
చండీగఢ్: హరియాణాలోని పంచ్‌కుల జిల్లాలోని మోర్ని ప్రాంతంలో ఓ 22 ఏళ్ల వివాహితను బంధించి నాలుగు రోజుల పాటు దాదాపు 40 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగమిస్తామని చెప్పి తెలిసిన వ్యక్తి ఒకరు తన భార్యను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారని అక్కడే నాలుగు రోజుల పాటు బంధించి డ్రగ్స్ ఇచ్చి చిత్రహింసలు పెడుతూ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి భర్త మీడియాకు తెలిపారు.
‘జూలై 15 నుంచి 18 వరకు ప్రతిరోజూ 10 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడిన ఆమె నాకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పింది. నా భార్య ఇంటికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం’అని చెప్పారు. గెస్ట్‌హౌస్ యజమానితో పాటు మేనేజర్, మరొకర్ని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment