సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో నేడు ఏడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
Today's Forecast ⚠️⛈️
Today will be another day of powerful thunderstorms in North, Central TG districts mainly during afternoon - midnight. Widespread storms ahead
Hyderabad will get a thunderstorm for 6th consecutive day again like yesterday during afternoon- night ⚠️ pic.twitter.com/c0bt720er9— Telangana Weatherman (@balaji25_t) September 25, 2024
ఇక, మంగళవారం అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది. నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9, తిమ్మాపూర్‌లో 9.9, శాలిగౌరారంలో 9.1, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కూడా పలుచోట్లు మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది.
Raining here at #Khajaguda Circle ⛈️#Hyderabadrains pic.twitter.com/ySDOSIj8f2
— Hyderabad Rains (@Hyderabadrains) September 24, 2024
ఇది కూడా చదవండి: యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం
Comments
Please login to add a commentAdd a comment