సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కూడా శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. మరోవైపు.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజాము నుంచే వర్షం మొదలైంది. పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఇక, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం.. కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు ఆదిలాబాద్, మంచిర్యాల, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, ఆదివారం.. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.
Hyderabad and Secunderabad Lashed by Heavy Rains and Thunderstorms, Flooded Roads Cause Major Disruptions.#HeavyRain #Hyderabad #Ghmc #20SEP2024
https://t.co/2XG0Rkvr12 pic.twitter.com/zSWot38uPD— Syed iftikhar Ali (@Syedift84721583) September 20, 2024
Income tax tower, Masabtank. pic.twitter.com/3gUXoL7HV4
— Sajjad Hussain (@SajjadH98372780) September 20, 2024
🚨🇮🇳 | Heavy Rains Lash City, Causing Widespread Flooding
📌 #Hyderabad | #India
DATE: [September 21.2024]
HIGHLIGHTS:
- Flash floods in Himayath Nagar and surrounding areas
- Relief efforts in progress
- Avoid traveling to flooded areas#HyderabadRains | #Rains
Stay safe! https://t.co/LeLTD4n6PC pic.twitter.com/pRJRUM3SYV— Weather monitor (@Weathermonitors) September 20, 2024
సోమవారం.. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Weather warning ⚠️!!
Now early morning thuders storm action pickup in west telangana
Sangareddy medak kamareddy
Places see good rains in 1hour
Karimnagar siddipet later rains for next 1 hour possible 🌧️⚠️ pic.twitter.com/r3u5YEZ4YL— Telangana state Weatherman (@tharun25_t) September 21, 2024
ఇది కూడా చదవండి: కాళేశ్వరం తెలంగాణ రైతుకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్
Comments
Please login to add a commentAdd a comment