రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 26 నుంచి 29 తేదీల మధ్య కొన్ని ప్రాంతాల్లో 2 మి.మీ. నుంచి 10 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు.
పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 32 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 21 డిగ్రీల మధ్య నమోదుకావచ్చని తెలిపారు. కాగా జిల్లాలో చలితీవ్రత ఇంకా కొనసాగుతోందన్నారు. మంగళవారం తనకల్లులో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. మిగతా మండలాల్లో 12 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదైనట్లు తెలిపారు.