జాన్సెన్ వేసిన 37వ ఓవర్లో రహానే వరుసగా 4, 6, 4 బాదేశాడు. వీళ్లిదర్ని జాన్సెన్ అవుట్ చేశాడు. 111 పరుగులకే 6 వికెట్లు పడిపోగా, రిషభ్ పంత్ (34 బంతుల్లో 34; 6 ఫోర్లు) చివర్లో దూకుడు ప్రదర్శించాడు. ఎల్గర్ పట్టుదలగా... షమీ తన తొలి ఓవర్లోనే మార్క్రమ్ (1)ను బౌల్డ్ చేసి దక్షిణాఫ్రికాను దెబ్బ తీయగా, కీగన్ పీటర్సన్ (17)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ ఎల్గర్... వాన్ డెర్ డసెన్ (11) కొద్దిసేపు ప్రతిఘటించారు. ఎట్టకేలకు 22 ఓవర్ల తర్వాత బుమ్రా అద్భుతమైన డెలివరీతో డసెన్ బోల్తా కొట్టించాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన కేశవ్ మహరాజ్ (8)ను కూడా చివరి ఓవర్ ఐదో బంతికి బుమ్రా బౌల్డ్ చేయడంతో ఆట ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 327, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 197 భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) ఎల్గర్ (బి) ఎన్గిడి 23; మయాంక్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 4; శార్దుల్ (సి) ముల్డర్ (బి) రబడ 10; పుజారా (సి) డికాక్ (బి) ఎన్గిడి 16; కోహ్లి (సి) డికాక్ (బి) జాన్సెన్ 18; రహానే (సి) డసెన్ (బి) జాన్సెన్ 20; పంత్ (సి) ఎన్గిడి (బి) రబడ 34; అశ్విన్ (సి) పీటర్సన్ (బి) రబడ 14; షమీ (సి) ముల్డర్ (బి) రబడ 1; బుమ్రా నాటౌట్ 7; సిరాజ్ (బి) జాన్సెన్ 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (50.3 ఓవర్లలో ఆలౌట్) 174. వికెట్ల పతనం: 1–12, 2–34, 3–54, 4–79, 5–109, 6–111, 7–146, 8–166, 9–169, 10–174. బౌలింగ్: రబడ 17–4–42–4, ఎన్గిడి 10–2–31–2, జాన్సెన్ 13.3–4–55–4, ముల్డర్ 10–4–25–0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) షమీ 1; ఎల్గర్ (బ్యాటింగ్) 52; పీటర్సన్ (సి) పంత్ (బి) సిరాజ్ 17; వాన్ డెర్ డసెన్ (బి) బుమ్రా 11; కేశవ్ మహరాజ్ (బి) బుమ్రా 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (40.5 ఓవర్లలో 4 వికెట్లకు) 94. వికెట్ల పతనం: 1–1, 2–34, 3–74, 4–94. బౌలింగ్: బుమ్రా 11.5–2–22–2, షమీ 9–2–29–1, సిరాజ్ 11–4–25–1, శార్దుల్ 5–0–11–0, అశ్విన్ 4–1–6–0. ఎల్గర్ -
Heavy Rains: తెలంగాణలోని జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రుతుపవనాల ద్రోణి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతోపాటు ఉత్తర, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఐదురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఏపీలోనూ రాబోవు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడు, రేపు భారీ వర్షాలు... రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. సోమవారం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. మంగళవారం కూడా ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. నాగిరెడ్డిపేటలో 17 సెంటీమీటర్ల వర్షం... రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 17 సెం.మీ. వర్షం కురవగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 15.4 సెం.మీ. వర్షం కురిసింది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 61.58 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఆదివారం నాటికి 78.86 సెం.మీ. వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. -
తెలంగాణలో జడివాన.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా భారీ వర్షాలతో జిల్లాలు అతలాకుతలం అవుతుండగా.. మరో 3,4 రోజులు కుండపోత వానలు కురవనున్నాయి. ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ఊర్లకు ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు నీటమునిగాయి. రహదారులు, వంతెనలపై వరద ప్రవాహాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆది, సోమవారాల్లో వరదలో కొట్టుకుపోయి.. నలుగురు మృతిచెందగా, మరికొందరు గల్లంతయ్యారు. హైదరాబాద్‌లో ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం నుంచే వానలు పడుతున్నాయి. వాతావరణం పూర్తిగా మేఘావృతమైంది. సోమవారం కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్‌లలో 4.1, కంచన్‌బాగ్‌లో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. మరిన్ని రోజులు వానలు పడే నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి.. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. రానున్న ఐదు రోజుల్లో.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మరికొద్దిరోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్ధిపేట, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీగా.. మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. అప్రమత్తంగా ఉండండి: సీఎస్ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు పని ప్రదేశంలోనే అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎక్కడికక్కడ పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని.. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వానలు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం, బెజ్జూర్, సిర్పూర్(టి), తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కుండపోత కురిసింది. దహెగాం మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జడివాన కురిసింది. ఖిలా వరంగల్‌లో ఏకంగా 14 సెంటీమీటర్లు, లింగాల ఘన్పూర్, పాలకుర్తిలలో 12.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వరంగల్ నగరంలోని 33 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు, గుడిసెల్లోకి నీరు చేరడంతో సామగ్రి నీటమునిగింది. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సగటున 7.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. వాగులు పొంగిపొర్లుతున్నాయి. సుమారు ఏడు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సిద్దిపేట–హన్మకొండ మార్గంలో బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు వంతెనపై లారీ చిక్కుకుపోయింది. స్థానికులు లారీ డ్రైవర్‌ను రక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సోమవారం భారీ వర్షాలు కురిశాయి. లోయర్ మానేర్ డ్యాం (ఎల్ఎండీ)కి భారీగా వరద వస్తుండటంతో 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సిరిసిల్ల నుంచి సిద్దిపేట రహదారి తంగళ్లపల్లి నీట మునిగి.. రాకపోకలు ఆగిపోయాయి. వేములవాడలో భారీ వర్షంతో రాజన్న ఆలయం ఎదుట భారీగా నీళ్లు నిలిచాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో సింగితం రిజర్వాయర్, కౌలాస్, పోచారం ప్రాజెక్టులు నిండిపోయాయి. మద్నూర్ మండలంలో పెసర, మినుము పంటలు నీటమునిగాయి. ఇద్దరు మృతి.. మరో ఇద్దరు గల్లంతు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం శివారులోని దోసల వాగుదాటుతూ ఓ బైక్ వాగులో పడిపోయింది. ఆ బైకు నడుపుతున్న శ్రవణ్ బయటపడగా.. జనగామ జిల్లా చిన్నమడూరుకు చెందిన సింధూజ (26), రాజాపేట మండలం బొందుగులకు చెందిన హిమబిందు (23) వాగులో కొట్టుకుపోయారు. నిజానికి శ్రవణ్, సింధూజ, హిమబిందుతోపాటు సింధూజ తల్లిదండ్రులు, మరికొందరు బంధువులు కలిసి బొందుగుల గ్రామానికి వెళుతున్నారు. ఈ ముగ్గురూ బైక్‌పై వెళ్తుండగా మిగతావారు కారులో ఉన్నారు. ఆ కారు మొదట వాగు దాటింది. వెనకాల బైక్ మీద వస్తున్నవారు వాగులో పడిపోయారు. తమ కళ్లముందే ఇద్దరు యువతులు కొట్టుకుపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువుల హతాశులయ్యారు. కాగా.. సోమవారం సాయంత్రం పారుపెల్లి వాగు సమీపంలో సింధూజ మృతదేహం లభించింది. హిమబిందు ఆచూకీ దొరకలేదు. హన్మకొండ కాకాజీ కాలనీలో వరద నీరు నిండటంతో డ్రైనేజీ ఉందని గుర్తించలేక ఓ యువకుడు మృతి చెందాడు. అతడిని వరంగల్ నగరంలోని శివనగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఓరం క్రాంతికుమార్ (28)గా గుర్తించారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం దానాపూర్‌కు చెందిన టేకం దోబీరావు (33) ఆదివారం అర్ధరాత్రి జండగూడ వాగులో గల్లంతయ్యాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటకు భూపతిరెడ్డి, మరొకరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంతదూరంలో చెట్టును పట్టుకుని నిలబడగా>.. స్థానికులు రక్షించారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి వాగు ప్రవాహంలో రాగుల బాలరాజు, చిన్నం బాలరాజు అనే గొర్రెల కాపరులు చిక్కుకుపోగా పోలీసులు వారిని కాపాడారు. సిద్దిపేట మండలం మిట్టపల్లి శివారులోని వాగులో ఓ కారు చిక్కుకుంది. అందులో ప్రయణిస్తున్న సిద్దిపేట వాసులు కూడవెళ్లి భాను, మురం భానులను పోలీసులు రక్షించారు. నవ వధువు కన్నుమూసింది వరుడి అక్క కూడా మృతి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. జిల్లాలోని మోమిన్‌పేట్ నుంచి రావులపల్లికి వస్తున్న పెళ్లికారు ఆదివారం సాయంత్రం తిమ్మాపూర్ వద్ద వరదలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. కారులో వధువు ప్రవళిక (19), వరుడు నవాజ్‌రెడ్డి, ఆయన అక్కలు రాధిక, శ్వేత, ఆమె కుమారుడు శశాంక్‌రెడ్డి, డ్రైవర్ రాఘవేంద్రరెడ్డి ఉన్నారు. వీరిలో నవాజ్‌రెడ్డి, రాధిక ఆదివారమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రవళిక, శ్వేతల మృతదేహాలు సోమవారం ఉదయం లభించాయి. శశాంక్‌రెడ్డి ఆచూకీ ఇంకా దొరకలేదు. పరారైన డ్రైవర్.. వాగులో కారు కొట్టుకుపోయిన కొంతసేపటికే డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన అతను.. భయంతో పరారయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. కాగా.. కారు కొట్టుకుపోయిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.. సోమవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రవళిక, శ్వేత మృతదేహాలను స్వయంగా తరలించారు. వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి వికారాబాద్ జిల్లా పులుమామిడి వద్ద ఆదివారం సాయంత్రం వాగులో కొట్టుకుపోయిన చాకలి శ్రీనివాస్ మృతిచెందాడు. ఘటనా స్థలానికి సమీపంలోని చెట్ల పొదల్లో సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట–లింగన్నపేట మధ్య మానేరువాగు ఉప్పొంగి వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. సోమవారం సాయంత్రం కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వంతెనపై అదుపుతప్పింది. ఒక టైర్ కిందికి దిగి ఆగిపోయింది. త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను రక్షించారు. -
వణికిస్తున్న వరుణుడు
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో ఇది వాయవ్య దిశగా పయనించి.. 3 రోజుల తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. సముద్రం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అవనిగడ్డ, తణుకు 6 సెం.మీ., అమలాపురం, ఏలూరు, బొబ్బిలి, మంగళగిరి, తునిలో 5సెం.మీ. వర్షపాతం నమోదైంది.