సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను హెచ్చరించారు. వరద నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలన్నారు. రానున్న మూడు, నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: దంచికొడుతున్న వానలు.. హుస్సేన్ సాగర్ నీటి మట్టం అలర్ట్!
Comments
Please login to add a commentAdd a comment