సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర పారిశుధ్యంపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
13 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని కేటీఆర్ అన్నారు. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే వర్షాకాల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నామని అధికారులు తెలిపారు.
ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది.
చదవండి: భారీ వర్షాలు.. బస్ డ్రైవర్లు, కండక్టర్లకు టీఎస్‌ఆర్టీసీ సూచనలు
అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు
మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం
భారీ నుంచి అతిభారీ వర్షాలు
సిద్దిపేట, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి.
భారీ వర్షాలు..
ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి
మోస్తరు నుంచి భారీ వర్షాలు..
హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
Comments
Please login to add a commentAdd a comment