సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం పూరీ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు.. వాయుగుండం కారణంగా భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్‌కు ఛాన్స్ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటలపాటు నదీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
These Red marked Rivers will get huge flood inflows in next 24 hours 👍🙏 #AndhraPradeshRains pic.twitter.com/ZMgPyrl7Vd
— Vizag weatherman🇮🇳 (@KiranWeatherman) September 9, 2024
వర్షాలకు ఛాన్స్ ఇలా..
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..
కోస్తాలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం.
రెండు రోజుల పాటు కోస్తాంధ్రకు వర్ష సూచన
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల తెలంగాణలోనూ సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. మంగళవారం కొన్ని జిల్లాల్లో 30కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
As The Depression(వాయుగుండం) Moving North Light To Moderate Rains Expected In Some Parts Of {Vijayawada - Srikakulam} Belt Till Afternoon.
Sun 🌞 Will Be Back From Tomorrow In Many Parts Of Coastal AP.
Scattered thunderstorms Expected For Next 2 Weeks.#AndhraPradesh pic.twitter.com/Aa8SJCmv5R— ANDHRA WEATHER (@Andhra_weather) September 9, 2024
Comments
Please login to add a commentAdd a comment