సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రానున్న 24 గంట్లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను మరోసారి వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు(గురువారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, ఉత్తరాంధ్రలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ విధించింది.
ఇదే సమయంలో విజయవాడకు మరో ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, పలు ప్రాంతాల్లో 7-12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానున్నట్టు అంచనావేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment