Hariyana
-
భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!
అదృష్టాన్ని నమ్ముకుంటే కలలు సాకారం కావు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. విజయం సాధించాలనే సంకల్పం ఉంటే సరిపోదు.. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఓపికతో కృషి చేయాలి. అలా ఆత్మవిశ్వసంతో విజయ తీరాలకు చేరుకున్న స్ఫూర్తిదాతలెందరో ఉన్నారు. అలా తన జీవితంలో ఒక బిగ్ డ్రీమ్ కోసం ఎవరూ ఊహించని విధంగా సాహసోపేతంగా ప్రతిభను చాటుకున్న ఒక ధీర గురించి తెలుసు కుందాం రండి..!ఆమె పేరే పూజా యాదవ్. హర్యానాకు చెందిన పూజా పట్టుదలగా ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. 1998లో హర్యానాలోని సోనిపట్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె సోనిపట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బయోటెక్నాలజీలో బీటెక్, జీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసింది. అందివచ్చిన అవకాశాలతో కెనడా, జర్మనీలో మంచి వేతనంతో ఉద్యోగాలు చేశారు. కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉద్యోగం చేయాల్చి వచ్చినా, ఐపీఎస్(IPS) అవ్వాలనే ఆశయం మాత్రం నిరంతరం పూజా మదిలో మెదులుతూనే ఉంది. దీనికితోడు దేశాభివృద్ధికి తోడ్పడాలనే బలమైన కోరిక ఉంది. మొదటి నుంచీ, ఆమె తన దేశానికి సేవచేయాలని కోరిక సివిల్ సర్వీసెస్ పరీక్షకు (UPSC వైపు నడిపించింది. అంతే వన్ ఫైన్‌మార్నింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఉద్యోగం వదిలేసి భారత దేశానికి తిరిగి వచ్చింది. సివిల్స్ ప్రిపరేషన్ (మొదలు పెట్టింది. కానీ ఇది ఆమె అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒకవైపు పూజా కుటుంబం ఆర్థిక పరిస్థితి, మరోవైపు చదువుకి అయ్యే ఖర్చులు ఇలా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఐపీఎస్ కావాలనే నిర్ణయానికి కుటుంబంలో అందరూ తోడుగా నిలిచారు.ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్రిసెప్షనిస్టుగా పనిచేస్తూనే,ఒకవైపు సిపిల్స్కు ప్రిపేర్ అవుతూనే,తన ఆర్థిక అవసరాల నిమిత్తం పిల్లలకు ట్యూషన్లు చెప్పింది. దీంతోపాటు రిసెప్షనిస్టుగా పనిచేస్తూ, పరీక్షలకు ప్రిపేర్ అయింది. తొలి ప్రయత్నం విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరాశపడకుంగా, ఏకాగ్రతతో తపస్సులా చేసింది. చివరికి ఆమె కష్టం వృధా పోలేదు.సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరడం ద్వారా పౌరుల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. 2018 కేడర్‌లో IPSగా నియమితురాలు కావడం తన జీవితంలో మర్చిపోలేని రోజని సంతోషంగా చెప్పింది పూజా. 2021లో స్నేహితుడు వికల్ప్ భరద్వాజ్‌ను ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో సాగిన పరిచయం పెళ్లికి దారి తీసింది. ప్రస్తుతం గుజరాత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. వృత్తిబాధ్యలతోపాటు, పూజ యాదవ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో 3.28 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి సోషల్ మీడియాను మించినది లేదు అని నమ్మేవారిలో పూజా యాదవ్ ఒకరు. చదవండి: Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు -
జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో, హరియాణాలో ఒక దశలో పోలింగ్.. అక్టోబర్ 4న ఫలితాలు. ఇంకా ఇతర అప్డేట్స్
-
కూటమి విచ్ఛిన్నం.. ఒంటరిగానే జేజేపీ పోటీ
Haryana: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని జననాయక్ జనతా పార్టీ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. “రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని జననాయక్ జనతా పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం” అని చౌతాలా ఏఎన్ఐకి చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ-జననాయక్ జనతా పార్టీ (BJP-JJP) కూటమి విచ్ఛిన్నమైన కొన్ని రోజులలోనే జేజేపీ నుంచి ఒంటరి పోటీ నిర్ణయం వచ్చింది. ఈ కూటమి విచ్ఛిన్నం మార్చి 12న మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాకు దారితీసింది. నయాబ్ సింగ్ సైనీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నయాబ్ సైనీ కురుక్షేత్ర నుండి బీజేపీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన పార్టీ రాష్ట్ర చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలోని మొత్తం 10 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. అయితే ఆప్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన జేజేపీ పోటీ చేసిన 7 స్థానాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కాగా హర్యానాలో 2024 సార్వత్రిక ఎన్నికలు మే 25న ఆరో దశలో జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
బీజేపీలో చేరిన స్టీల్ టైకూన్.. గంటల్లోనే టికెట్!
పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఆదివారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. అలా చేరారో లేదో కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు బీజేపీ టికెట్ ప్రకటించింది. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించింది. అంతకుముందు రోజు నవీన్ జిందాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘నేను పదేళ్లు కురుక్షేత్ర నుంచి ఎంపీగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించాను. కాంగ్రెస్ నాయకత్వానికి, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేడు రాజీనామా చేస్తున్నాను’ అన్నారు. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నవీన్ జిందాల్ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. పార్టీతో జిందాల్ అనుబంధం దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళుతుందన్నారు. దేశంలోని ప్రముఖ జిందాల్ స్టీల్ & పవర్ (JSP) గ్రూప్‌నకు నవీన్ జిందాల్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి వ్యవస్థాపక ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. పోలో, స్కీట్ షూటింగ్ వంటి క్రీడల్లో జాతీయ గుర్తింపును సాధించారు. శాస్త్రీయ కూచిపూడి కళాకారిణి షల్లు జిందాల్‌ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవీన్ జిందాల్ 2004 నుంచి 2014 వరకు కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2014 జాతీయ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాజ్ కుమార్ సైనీపై ఓటమిని ఎదుర్కొన్నారు. తదనంతరం 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. -
గుంతలో పడిన అంబులెన్స్ : బతికొచ్చిన తాత
గతుకులు, గుంతల రోడ్డు కారణంగా అనేక ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. కానీ అదే గుంత మనిషికి ప్రాణం పోసింది. నమ్మ శక్యంగా లేకపోయినా ఇది నిజం. హర్యానాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుసుకుంది. అనారోగ్య కారణాలతో దర్శన్ సింగ్ బ్రార్ (80)చనిపోయాడు.అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో పాటియాలా నుండి కర్నాల్ సమీపంలోని అతని ఇంటికి తీసుకు వెళుతున్నారు. మరోవైపు అతని బంధువులు అంత్యక్రియలు అన్ని ఏర్పాట్లు చేసేవారు. కానీ విధి మరోలా ఉంది. ఉన్నట్టుండి అంబులెన్స్ గుంతలో పడింది. అదే మృతుడికి ప్రాణం పోసింది. అంబులెన్స్‌లో అతనితో పాటు ఉన్న మనవడు తన తాత చేయి కదలడం గమనించాడు. వెంటనే ఊపిరి పరక్షీంచగా గుండె కొట్టుకోవడంతో వెంటనే బ్రార్‌ను ఆసుపత్రికి తరలించాడు. అతడు బతికే ఉన్నట్లు అక్కడి వైద్యులుప్రకటించారు. కర్నాల్‌లోని ఎన్‌పి రావల్ ఆసుపత్రిలో క్రిటికల్ ICUలో చికిత్స పొందుతున్నాడు. నిజంగా ఇది అద్భుతం, దేవుడి దయ, ఆయన త్వరగా కోలుకోవాలంటూ బంధువులు కోరుకుంటున్నారు భూమ్మీద ఇంకా నూకలున్నాయి అంటూ సంతాపం తెలపడానికి వచ్చిన బంధువులంతా ఆ కుటుంబాన్ని అభినందించి వెళ్లారు. క్రిటికల్, కానీ శ్వాస ఉంది బాధితుడు శ్వాస తీసుకుంటున్నాడు. రక్తపోటుతో పాటు పల్స్ ఉన్నాయి, అయితే ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నందున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రావల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నేత్రపాల్ తెలిపారు. -
టీమిండియా టీ20 వరల్డ్‌కప్-2007 హీరోపై కేసు! కారణమిదే..
టీమిండియా మాజీ క్రికెటర్, 2007 ప్రపంచకప్ హీరో జోగీందర్ శర్మ చిక్కుల్లో పడ్డారు. హరియాణా పోలీస్ శాఖలో ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జోగీందర్ శర్మపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హిసార్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి జనవరి 1న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లి.. ఆస్తి తగాదాల వల్ల తలెత్తిన సమస్య కారణంగానే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకే ఆయన పేరు కూడా చేర్చారు! ఇందులో భాగంగా జోగిందర్ శర్మ సహా ఆరుగురి పేర్లను తన ఫిర్యాదులో ఆమె ప్రస్తావించింది. ప్రస్తుతం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న తమ ఆస్తి కేసు విషయంలో ఐదుగురు వ్యక్తులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పినా.. డీఎస్పీగా ఉన్న జోగీందర్ శర్మ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన ఫిర్యాదులో జోగీందర్ శర్మ పేరును కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో నిందితులతో పాటు జోగీందర్ శర్మపై కూడా హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం కాగా పవన్ బలవన్మరణం నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయానికి బదులుగా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ కేసు పక్కదారి పట్టకుండా లోతుగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అతనెవరో నాకు తెలియదు ఈ నేపథ్యంలో బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే, ఈ విషయంపై స్పందించిన జోగీందర్ శర్మ.. ‘‘నాకు అసలు ఈ కేసు గురించి తెలియదు. పవన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అతడిని ఒక్కసారి కూడా కలవలేదు’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియా టుడే కథనం ప్రచురించింది. ధోని నమ్మకం నిలబెట్టి.. ప్రపంచకప్‌ను ముద్దాడి టీ20 ఫార్మాట్లో 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా గెలవడంలో జోగీందర్ శర్మది కీలక పాత్ర. సౌతాఫ్రికా వేదికగా దాయాది పాకిస్తాన్‌తో నువ్వా- నేనా అన్నట్లు పోటాపోటీగా సాగిన ఫైనల్లో.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆఖరి ఓవర్లో బంతిని జోగీందర్‌కు ఇచ్చాడు. అప్పటికి పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. అలాంటి సమయంలో జోగీందర్ తెలివిగా బౌలింగ్ చేశాడు. అతడు సంధించిన బంతిని పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పాక్ ఓడింది.. టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడింది. సీఎస్కేకు ఆడిన జోగీందర్ శర్మ ఇక నాటి మ్యాచ్‌లో జోగీందర్ శర్మ మొత్తంగా 3.3 ఓవర్ల బౌలింగ్‌లో 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఐపీఎల్లో 2010, 2011 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించి రెండు సందర్భాల్లోనూ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. 2011 తర్వాత ఆటకు దూరమైన జోగీందర్ శర్మ క్రికెట్‌కు అందించిన సేవల నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన డీఎస్పీగా ఉన్నట్లు సమాచారం. ఇక టీమిండియా తరఫున 4 వన్డే, 4 టీ20లు ఆడిన రైటార్మ్ పేసర్ జోగీందర్ శర్మ ఆయా ఫార్మాట్లలో ఒకటి, నాలుగు వికెట్లు తీశారు. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com. చదవండి: తరానికొక్క ఆటగాడు.. ముంబై అలా చేయకపోతే టీమిండియాకు నష్టం -
బుల్లెట్ల వర్షం కురుస్తున్నా..సాహసంతో తరిమికొట్టింది!
తుపాకీతో కాల్పులు జరుపుతున్న నలుగురు దుండగులను ధైర్యంగా ఎదిరించిందో మహిళ. కేవలం పొడవాటి చీపురు కర్ర (దులుపు కర్ర)సాయంతో షూటర్లను తరిమి కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. హర్యానాలో భివానీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. షాకింగ్ దృశ్యాలకు సంబంధించిప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలో వానీలోని డాబర్ కాలనీలో హరికిషన్ తన ఇంటికి వెళ్ళే గేటు పక్కనే నిలబడి ఉన్నాడు. రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు వచ్చారు. బండిపై నుంచి దిగిన పిలియన్ రైడర్లు ఇద్దరు హరికిషన్‌పై కాల్పులు జరపడంతో, అతను లోపలికి పోయి, తప్పించుకున్నాడు. ఇంతలో పక్కనుంచి వచ్చిన మహిళ చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించింది. కాల్పులు మోత మోగుతున్నాఏ మాత్రం వెనకడుగు వేయలేదు. షూటర్ల మీదికి కొబ్బరి పుల్లలతో కట్టిన దులుపు కర్రతో ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వారు ఆ ప్రదేశంనుంచి ఉడాయించిక తప్పలేదు. ఈ క్రమంలో ఆ మహిళపై కూడా కాల్పులు జరిపారు. కానీ ఆమె తప్పించుకుంది. ముష్కరులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపగా, హరికిషన్‌కు నాలుగు బుల్లెట్ గాయాలయ్యాయి. మహిళ హరికిషన్ కుటుంబసభ్యులా లేక పొరుగింటి మహిళా అనేది స్పష్టత లేదు. బాధితుడిని చికిత్స నిమిత్తం పీజీఐఎంఎస్ రోహ్తక్కు తరలించినట్లు పోలీసు అధికారి దీపక్ మీడియాకు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేస్తున్నారని, షూటర్లను, వారితో పాటు వచ్చిన ఇద్దరు రైడర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇది ఇలా ఉండగా రవి బాక్సర్ హత్య కేసులో హరికిషన్ నిందితుడు.ఇతనికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. హరికిషన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. అతడిపై దాడికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని మూడు నెలల క్రితం భివానీ పోలీసులు అరెస్టు చేశారట. Bravery. Haven't EVER seen anything close to this! 4 armed men, on a shooting spree, being chased by a middle aged woman, with a BROOM. pic.twitter.com/fbbboLW9jU — CA Mayank Parakh (@Mayank_Parakh) November 28, 2023 -
ముసుగు వీరుడిలా హరియాణా సీఎం, ఎందుకిలా? వీడియో వైరల్
హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పంచకులలోని జాతరలో మారువేషంలో కనిపించడం వైరల్‌గా మారింది. రాష్ట్రంలో స్థానికంగా నిర్వహించే జాతరకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తనను ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి కండువాతో కప్పుకొని మరీ మంగళవారం సాయంత్రం దర్శమనిచ్చారు. వాచ్మెన్ వేషంలో ఈ వేడుక మైదానంలో షికారు చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఖట్టర్ అని ముఖ్యమంత్రి మీడియా కార్యదర్శి తర్వాత ధృవీకరించారు. స్థానిక వేడుకలో ఎవరికీ అనుమానం రాకుండా వాచ్‌మెన్‌లా అది కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సీఎం ఖట్టర్ జనాల మధ్య ఖాకీ రంగు దుస్తులలో , కాషాయ రంగు టోపీతో ఈ వీడియోలో కనిపించారు. అయితే హరియాణాలోని పంచకులలోని షాలిమార్ మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రావణ్ దహనం దృశ్యాలని తెలుస్తోంది. हरियाणा के मुख्यमंत्री मनोहर लाल खट्टर पंचकूला के सेक्टर-5 के दशहरा ग्राउंड में मेला देखने के लिए पहुंचे। यह दावा उनके एक वीडियो को लेकर किया जा रहा है। सीएम इस वीडियो में बिना सिक्योरिटी के मेले में घूमते नजर आ रहे हैं।#ManoharLalKhattar #haryana pic.twitter.com/1Z17xXgdZB — Parmeet Bidowali (@ParmeetBidowali) November 8, 2023 హాట్ బెలూన్ ప్రాజెక్ట్ ఇది ఇలా ఉంటే ఈరోజు ఉత్తర హరియాణాలో హాట్ బెలూన్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక వృద్ధితోపాటు, అక్కడి సాహస ప్రియులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసినట్టు సీఎం చెప్పారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించి, లాంచ్ సందర్భంగా ప్రకృతి సఫారీ ప్రాజెక్ట్‌న ఎంజాయ్ చేయడం విశేషం. విమానాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణించాం.. కానీ హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ అనేది ప్రత్యేకమైన అనుభూతి అంటూ ట్వీట్ చేశారు. హరియాణాలో పర్యాటకులకు స్వాగతం! గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ఎంతో కృషి చేశామని సీఎం పేర్కొన్నారు. हरियाणा में पर्यटकों का स्वागत है! पर्यटन के मानचित्र पर हरियाणा को उभारने के लिए हमने पिछले 9 वर्षों से अभूतपूर्व कार्य किए हैं। आज एक और कदम आगे उठाते हुए पर्यटन की रोमांचक गतिविधियों को बढ़ावा देने हेतु पिंजौर में हॉट एयर बैलून सफारी का शुभारंभ कर इसका लुत्फ भी उठाया।… pic.twitter.com/mX7YCzIrJe — Manohar Lal (@mlkhattar) November 8, 2023 -
భర్త చనిపోయాక అత్తింటి హింస.. గంభీరంగా కనిపించే మేజర్ అర్చన వెనుక కన్నీటి కథ
Minnie Vaid: శాస్త్రరంగం నుంచి సైనికరంగం వరకు మనకు స్ఫూర్తిని ఇచ్చే మహిళలు ఎంతో మంది ఉన్నారు. వారి గురించి తెలుసుకుంటే ఆగిపోయిన అడుగులో కదలిక మొదలవుతుంది. ‘అందదు’ అనుకున్న కల చేరువవుతుంది. అలాంటి మహిళలను తన పుస్తకాలతో లోకానికి పరిచయం చేస్తోంది మిన్నీ వైద్. వాస్తవ జీవిత కథతో తాజాగా ‘ఫతే’ అనే పుస్తకాన్ని రాసింది... జర్నలిస్ట్, రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది ముంబైకి చెందిన మిన్నీ వైద్. మూడు సంవత్సరాల క్రితం ‘ఇస్రో’ మహిళా శాస్త్రవేత్తలపై తాను రాసిన పుస్తకం గురించి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలి కంటోన్మెంట్ టౌన్లో ప్రసంగించింది. ప్రసంగం పూర్తయిన తరువాత జనరల్ అనీల్ చౌదరి మిన్నీతో మాట్లాడారు. ‘ఇస్రోలోనే కాదు, ఆర్మీలో కూడా ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన మహిళలు ఉన్నారు. వారి గురించి కూడా తప్పనిసరిగా రాయాలి’ అంటూ కొంతమంది గురించి చెప్పారు ఆయన. అలా ‘ఫతే’ పుస్తకానికి బీజం పడింది. ఆ పుస్తకంలో... హరియాణాలోని చిన్న పట్టణంలో పుట్టి పెరుగుతుంది అర్చన. తనది సంప్రదాయ కుటుంబం. ‘ఎక్కడి వరకు చదవాలో అక్కడి వరకే చదవాలి. ఉన్నత చదువులు అవసరం లేదు’ అనేది ఆ కుటుంబ భావన. కాలేజీ రోజుల్లో ఎన్సీసీలో చేరుతుంది అర్చన. అప్పుడే... సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంటుంది. అయితే తాను ఒకటి తలిస్తే, కుటుంబం ఒకటి తలిచింది. అర్చనకు ఆర్మీ ఆఫీసర్ లక్ష్మణ్ దెస్వాల్తో వివాహం జరిపిస్తారు. పెళ్లితో తన కల కలగానే మిగిలిపోయింది. నాన్–ఫ్యామిలీ ఫీల్డ్‌లో భర్త ఉద్యోగం. సెలవుల్లో అతడు ఇంటికి వచ్చినప్పుడు...ప్రతిరోజూ అపూర్వమైన రోజు. భర్త విధుల్లో చేరిన తరువాత ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్లో గంటల తరబడి కబుర్లు ఉండేవి! ఈ సంతోషకాలంలో, తన కల పెద్దగా గుర్తుకు వచ్చేది కాదు. ఒకరోజు.. లక్ష్మణ్‌కు ఫోన్ చేస్తే ఎత్తలేదు... ఆయన ఫైరింగ్ లో చనిపోయాడు! భూమి నిలువునా చీలిపోయింది. తాను ఎక్కడో పాతాళలోకంలో పడిపోయింది. అప్పటికే తాను గర్భవతి. బిడ్డను చూసుకోకుండానే ఆయన చనిపోయాడు. భర్త ఉన్నప్పుడు ఎలాంటి సమస్యా ఎదురు కాలేదుగానీ, అతడు చనిపోయిన తరువాత అత్త, ఆడబిడ్డల నుంచి మానసిక హింస మొదలైంది. ఒక మూలన ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే బాధ పెరుగుతుంది తప్ప తరగదు అనే విషయం తనకు అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు. తాను మళ్లీ బతకాలంటే, కొత్త జీవితం మొదలుపెట్టాలి! ఆగిపోయిన చదువును మళ్లీ పట్టాలెక్కించింది. ఒక్కో అడుగు వేస్తూ...ఆర్మీలో చేరాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఆర్మీ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. అమ్మాయి ఆలనాపాలన చక్కగా చూసుకుంటుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఆలివ్‌గ్రీన్ యూనిఫామ్‌లో గంభీరంగా కనిపించే మేజర్ అర్చన వెనుక ఇంత కన్నీటి కథ ఉందని తెలిసినవారు చాలా తక్కువ. నిజజీవిత కథ ఆధారంగా మిన్నీ రాసిన ఈ కాల్పనిక పుస్తకం పేరు... ఫతే. ‘ఫతే’ అంటే విజయం. ఎన్ని కష్టాలు దాటితే ఒక విజయం సొంతం అవుతుందో కళ్లకు కట్టే పుస్తకం ఇది. దీనిలో ఎలాంటి శైలి, విన్యాసాలు, నాటకీయతా లేవు. 126 పేజీలలో సాధారణ వాక్యాలు కనిపిస్తాయి. అయితే అవి ఒక అసాధారణమైన వ్యక్తి గురించి అద్భుతంగా చెబుతాయి. మిన్నీ ఈ పుస్తకం దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. అనేక రంగాలలో మనకు స్ఫూర్తిని ఇచ్చే మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి కూడా భవిష్యత్‌లో మరిన్ని పుస్తకాలు రాయాలనుకుంటోంది. చదవండి: బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర Joycy Lyngdoh: నిరుపేద మహిళ.. తొలుత స్కూల్ బస్ డ్రైవర్‌గా.. ఇప్పుడేమో! -
Khelo India Youth Games: వెంకటాద్రి పసిడి గురి.. ఏపీ ఖాతాలో మరో స్వర్ణం
పంచ్‌కుల(హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం లభించాయి. ఆర్చరీలో అండర్–18 పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కుందేరు వెంకట్రాది బంగారు పతకం సొంతం చేసుకోగా... అండర్–18 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మాదల సూర్య హంసిని కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో వెంకటాద్రి 144–141తో కోర్డె పార్థ్ సునీల్ (మహారాష్ట్ర)పై విజయం సాధిం చాడు. సెమీఫైనల్లో వెంకటాద్రి 147–146తో ప్రథమేశ్ (మహారాష్ట్ర)పై, క్వార్టర్ ఫైనల్లో 147–145తో పెండ్యాల త్రినాథ్ చౌదరీ (ఆంధ్రప్రదేశ్)పై గెలుపొందాడు. కాంస్య పతక పోరులో సూర్య హంసిని 143–141తో అంతర్జాతీయ క్రీడాకారిణి పరిణీత్ కౌర్ (పంజాబ్)ను ఓడించింది. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 14వ స్థానంలో ఉంది. చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! -
బతకడం కష్టమని పెదవి విరిచారు.. కట్‌చేస్తే
''ఎన్ని కష్టాలు కవ్వించినా సరే...మనిషి గుండెలో ఆత్మవిశ్వాసం అనే జెండా రెపరెపలాడుతూనే ఉండాలి. పెదాలపై చిరునవ్వు ధగధగమని మెరుస్తూనే ఉండాలి..'' హరియాణాలోని ఝజ్జార్లో ఆ వీధికి వెళ్లి ‘చురుకైన పిల్లాడు ఎవరు?’ అనే ప్రశ్నకు అన్ని జవాబులు ఒకే దిక్కు వెళ్లేవి. ఆ అబ్బాయి పేరు తిన్కేష్ కౌశిక్. తొమ్మిదేళ్ల వయసులో దురదృష్టకరమైన రోజు ఒక ప్రమాదంలో రెండు కాళ్లు, ఎడమ చేయిని పోగోట్టుకున్నాడు. బతకడం కష్టం అని పెదవి విరిచారు వైద్యులు. ‘కచ్చితంగా బతుకుతాడు’ అనే ఆత్మబలంతో ఉన్నారు తల్లిదండ్రులు. చివరికి వారి ఆత్మబలమే నెగ్గింది. చికిత్స జరిగిన మూడు సంవత్సరాల కాలంలో పిల్లాడిని కంటికి రెప్పలా కాచుకున్నారు. ఆ తరువాత....అమ్మ సహాయంతో రోజూ బడికి వెళ్లడం మొదలుపెట్టాడు కౌశిక్. పాఠాలు వినడం తప్ప స్నేహితులతో ఆటలు లేవు. అయితే స్నేహితులెప్పుడూ అతడిని చిన్నచూపు చూడలేదు. రకరకాల ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ కూడా కౌశిక్‌కు కృత్రిమ కాలు సమకూర్చారు తల్లిదండ్రులు. దీనివల్ల బరువైన పనులు చేసే అవకాశం లేనప్పటికి తనకు తానుగా కాలేజికి వెళ్లడానికి ఉపకరించింది. డిగ్రీ పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు కౌశిక్. శారీరకశ్రమ లేకపోవడంతో బాగా బరువు పెరిగాడు. ఈ బరువు తనకు అదనపు సమస్యగా మారింది. దీంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. కొంతకాలం తరువాత... గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రెండు కిలోమీటర్ల మారథాన్‌లో తాను పాల్గొన్న వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అది వైరల్ అయింది. ఈ వీడియోను చూసి స్పందించిన హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ ప్రోస్థటిక్ లెగ్స్‌ను స్పాన్సర్ చేసింది. ఇది తన జీవితంలో టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది.ఫిట్నెస్ ట్రైనర్ కావాలనేది తన లక్ష్యంగా మారింది. నాగ్‌పుర్ కేంద్రంగా పనిచేసే ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ కమ్యూనిటీ ‘ఫిట్టర్’తో తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. స్విమ్మింగ్ నుంచి సైకిలింగ్ వరకు అక్కడ శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో నొప్పుల బాధలు ఇంతా అంతా కాదు. అయితే ట్రైనర్స్ ఉత్తేజకరమైన మాటలతో అతడిని నిరాశకు లోనుకానివ్వలేదు. సింగిల్ హ్యాండ్‌తో పవర్ఫుల్ స్ట్రెంత్‌ను ఎలా సమకూర్చుకోవచ్చు అనే కోణంలో కోచ్ కమల్శర్మ ఎన్నో వీడియోలను తనకు షేర్ చేశాడు. అవి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఫిట్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్‌లో పాల్గొనడం కౌశిక్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఐసిఎన్–ఇండియాకు అథ్లెట్ అంబాసిడర్‌గా నియామకం కావడంతో తనలో గట్టి ఆత్మవిశ్వాసానికి పునాది పడింది. ఇక నేపాల్‌లో బంగీ జంప్ చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. లద్దాఖ్‌లో దివ్యాంగుల కోసం ఫిట్నెస్ క్లాసులు నిర్వహించాడు కౌశిక్. తన అనుభవాలను వారితో పంచుకున్నాడు. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. ఫిట్నెస్ ట్రైనర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. అయితే తన కల అక్కడితో ఆగిపోలేదు. ఆస్ట్రేలియాలో పర్వతారోహణ చేయాలనేది తన తాజా కల. గట్టి సంకల్పబలం ఉన్నవారికి తమ కలను నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు కదా! -
రైతుల విజయోత్సవం ... సింఘు నుంచి సొంతూళ్లకు..
న్యూఢిల్లీ/చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా నిరసనలకు ప్రధాన వేదికగా కొనసాగిన ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లోని సింఘు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు, వారి ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతులు ఇళ్లకు మరిలారు. ఈ సందర్భంగా రైతులు కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. జాతీయ జెండాలు, రైతు సంఘాల జెండాలు, రంగుల విద్యుత్ దీపాలతో ట్రాక్టర్ ట్రాలీలను అందంగా అలంకరించారు. (చదవండి: అధిక సీరో పాజిటివిటీ కాపాడుతోంది!) ఇప్పటి వరకు సింఘు, ఘాజీపూర్, టిక్రీ నిరసన శిబిరాల్లో ఉపయోగించుకున్న టెంట్లు, ఇతర సామగ్రిని ట్రాలీల్లో వేసుకుని పంజాబ్, హరియాణా, యూపీ రైతులు తిరుగు పయనమయ్యారు. సింఘు ప్రాంతం భాంగ్రా నృత్యాలు, పాటలు, కీర్తనలతో మారుమోగింది. ఏడాదిపాటు ఇక్కడ గడిపిన తమకు ఈ ప్రాంతంతో, ఇక్కడి వారితో అనుబంధం ఏర్పడిందని కొందరు రైతులు అన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లడం కొంతబాధాకరంగానే ఉందని ఉద్విగ్నానికి లోనయ్యారు. జాతీయరహదారులపై పండుగ వాతావరణం డిమాండ్లను సాధించుకుని ఇళ్లకు వస్తున్న రైతులకు పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ–కర్నాల్–అంబాలా, ఢిల్లీ–హిసార్ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ప్రజలు వారికి ఎదురెళ్లి పూల వర్షం కురిపించి, స్వీట్లు తినిపించి, పూలమాలలతో సత్కరించారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన సింఘు, టిక్రి, ఘాజీపూర్, షాజహాన్పూర్లు హిందువుల పుణ్యక్షేత్రాలైన చార్‌ధామ్‌లుగా స్వరాజ్ ఇండియా సంస్థ అధ్యక్షుడు యోగీంద్రయాదవ్ అభివర్ణించారు. కాగా, రైతుల నిరసనల కారణంగా నిలిచిపోయిన ఈ నాలుగు ప్రాంతాల్లోని టోల్‌ప్లాజాలను రెండు, మూడు రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని జాతీయరహదారుల అధికారులు తెలిపారు. ఇద్దరు రైతులు మృతి టిక్రి నుంచి ఇళ్లకు వెళ్తున్న రైతుల ట్రాలీ ఒకటి హరియాణాలోని హిసార్ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొనడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: గ్రహాంతరవాసులను చూసేందకు వెళ్తున్నా!... అంటూ హాస్యగాడిలా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే చివరికి!!) -
హరియాణాలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జీ
-
రైతులపై లాఠీచార్జ్: సిగ్గుతో దేశం తలవంచుకుంటోంది!
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మళ్లీ రైతుల రక్తం చిందింది. దేశం సిగ్గుతో తలవంచుకుంటోందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్న ఒక రైతు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా రక్త మోడుతున్న రైతు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (రాబోయే మునిసిపల్ ఎన్నికల గురించి చర్చించడానికి) నేతృత్వంలోని సమావేశానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనకు దిగారు రైతులు. కర్నాల్‌లోని ఘరౌండ టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వేలాదిగా తరలివచ్చిన రైతులు రోడ్ల మీద మంచాలు వేసుకొని కూర్చొని మరీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఓసీ ధంకర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు దీంతో పోలీసులు లాఠీలతో విరుచుకు పడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. ఈ లాఠీఛార్జ్ ఘటనలో పలువురు రైతులు తీవ్రంగా గాయ పడ్డారు. దీంతో పోలీసుల దమనకాండను నిరసిస్తూ పలు హైవేలను రైతులు బ్లాక్ చేశారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశామని పోలీసు అధికారులు చెప్పారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రధాన రోడ్లు ,హైవేలను దిగ్బంధించాలని సంయుక్త కిసాన్ మోర్చా సంఘం నేతలు పిలుపు నిచ్చారు. అలాగే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, గాయపడిన వారికి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీలతో క్రూరంగా దాడి చేసారనీ, వందలాది మంది రైతులను అరెస్టు చేశారని ఎస్కేఎం నేత దర్శన్ పాల్ ఆరోపించారు. రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు రోడ్లన్నీ బ్లాక్ చేయాలని బీకేయూ నాయకుడు రాకేశ్ తికాయత్ కోరారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేసే వరకు రహదారుల దిగ్బంధనం కొనసాగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. -
బంపర్ ఆఫర్: మొక్కలు నాటితే ఎక్స్ట్రా మార్కులు..
చండీగఢ్: చదువులో భాగంగా మొక్కలు నాటిన విద్యార్థులకు ఎక్స్ట్రా మార్కులు ఇవ్వనున్నట్లు హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. 8-12 తరగతుల విద్యార్థులకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేశారు. పంచకుల జిల్లాలోని నేచర్ క్యాంప్ తప్లి అండ్ నేచర్ ట్రయల్స్ ఆఫ్ మోర్నిహిల్స్ ప్రాంతంలో పంచకర్మ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్‌లాల్ ఖట్టర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. ‘‘పర్యావరణ పరిరక్షణలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో విద్యార్థులను ప్రకృతితో కలిపేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. రాష్ట్రపరిధిలోని పాఠశాలలకు ఈ నియమం వర్తిస్తుంది. 8-12వ తరగతి విద్యార్థులు తమ పాఠశాల పరిధిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలి. దీని ప్రకారం ఆఖరి పరీక్షలో వారికి మార్కులు కేటాయిస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. చదవండి: ఆమె అడవిగా విస్తరించింది -
రైతుల ఆందోళన : సరిహద్దుల్లో శాశ్వత గృహాలు
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళనలు చేపట్టి 5 నెలల కావస్తున్నప్పటకి పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దేశ రాజధానిలోని నిరసన ప్రదేశాలలో రైతులకు చలికాలంలో అవసరమయ్యే సదుపాయలు, ఇంటర్నెట్, విద్యుత్ కోతలతో పాటు ఇతరత్రా సదుపాయలపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రైతులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. వంద రోజులే కాదు.. 500 రోజులైన వెనక్కి తగ్గేది లేదంటూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనను ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా సమీపంలో తిక్రీ సరిహద్దులో 25 శాశ్వత నివాసాలను రైతులు నిర్మించుకున్నారు. దీనికి కిసాన్ సోషల్ ఆర్మీ నాయకత్వం వహిస్తోంది. Kisan Social Army has constructed a permanent shelter at Tikri border as protest against farm laws continues "These houses are strong, permanent just like the will of the farmers. 25 houses built, 1000-2000 similar houses to be built in coming days,"Anil Malik, Kisan Social Army pic.twitter.com/4ZudQTIAqj — ANI (@ANI) March 13, 2021 అంతేగాక ఈ ఇళ్ల నిర్మాణానికి కూడా కిసాన్ సోషల్ ఆర్మీ.. రైతులకు మద్దతుగా నిలుస్తోంది. ఇటుకలతో నిర్మిస్తున్న ఈ ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి దాదాపు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చు అవుతుందట. అయితే ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామగ్రిని మాత్రమే రైతులు కొనుగొలు చేస్తున్నారని, కూలీల ఖర్చు మాత్రం వారికి ఉచితమని కిసాన్ ఆర్మీకి చెందిన అనిల్ మాలిక్ మీడయాతో పేర్కొన్నారు. అందువల్ల మున్ముందు కూడా 1000 నుంచి 2000 ఇళ్లను నిర్మించే యోచనలో రైతులు ఉన్నారని ఆయన అన్నారు. చదవండి: వందోరోజుకు రైతు ఆందోళనలు 500 రోజులైనా వెనక్కి తగ్గేది లేదు -
వందోరోజుకు రైతు ఆందోళనలు
చండీగఢ్: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలు 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో హరియాణాలో రైతు సంఘాలు కేఎంపీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. శనివారం 11 గంటల నుంచి 4 గంటల వరకు హరియాణాలో పలు ప్రాంతాల్లో హైవేపై రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్లకు అంగీకరించడం లేదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాస్తారోకో సందర్భంగా ఈ హైవేపై రాకపోకలను నియంత్రించిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. సంయుక్త కిసాన్‌మోర్చా ఈ రాస్తారోకోకు పిలుపునిచ్చింది. మూడు చట్టాలను ఉపసంహరించుకునేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు నేతలు చెప్పారు. తమ నిరసన శాంతియుతంగా ఉంటుందన్నారు. కేంద్ర అహంకారానికి నిదర్శనం సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన వందోరోజుకు చేరడం కేంద్ర దురహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ దుయ్యబట్టింది. భారత ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చగా అభివర్ణించింది. ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలామంది పిల్లలు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారని, అలాంటి రైతులను అడ్డుకునేందుకు కేంద్రం రోడ్లపై మేకులు పరుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శించారు. రైతులు తమ హక్కులను కోరుతున్నారని, ప్రభుత్వం వారిపై దమనకాండ జరుపుతోందని ట్వీట్ చేశారు. అన్నదాతలు వందరోజులుగా నిరసన చేస్తున్నా, బీజేపీ ప్రభుత్వం అబద్దాలు, అహంకారంతో కాలం గడిపిందని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. రైతాంగ ఉద్యమం చరిత్రాత్మకం సాక్షి , న్యూఢిల్లీ: సాగు వ్యతిరేక చట్టాలపై వంద రోజులుగా సాగిన ఉద్యమం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైందని ఆలిండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా అభివర్ణించాయి. శనివారం ఈ రెండు రైతు సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. 1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన దండి ఉద్యమం మాదిరిగా రైతు ఉద్యమం జరుగుతోందని స్పష్టంచేశాయి. రైతులు చేస్తున్న పోరాటం సామాన్యమైన విషయం కాదని, ఎన్నో ఇబ్బందులు, అటంకాలు, అవమానాలకి ఓర్చి ఇంత స్థాయిలో ఉద్యమిస్తున్న రైతాంగానికి ఏఐకేఎస్, ఎస్కేయూ ధన్యవాదాలు తెలిపాయి. బీజేపీ సర్కారు ఎన్నినిర్బంధాలు పెట్టినా రైతాంగం ఉద్యమించడం హర్షణీయమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పేర్కొన్నారు. -
బీజేపీ నేత ఇంట్లో భారీ చోరి
చండీగఢ్, హిసార్: హరియాణాకు చెందిన బీజేపీ నేత, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, లైసెన్స్డ్ రివాల్వర్, 10లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులు వెల్లడించారు. వివరాలు.. ఈ నెల 9న సొనాలీ ఇంటికి తాళం వేసి చండీగఢ్ వెళ్లారు. తిరిగి 15వ తారీఖున ఇంటికి వచ్చారు. ఆమె వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా... బంగారం, వెండి ఆభరణాలు, లైసెన్స్డ్ తుపాకీతో పాటు 10 లక్షల రూపాయల నగదు కూడా చోరీకి గురయినట్లు తెలిసింది. దాంతో దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సొనాలీ. సొనాలీ ఇంటి వద్ద సీసీకెమరాలు ఉండటంతో తమ గురించి వీటిలో రికార్డు అయి ఉంటుందని భావించిన దొంగలు.. తమతో పాటు డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)లో ఉన్న ఫుటేజీని కూడా తీసుకుపోయారని పోలీసులు తెలిపారు. సొనాలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్టీఎం స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుఖ్జిత్ చెప్పారు. 2019లో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సొనాలీ ఫోగాట్.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. చదవండి: డేటింగ్ యాప్‌తో వల, డ్రగ్స్ ఇచ్చి 16మందిని -
ఈసారైనా దక్కుతుందా.. బిగ్‌బాస్ ఎవరు?
పోటీలో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. నాలుగో సీజన్ ఇది. మూడు సీజన్లనూ అబ్బాయిలే తన్నుకుపోయారు. ఈసారైనా అమ్మాయి విజేతగా నిలుస్తుందా? అరియానా, హారికలకు చాన్స్ ఉందా? 100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన షో ఈరోజు ముగుస్తోంది. భావోద్వేగాల కేంద్రంగా సాగే ఈ షోలో అన్ని రకాల వొత్తిళ్లను అమ్మాయిలు దాటగలిగారు. టైటిల్ చేజిక్కించుకోగలరో లేదో చూద్దాం. ఒక అంచనా. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా నిర్వహించే హిందీ బిగ్‌బాస్‌లో ఇప్పుడు 14వ సీజన్ నడుస్తోంది. పూర్తయిన 13 సీజన్లలో ఐదు మంది మహిళా విజేతలు ఉన్నారు. పురుషులకే ఎక్కువగా ఓటింగ్ జరిగే క్రేజ్ ఉన్నచోట ఒకరకంగా పెద్ద నంబర్. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో మహిళలే ఉత్తమ మానవ ప్రవర్తనను ప్రదర్శించారని దీనిని బట్టి రుజువైంది. ఎందుకంటే బిగ్‌బాస్ షో వ్యక్తుల బలాబలాలు, శక్తి సామర్థ్యాలను కాక మానవ ప్రవర్తనలను ప్రేక్షకుల ముందు పెట్టి ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం అని చెబుతుంది. మానవ ప్రవర్తనను బయటకు తేవడానికి బిగ్‌బాస్ హౌస్‌లో రకరకాల సందర్భాలను సృష్టిస్తారు. ఎత్తుకు ఎదగడానికి, పతనం కావడానికి కూడా సమాన అవకాశం ఉంటుంది. అలాంటి షోలో ఐదు మంది స్త్రీలు గెలిచి తాము మెరుగైన మానవులం అని చెప్పారు. కాని తెలుగులో కూడా అంతటి ప్రతిభావంతంగా రాణించినా పురుషులకు దీటుగా నిలిచినా స్త్రీలకు గత మూడు సీజన్లలో టైటిల్ దక్కలేదు. ఈసారైనా దక్కుతుందా... తెలియదు. మిస్సయిన శ్రీముఖి, గీతా మాధురి తెలుగు బిగ్‌బాస్ 1,2,3 సీజన్లలో మహిళా కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇచ్చారు. సీజన్ 1లో నటి హరితేజ , నటి అర్చన చివరివరకూ నిలిచారు. సీజన్ 2లో గాయని గీతామాధురి రన్నర్ అప్‌గా నిలిచారు. నటుడు కౌశల్ ఆ సీజన్‌కు విన్నర్ అయినా గీతా మాధురి గెలుస్తుందని చాలామంది భావించారు. సీజన్ 3 లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నారు. విజేత ఓటింగ్ ద్వారా నిర్ణయం అవుతారని నిర్వాహకులు చెబుతారు. కాని ఓటింగ్ సరళి పురుషుల ఫేవర్లో వెళుతోంది. స్త్రీలను విజేతలకు నిలబెట్టడానికి బయట సరైన బృందాలు పని చేయడం లేదనే భావన కూడా ఉంది. ఈసారి అరియానా, హారిక బిగ్‌బాస్ 4 సీజన్ కరోనాకు వెరవక అట్టహాసంగా సెప్టెంబర్ 6న మొదలైంది. మొత్తం 105 రోజుల ఈ షోలో చివరి రోజు ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వారిలో 10 మంది స్త్రీలు ఉన్నారు. సీజన్‌కు అట్రాక్షన్‌గా నిలుస్తుంది అనుకున్న గంగవ్వ ఆరోగ్య కారణాల రీత్యా నిష్క్రమించాల్సి వచ్చింది. ఫైనల్ వరకూ వెళుతుందనుకున్న లాస్య 77వ రోజున నిష్క్రమిస్తే గట్టి పోటీ ఇస్తూ వచ్చిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ చివరి వారంలో ఎవిక్ట్ అయ్యింది. చివరి ఐదుమంది పోటీదారుల్లో టెలివిజన్ యాంకర్ అరియానా, యూ ట్యూబ్ స్టార్ హారికా మిగిలారు. అమ్మాయిలు గెలుస్తారా? ఓటింగ్ సరళిని, హౌస్‌లో అరియానా, హారికల గేమ్ తీరును, ప్రవర్తనను గమనించిన పరిశీలకులు చాలామంది ఈసారి బిగ్‌బాస్ టైటిల్ గెలిచేంత గట్టిగా వీరిరువురు లేరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరియానా ప్రవర్తన నిక్కచ్చిగా ఉండటం ఆమెకు మైనస్ అయ్యింది. ఒక దశలో హౌస్మేట్స్ అందరూ ఆమెను ఎలిమినేట్ చేయాలనే వరకూ వెళ్లారు. ఇక హారికా పట్ల అభ్యంతరాలు లేకున్నా ఆమె గట్టిగా ఒక అభిప్రాయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక యాటిట్యూడ్‌ని చూపలేకపోయింది. మరోవైపు పురుష కంటెస్టెంట్లు అభిజిత్, సొహైల్, అఖిల్ తమ సొంత తీరుతో ఓట్లను నిలబెట్టుకున్నారు. 50 లక్షలు ప్రైజ్ బిగ్‌బాస్ 4 విజేతకు 50 లక్షల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఇప్పుడు పోటీలో నిలుచున్న ఐదుగురూ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అభ్యర్థులే. ఈ మొత్తం చాలా పెద్దది తమ దృష్టిలో అని వారే చెప్పుకున్నారు. అందరికీ సొంతింటి కలే లక్ష్యంగా ఉంది. ఈ 50 లక్షల కోసం బిగ్‌బాస్‌లో గత 100 రోజులుగా అభ్యర్థులు అనేక అగ్నిపరీక్షలకు లోనయ్యారు. హారికా, అరియానాలు కూడా ఎన్నోసార్లు గట్టి దెబ్బలు తిన్నా తట్టుకుని నిలుచున్నారు. హారికాకు సొహైల్‌కు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలే గెలిచాయి. అరియానా సొహైల్‌కు మధ్య కూడా యుద్ధాలే జరిగాయి. హారికా అభిజిత్ ఒక జట్టు కడితే సొహైల్– అఖిల్ ఒక జట్టుగా మారి అరియానాను ఒంటరిని చేశారు. అయితే బయట ప్రేక్షకులలో అరియానా మద్దతుదారులు గట్టిగానే ఉన్నారు. ఎవిక్ట్ అయ్యి వెళ్లే ముందు మోనల్ గజ్జర్ విజేత అయ్యే ఏ లక్షణమూ అరియానాలో లేదు అని చెప్పి వెళ్లింది. కాని ప్రేక్షకుల తీర్పు ఈసారి అమ్మాయిల వైపు మొగ్గితే ఇద్దరిలో ఒకరు గెలిచి మహిళా విజేతల ఖాతా తెరుస్తారు. నేడే ఫైనల్స్ నేడు మా టీవీలో ప్రసారమయ్యే ఫైనల్స్‌లో విజేత ప్రకటన వెలువడుతుంది. చీఫ్‌గెస్ట్‌గా చిరంజీవి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో వెంకటేశ్ హాజరయ్యారు. అంతకు ముందు సీజన్ చిరంజీవి వచ్చారు. మళ్లీ ఆయనే రావచ్చు అంటున్నారు. ఏమైనా లాక్డౌన్ కాలంలో మొదలైన ఈ షో పెద్ద ఆటంకాలు లేకుండా చివరి అంకానికి చేరడం వెనుక టీమ్ కష్టం ఎంతో ఉంటుంది. వారికి మెచ్చుకోళ్లు చెప్పక తప్పదు. విజేత ప్రకటన కోసం ఎదురు చూద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
డిమాండ్లు నెరవేర్చేదాకా కదలం
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసే దాకా తమ పోరాటం ఆగదని తేల్చిచెబుతున్నారు. ఢిల్లీలోని సంత్ నిరంకారీ మైదానంలో శాంతియుతంగా ధర్నా చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, వేలాది మంది పంజాబ్, హరియాణా రైతులు శనివారం ఢిల్లీ శివార్లలోని సింగూ, టిక్రీ సరిహద్దులోనే బైఠాయించారు. సంత్ నిరంకారీ మైదానానికి వెళ్లే ప్రసక్తే లేదని, తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవర్చే వరకూ ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వంట పాత్రలు సైతం తెచ్చుకున్నారు. ట్రాక్టర్ ట్రాలీలు, వాహనాల్లోనే నిద్రిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారు లెక్కచేయడం లేదు. ఆదివారం సమావేశమై, తదుపరి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్జీత్‌సింగ్ మహల్ చెప్పారు. పంజాబ్, హరియాణా రైతులకు మద్దతుగా ఉత్తర ప్రదేశ్ రైతులు కూడా ఘాజీపూర్ సరిహద్దు వద్ద బైఠాయించారు. ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ–మీర్జాపూర్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రైతులు ధర్నా చేయాలనుకుంటే ఉత్తర ఢిల్లీలోని సంత్ నిరంకారీ మైదానానికి వెళ్లాలని జాయింట్ కమిషనర్ సురేందర్ సింగ్ యాదవ్ సూచించారు. అయితే, జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సంత్ నిరంకారీ గ్రౌండ్లో రైతుల నిరసన కొనసాగుతోంది. శనివారం రైతుల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 3న రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఉద్యమం వెనుక పంజాబ్ సీఎం కొందరు వ్యక్తులు రైతులను రెచ్చగొడుతున్నారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కార్యాలయ సిబ్బంది రైతులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్కడికి వెళ్తే చర్చలకు సిద్ధం: అమిత్ షా సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్న రైతులు ఢిల్లీలోని సంత్ నిరంకారీ గ్రౌండ్‌కు వెళ్లాలని హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. అక్కడే శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయవచ్చని చెప్పారు. తాము సూచించిన ప్రాంతానికి వెళ్లిన రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఢిల్లీ శివార్లలో బైఠాయించిన రైతులు తీవ్ర చలితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే వెంటనే నిరంకారీ మైదానానికి వెళ్లాలని అమిత్ షా హోంశాఖ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. -
ఛలో ఢిల్లీ: కొనసాగుతున్న రైతుల ఆందోళన
-
వ్యవసాయ బిల్లులపై నిరసనలు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతన్నలు భగ్గుమన్నారు. తమకు నష్టదాయకమైన ఈ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలు శుక్రవారం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా రైతులు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చారు. రహదారులను దిగ్బంధించారు. వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ తాము పోరాటం ఆపే ప్రసక్తే లేదని నినదించారు. రైతుల నిరసనలతో పంజాబ్, హరియాణాలో జనం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. గురువారం ప్రారంభమైన రైలు రోకో రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. వ్యవసాయ బిల్లులపై రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ బంద్‌కు మద్దతునిచ్చాయి. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ రాష్ట్రంలో పలుచోట్ల రోడ్ల దిగ్బంధం చేపట్టింది. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారుస్తారా? అని నిలదీసింది. కనీస మద్దతు ధరను రైతుల నుంచి దూరం చేయడం ఏమిటని ప్రశ్నించింది. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. -
వ్యవసాయం కార్పొరేటీకరణ ?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర రైతులు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. ఇన్నాళ్లూ ఆర్డినెన్స్ రూపంలో ఉన్న వీటిని రైతన్నలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. ఆ మూడు బిల్లులు 1. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు 2. రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు 3. నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు ప్రభుత్వం చెబుతున్నదేంటి ? మొదటి బిల్లు రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు. ఇక రెండో బిల్లు రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు. ఇక మూడో బిల్లు నిత్యావసరాల సవరణ బిల్లు ప్రకారం చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి. కాగా నిత్యావసరాల సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. రైతుల డిమాండ్లు ఇవీ ► మూడు బిల్లుల్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి ► మండీ వ్యవస్థని కొనసాగించాలి ► రుణ మాఫీ చేయాలి ► స్వామినాథన్ సిఫార్స్‌ల మేరకు పంటలకి కనీస మద్దతు ధర -
గురుగ్రామ్‌పై మిడతల దండు దాడి
గురుగ్రామ్/న్యూఢిల్లీ: దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించిన రాకాసిమిడతల గుంపులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దు దాకా చేరాయి. ఢిల్లీలోకి ఇంకా ప్రవేశించలేదని అధికారులు చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు వైపు పయనమైన మిడతల దండు శనివారం ఉదయం 11.30 గంటలకు గురుగ్రామ్‌లోకి ప్రవేశించిందని హరియాణా వ్యవసాయ శాఖలో మిడతల హెచ్చరిక విభాగం అధికారి కేఎల్ గుర్జార్ తెలిపారు. ప్రస్తుతం హరియాణాలోని పాల్వాల్ వైపు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పంటలను భోంచేసే ఈ మిడతలు ఈ ఏడాది మే నెలలో ఆఫ్రికా ఎడారుల నుంచి భారత్‌లోకి అడుగుపెట్టాయి. తొలుత రాజస్తాన్‌లో, తర్వాత పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించాయి. ఢిల్లీలో హై అలర్ట్ మిడతల దండు ఢిల్లీ సరిహద్దు దాకా రావడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో శనివారం హైఅలర్ట్ ప్రకటించింది. మిడతలు దండెత్తకుండా చెట్లపై రసాయనాలు, పురుగు మందులు చల్లాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వేప ఆకులను మండిస్తే పొగకు మిడతలు పారిపోతాయని వెల్లడించింది. -
జడ్జిమెంట్ డే
-
ఫలించిన బీజేపీ వ్యూహం
-
మహారాష్ట్ర, హరియాణాలో పోలింగ్ ప్రారంభం
-
హరియాణాలో మోదీ ఎన్నికల ప్రచారం
-
దీపావళికి ముందే ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ దీపావళి పండుగ (అక్టోబర్ 27వ తేదీ)కు ముందుగానే ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని సమాచారం. మహారాష్ట్ర, హరియాణాలతోపాటు ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిపే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే దఫా నోటిఫికేషన్ విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో, ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తుపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బీజేపీతో పొత్తుకు శివసేన సిద్ధంగానే ఉన్నప్పటికీ సీట్ల పంపకాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉండాలని శివసేన శ్రేణులకు అధినేత ఉద్ధవ్ ఠాక్రే సూచించినట్టు తెలుస్తోంది. -
బీజేపీలోకి రెజ్లర్ బబిత
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, పలు అంతర్జాతీయ పోటీల్లో విజ యాలు సాధించి సత్తా చాటిన రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమెకు శిక్షణ నిచ్చిన ఆమె తండ్రి మహవీర్‌సింగ్ ఫొగాట్‌లు సోమవారం బీజేపీలో చేరారు. వీరిద్దరి విజయాలు స్ఫూర్తిగా ‘దంగల్’ పేరుతో ఆమిర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఓ సినిమా కూడా రూపొందిన విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు, హరియాణా రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అనిల్ జైన్ సమక్షంలో వారు బీజేపీ తీర్థం పుచ్చుకు న్నారు. యువశక్తికి బబిత నిదర్శనంగా నిలిచిం దని కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్‌ల చేరిక పార్టీకి కొత్త శక్తినిస్తుందని బీజేపీ పేర్కొంది. బబిత చేరిక హరియాణా బీజేపీకి మంచిరోజు అని అనిల్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ చరిత్రను తిరగరాశారని బబిత ప్రశంసించారు. -
బీజేపీ కొత్త ఎన్నికల ఇన్చార్జులు
న్యూఢిల్లీ: హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్రల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జులను బీజేపీ నియమించింది. ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జిగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్, హరియాణాకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మహారాష్ట్రకు పార్టీ జనరల్ సెక్రటరీ భూపేంద్ర యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జిగా పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్‌ను నియమించినట్లు ప్రకటనలో పేర్కొంది. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఈ ఏడాది చివరలో, ఢిల్లీలో 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మినహా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, వాటిని నిలబెట్టుకోవడమే కాకుండా, ఢిల్లీలో పార్టీ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో పార్టీ అధినాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలను పార్టీ ఆయా రాష్ట్రాలకు ఇన్చార్జులుగా నియమించింది. -
తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి
చండీగఢ్ : ఇంకా కన్ను కూడా తెరవని పసిపాపను నిర్దాక్షిణ్యంగా మురికి కాల్వలోకి విసిరేసింది ఓ కసాయి తల్లి. కానీ నోరు లేని మూగజీవులు ఆ బిడ్డను కాపాడి మానవత్వం చాటుకున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణం హరియాణలోని కైతాల్ జిల్లాలో చోటు చేసుకుంది. సీసీటీవీ రికార్డులో ఉన్న దాని ప్రకారం శుక్రవారం ఓ మహిళ డోగ్రన్ గేట్ ప్రాంతంలో ఓ పసిపాపను ప్లాస్టిక్ కవర్లో చుట్టి మురికి కాల్వలోకి విసిరి వెళ్లి పోయింది. అయితే కుక్కలు ఆ కవర్‌ను బయటకు తీసుకురావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్లాస్టిక్ కవర్లో పసిపాపను చూసి కుక్కలు అరుస్తూ.. బాటసారులను అప్రమత్తం చేశాయి. పసిబిడ్డను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విసిరేయడం మూలానా చిన్నారి తలకు బలమైన గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే నయమవుతుందన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ దారుణానికి పాల్పడిన మహిళ గురించి ఆరా తీస్తున్నాం. త్వరలోనే ఆమెను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
యోగా చేశారు.. మ్యాట్లు ఎత్తుకెళ్లారు
చండీగఢ్ : దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు వివిధ ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హరియాణా రోహతక్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ఎల్ ఖట్టర్‌తో కలిసి యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేడుక కావడంతో.. చాలా ఖరీదైన యోగా మ్యాట్స్ తెప్పించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత జనాలు.. యోగా మ్యాట్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఒకరినొకరు తోసుకుంటూ మ్యాట్స్ కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వాలంటీర్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే... వారితో గొడవకు దిగారు. -
మహిళపై దాడి.. పోలీసులపై చర్యలు
చండీగఢ్ : మహిళను బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టినందుకు గాను ఐదుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఫరిదాబాద్‌కు చెందిన ఓ ఐదుగురు పోలీసు అధికారులు.. ఓ మహిళపై దాడి చేశారు. బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దీనిపై స్పందించారు. వీడియోలో ఉన్న అధికారులపై కేసు నమోదు చేయడమే కాక వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ చేయగా.. మరో ముగ్గురు స్పెషల్ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించారు. అంతేకాక సదరు అధికారుల మీద ఆదర్శ నగర్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వీడియో సంవత్సరం క్రితం నాటిదని అధికారులు తెలిపారు. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. Now that's #Faridabad #Police trying to practice #BetiBachao #BetiPadhao ethos. Even if this #woman is guilty of any crime, how justified is the act ? #NCR pic.twitter.com/2tr78SGFrt — PRAVEEN DUTTA (@PraveenDutta) May 28, 2019 -
అడ్డంకులు, ఆలస్యం వారి నైజం
గుర్‌గ్రామ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రాజెక్టులను జాప్యం చేసి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సోమవారం ఆయన హరియాణా రాష్ట్రం గుర్‌గ్రామ్ జిల్లాలోని 83 కిలోమీటర్ల కుండ్లి–మనేసర్–పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. అనంతరం సుల్తాన్‌పూర్‌లో జరిగిన సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3.2 కిలోమీటర్ల వల్లభ్‌గఢ్– ముజేసర్ మెట్రో రైల్ లింక్ ప్రారంభోత్సవం, పల్వాల్ జిల్లాలో శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘హర్యానా ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. చేపట్టిన పనిని దృఢ సంకల్పంతో పూర్తి చేయడమనే మా ప్రభుత్వ వైఖరితోపాటు గత పాలకులు ఇదే పనిని అసంపూర్తిగా వదిలేసిన తీరును మనం ఇక్కడ గమనించాలి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల క్రితమే ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల సమయంలోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. 12 ఏళ్లు పట్టింది. అంచనా వ్యయం రూ.1,200 కోట్ల నుంచి భారీగా పెరిగిపోయింది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో (సీడబ్ల్యూజీ కుంభకోణం) జరిగిందే, ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలోనూ చోటుచేసుకుంది. అవాంతరాలు కల్పించడం, తప్పుదోవ పట్టించడం, ఆలస్యం చేయడం (అట్కానా, భట్కానా, లట్కానా) గత పాలకుల నైజం. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రజల డబ్బు వృథా కావడంతోపాటు, ప్రజలకు అన్యాయం ఎలా జరిగిందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 135 కిలోమీటర్ల పొడవైన కేఎంపీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6,400 కోట్లు వెచ్చించింది. దీనిలోని 52 కిలోమీటర్ల రహదారి 2016లోనే అందుబాటు లోకి వచ్చింది. వల్లభ్‌గఢ్– ముజేసర్ మెట్రో రైల్ లింక్ నిర్మాణానికి రూ.580 కోట్లు ఖర్చు కాగా, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.989 కోట్లు కేటాయించారు. జాతీయ రాజధాని ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీకి వాహనాల రాకపోకల రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు రాజధాని ప్రాంతంలో కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టనుంది. పూర్తికాని కేఎంపీతో ముప్పు: కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసంపూర్తి కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేను చట్టవిరుద్ధంగా ప్రారంభించి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో తక్షణ లబ్ధి పొందే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఎక్స్‌ప్రెస్‌వేపై రాకపోకలను ప్రారంభించారని విమర్శించింది. -
కీచక భర్త: నవవధువుపై సామూహిక అత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాల కారణంగా ఓ నవవధువు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన కురుక్షేత్రలోని బాబైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. రెండు వారాల క్రితం ( సెప్టెంబర్ 12) మఖేష్, అమేధి (పేర్లు మార్చాం)లకు వివాహమైంది. అయితే, శోభనం రాత్రి గదిలోకి వెళ్లిన అమేధి(22)కి ఆమె భర్త పాలలో మత్తు మందు కలిపి తాగించాడు. అమేధి స్పృహ కోల్పోయిన తర్వాత ముఖేష్, అతని సోదరుడు, బావ, మరో నలుగురు తాంత్రికులు యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల నరకయాతన అనంతరం యువతి అక్కడి నుంచి బయటపడిందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు తన తండ్రితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి కురుక్షేత్ర మహిళా పోలీస్‌స్టేషన్‌కు కేసు బదిలీ అయిందనీ, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని స్టేషన్ ఆఫీసర్ శీలవతి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి తరలించామని అన్నారు. కాగా, ఈ ఘటనలో పోలీసులు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. కాగా, అత్తమామలు, ఆడపడుచు, తాంత్రిక పూజల కోసం వచ్చిన నలుగురు దుండగులు యవతిపై అఘాయిత్యం జరగడానికి ముఖ్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు. -
హరియాణా గ్యాంగ్‌రేప్‌పై ‘సిట్’
చండీగఢ్/న్యూఢిల్లీ: హరియాణాలో సీబీఎస్ఈ టాపర్‌గా నిలిచిన యువతి(19)పై సామూహిక అత్యాచారం చేసినవారిలో ఓ ఆర్మీ జవాను కూడా ఉన్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ బీఎస్ సంధూ తెలిపారు. బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డ దుండగులు ఇంకా పరారీలోనే ఉన్నారని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు నూహ్ ఎస్పీ నజ్నీన్ భాసిన్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశామన్నారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆర్మీ జవాన్ పంకజ్‌ను అరెస్ట్ చేసేందుకు ఓ బృందాన్ని రాజస్తాన్‌లోని కోటకు పంపామని సంధూ పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామనీ, పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ తెలియజేస్తే రూ.లక్ష నజరానాగా అందజేస్తామని ప్రకటించారు. వైద్య పరీక్షల్లో యువతిపై లైంగికదాడి జరిగినట్లు తేలిందన్నారు. కాగా, జవాన్ పంకజ్ విషయంలో పోలీసులకు సహకరిస్తామని ఆర్మీ ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్(ఎన్డబ్ల్యూసీ).. వీలైనంత త్వరగా దీనిపై నివేదికను సమర్పించాలని హరియాణా డీజీపీ సంధూను ఆదేశించింది. కనియా జిల్లాలో కోచింగ్ క్లాస్‌కు వెళ్లి తిరిగివస్తున్న ఓ యువతిని బుధవారం ముగ్గురు యువకులు కిడ్నాప్‌చేసి గ్యాంగ్‌రేప్ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 9 మంది బాధితురాలిపై లైంగికదాడికి దిగారు. ఆమె స్పృహ కోల్పోవడంతో బస్టాండ్‌లో పడేసి వెళ్లిపోయారు. -
మహిళపై 40 మంది అత్యాచారం
చండీగఢ్: హరియాణాలోని పంచ్‌కుల జిల్లాలోని మోర్ని ప్రాంతంలో ఓ 22 ఏళ్ల వివాహితను బంధించి నాలుగు రోజుల పాటు దాదాపు 40 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగమిస్తామని చెప్పి తెలిసిన వ్యక్తి ఒకరు తన భార్యను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారని అక్కడే నాలుగు రోజుల పాటు బంధించి డ్రగ్స్ ఇచ్చి చిత్రహింసలు పెడుతూ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి భర్త మీడియాకు తెలిపారు. ‘జూలై 15 నుంచి 18 వరకు ప్రతిరోజూ 10 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడిన ఆమె నాకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పింది. నా భార్య ఇంటికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం’అని చెప్పారు. గెస్ట్‌హౌస్ యజమానితో పాటు మేనేజర్, మరొకర్ని పోలీసులు అరెస్టు చేశారు. -
మహిళ ఐఏఎస్‌కు తప్పని లైంగిక వేధింపులు
చంఢీఘడ్ : తనను ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా ఐఏఎస్ అధికారి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయడం హరియాణాలో కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఫైళ్లల్లో వ్యతిరేకంగా రాయడం వల్లే తనను వేధిస్తున్నాడని ఆమె పేర్కొంది. ఆ అధికారి తనపై అనుచిత వాఖ్యలు చేశాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘ నన్ను ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు కలవమని ఆ అధికారి చెప్పారు. నేను ఆయన ఆఫీస్‌కు వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఆఫీస్‌లోని ఎవరిని అనుమతించలేదు. నేను అతని ముందు కుర్చిలో కూర్చున్నాను. ఆయన అక్కడ వద్దని చెప్పి తన పక్కన ఉన్న కుర్చిలో కూర్చోమన్నారు. ఆ సమయంలో నాపై దురుసుగా ప్రవర్తించారు. నేను వెంటనే కూర్చిని పక్కకు నెట్టాను’ అని ఆమె ఫేస్బుక్లో తెలిపారు. గతంలో కూడా అధికారిక ఫైళ్లల్లో తమకు వ్యతిరేకంగా రాయొద్దని బెదిరించారని పేర్కొన్నారు. ఆ సమయంలో తనను కొత్త పెళ్లి కూతురితో పోలుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడని వాపోయారు. అంతే కాకుండా మరో మహిళ అధికారిణి కూడా తనను బెదిరించిందని తెలిపిపారు. తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీని తొలగించారని, ఈ విషయంపై రాష్ట్రపతి భవన్ అధికారులకు మెయిల్ చేశానని పేర్కొంది. అధికారిక ఫైళ్లలో వ్యతిరేకంగా రాయొద్దంటూ తరచూ బెదిరిస్తున్నారని వాపోయారు. కాగా ఈ విషయాన్ని ఆ సీనియర్ అధికారి ఖండించారు. ఆమె చెప్పేది అసత్యాలు, నిరాధారమైనవని వ్యాఖ్యానించారు. ‘ ఆమెపై ఎలాంటి అనుచిత వాఖ్యలు చేయలేదు. ఆమెను ఆఫీస్‌కు పిలిచించింది వాస్తవమే. ఆ సమయంలో నా ఆఫీస్‌లోకి చాలా మంది వచ్చి వెళ్లారు. కొద్ది నిమిషాలు మాత్రమే ఆమె ఒంటరిగా ఉంది. ఆమెకు కావాల్సిన సదుపాయాలు అన్ని ఏర్పాటు చేశాం. అన్ని శాఖల అధికారులు ఒప్పుకున్న ఫైళ్లను ఆమె వ్యతిరేకించింది. అలా ప్రతి ఫైల్‌పై వ్యతిరేక కామెంట్లు రయొద్దంటూ సలహా ఇచ్చాను. ఆమె యంగ్ ఆఫీసర్ అని మాత్రమె నేను సలహాలు ఇచ్చాను. కానీ నాపై నిరాధరమైన అసత్యాలను ప్రచారం చేస్తోంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు. కాగా సీనియర్ అధికారి వ్యాఖ్యలపై మహిళా ఐఏఎస్ స్పందిస్తూ..‘ నేను ఫేస్ బుక్‌లో చెప్పిన ప్రతి మాట వాస్తవం. కొద్దిరోజుల్లో సీసీటీవీ పుటేజీ నుంచి అసలు నిజాలు బయటపడతాయి’ అని పేర్కొన్నారు -
బీజేపీకి ఆయన గుడ్‌బై చెప్పేశారు!
చండీగఢ్: ‘పద్మావతి’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరియాణ బీజేపీ నేత సూరజ్‌పాల్ అమూ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ హరియాణా మీడియా చీఫ్ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ‘పద్మావతి’ సినిమా వివాదం నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ తలలు నరికితే రూ. పదికోట్లు ఇస్తానని సూరజ్‌పాల్ వివాదాస్పద ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం కన్నెర్ర జేసింది. షోకాజ్ నోటీసు జారీచేసి వివరణ కోరింది. బీజేపీ అధినాయకత్వం, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తీరుతో అసంతృప్తితోనే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం ఖట్టర్లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని, కార్యకర్తలకు ఖట్టర్ కనీసం గౌరవం ఇవ్వడం లేదని సూరజ్‌పాల్ విమర్శించారు. -
హరియాణాలో హై అలర్ట్
-
హరియాణాలో హై అలర్ట్
నేడు డేరా చీఫ్ గుర్మీత్ సింగ్‌కు శిక్ష ఖరారు ► రోహ్తక్ జైలుకు హెలికాప్టర్లో వెళ్లనున్న న్యాయమూర్తి ► హింసపై హెచ్చరించిన ఇంటెలిజెన్స్.. అప్రమత్తమైన పంజాబ్ ప్రభుత్వం ► 144 సెక్షన్ అమలు.. పటిష్టమైన భద్రత ఏర్పాటు ► హరియాణాలో నేడు విద్యాసంస్థలకు సెలవు.. రేపటి వరకు ఇంటర్నెట్పై నిషేధం చండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ (50)కు అత్యాచారం కేసులో నేడు శిక్ష ఖరారు కానుంది. రోహ్తక్ జిల్లా సునరియా జైల్లో ఉన్న గుర్మీత్‌కు జైలు గోడల మధ్యే సీబీఐ కోర్టు న్యాయమూర్తి శిక్ష విధించనున్నారు. 2002 నాటి ఓ అత్యాచార కేసులో డేరా చీఫ్‌ను సీబీఐ కోర్టు శుక్రవారం దోషిగా ప్రకటించటం.. అనంతరం హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో అతని అభిమానులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు హాల్లో కాకుండా జైల్లోనే గుర్మీత్‌కు శిక్ష ఖరారుచేయాలని సీబీఐ కోర్టు న్యాయమూర్తి నిర్ణయించారు. ఇందుకోసం జైల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచకుల నుంచి న్యాయమూర్తి జగ్దీప్ సింగ్‌ను ప్రత్యేక హెలికాప్టర్లో సునరియా జైలుకు తీసుకెళ్లనున్నారు. శుక్రవారం నాటి తీర్పు అనంతరం డేరా అభిమానుల ఉన్మాదకాండలో మృతిచెందిన వారి సంఖ్య 38కి చేరింది. హింసపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక గుర్మీత్‌సింగ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో హరియాణాలో హింస చెలరేగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ గొడవలు కొన్నిరోజులపాటు కొనసాగే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో శిక్ష ప్రకటించాక మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పంచకుల, సిర్సాలతోపాటుగా రోహ్తక్ చుట్టుపక్కన ప్రాంతాల్లోనూ 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. గుర్మీత్ సింగ్‌ను విడిపించేందుకు ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జైలుకు వెళ్లే మార్గాల్లోనూ అంచెలంచెలుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రోహ్తక్ రేంజ్ ఐజీ నవ్‌దీప్ విర్క్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శని, ఆదివారాల్లో హరియాణా, పంజాబ్‌లలో ఎక్కడా గొడవలు జరగలేదని ఆయన తెలిపారు. తీర్పు నేపథ్యంలో ఢిల్లీలోనూ హై అలర్ట్ ప్రకటించారు. గుర్మీత్‌ను తప్పించే యత్నం పంచకుల కోర్టులో శుక్రవారం తీర్పు వెలువడిన తర్వాత గుర్మీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన్ను తప్పించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఏడుగురు గుర్మీత్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని దేశద్రోహం, హత్యాయత్నం కేసుల కింద పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు హరియాణా పోలీసులు కూడా ఉన్నారు. సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంతో (మహిళలు, చిన్నారులు సహా లక్షమంది ఉంటారని అంచనా) పాటుగా వివిధ ఇతర కేంద్రాల్లో ఉన్న మద్దతుదారులు, అభిమానులను వారి ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. డేరా కేంద్రాలన్నింటినీ ఖాళీ చేయాలని ఆర్మీ, పారామిలటరీ బలగాలు ఆదేశించాయి. శిక్ష ప్రకటించాకే సోదాలు శిక్ష ఖరారు నేపథ్యంలో హరియాణాలో సోమ వారం విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. హరియాణా, పంజాబ్‌ల్లోని పలు ప్రాంతాల్లో నిలిపేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11.30 వరకు నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సిర్సా మినహా పలు ప్రాంతాల్లో కొంతసేపు కర్ఫ్యూను సడలించారు. డేరా సచ్చా సౌదా అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గుర్మీత్‌కు శిక్ష పడిన తర్వాతే డేరా ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
గ్యాంగ్ రేప్, హత్య.. ఇద్దరు పోలీసులు సస్పెండ్
సోనిపట్: యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ‘నిర్భయ’ను మించి హర్యానాలో చోటుచేసుకున్న మరో ఘటనలో ఇద్దరు పోలీసులు సస్పెండ్ కాగా, మరో పోలీసును బదిలీ చేశారు. హరియాణాలోని రోహ్తక్లో గత వారం ఓ మహిళ (23)పై కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికివేసిన విషయం విదితమే. ఈ పాశవిక ఘటనపై హర్యానా డీజీపీ బీఎస్ సంధు పోలీసు ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష జరిపారు. గ్యాంగ్ రేప్ కేసు విచారణలో జాప్యం చేస్తూ అలసత్వం ప్రదరిస్తున్నారని ఆగ్రహించిన డీజీపీ సోనిపట్ ఎస్పీని, ఏఎస్ఐ జోగిందర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. సోనిపట్ ఎస్‌హెచ్‌వో అజయ్‌ని సోనిపట్ పోలీస్ లైన్స్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. రోహ్తక్ ఎస్పీ అశ్విన్ శెన్వీపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఈ కేసులో ఇద్దరు నిందితులు సుమీత్, వికాస్‌లను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం ఇద్దరినీ వారం రోజులపాటు పోలీస్ కస్టడీకి తరలించారు. మే 22న నిందితులను సోనిపట్ జిల్లా కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. -
రేప్ చేసి.. ముక్కలుగా నరికి..
హరియాణాలో మరో నిర్భయ ఘటన సోనిపట్: యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ‘నిర్భయ’ను మించిన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ (23)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికివేశారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత 9వ తేదీన సోనిపట్‌లో మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. రోహ్తక్కు కారులో తరలించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు సోనిపట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 11వ తేదీన రోహ్తక్లో మృతదేహాన్ని గుర్తించామని, బాధిత మహిళ ముఖంపైన, పలుచోట్ల కుక్కలు కరిచినట్లు పేర్కొన్నారు. ‘ఆ మహిళపై తొలుత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఇటుకతో తీవ్రంగా కొట్టారు. ఆమె ముఖాన్ని బండరాయికేసి కొట్టారు. తలకు తీవ్రగాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది’ అని ఎస్సై అజయ్ మలిక్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు సుమీత్, వికాస్‌లను అరెస్టు చేసినట్లు మలిక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం ఇద్దరినీ రెండు రోజుల కస్టడీకి తరలించారు. బాధితురాలికి సుమిత్ పరిచయస్తుడేనని పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బాధిత మహిళను కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ‘హత్యాచార’ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోనిపట్‌లో మహిళను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పదించారు. దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. మరో మూడు నెలల్లో హరియాణ వాసుల డేటాబేస్ పూర్తవుతుందని వెల్లడించారు. -
ఆర్మీ కొలువు... కష్టాలకు సెలవు
►ఇక లక్ష్యాలే మిగిలాయి ►జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా న్యూఢిల్లీ: చిన్నప్పటి నుంచి కష్టాలతోనే సహవాసం. పూటగడవని జీవితం... ఇవన్నీ అనుభవిస్తూనే... ఆనందాన్ని ఆటలో వెతుక్కున్నాడు. అదే అన్నం పెడుతుందని, సరదా ఆటే తనకు సర్వస్వం అవుతుందని, పేరు తెస్తుందని ఆనాడు ఊహించలేదు. కానీ ఆటలో కష్టపడితే... పోటీల్లో ప్రతిభ చాటితే... విజేత అవుతాడని ప్రపంచ రికార్డుతో చాటిచెప్పాడు యువ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. 19 ఏళ్ల ఈ అథ్లెట్ ప్రదర్శన బక్కచిక్కిన రైతు కుటుంబంలో ఎక్కడలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది. హరియాణా రాష్ట్రం పానిపట్‌కు సమీపంలోని ఖాంద్రా గ్రామంలో నీరజ్ తండ్రిది నిరుపేద రైతు కుటుంబం. ఏడాదంతా ఎండల్లో వానల్లో కష్టపడినా... పైరు పండితేనే అతని కుటుంబం గడుస్తుంది. ఇలాంటి కష్టాల నడుమ చదువు సంధ్యలతో పాటు అతడెంచుకున్న జావెలిన్ త్రో అతనికి ఇపుడు ప్రొఫెషన్ అయింది. పోలాండ్‌లో గతేడాది జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 86.48 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇది రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేతకంటే మెరుగైన ప్రదర్శన కావడం విశేషం. ఈ ఒక్క రికార్డు అతనికి ఎనలేని కీర్తి తెచ్చింది. నీరజ్ చోప్రాకు ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా ఉద్యోగం లభించింది. అతని కుటుంబ కష్టాలను కడతేర్చింది. అంతేనా... అంటే! నిజమే! ఇంకా వుంది మరి... వచ్చిన జాబ్‌తో సరి అనుకోలేదు. సాధించిన ప్రపంచ రికార్డుతో బ్రేకు వేయలేదు. మరింత మెరుగైన ప్రదర్శనతో మరిన్ని పతకాలతో రాణించాలనుకుంటున్నాడు. అతని ఆశయాన్ని గుర్తించిన ఆర్మీ ఉన్నతాధికారులు సెలవు మంజూరు చేస్తూ బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రానికి పంపారు. బంగారు భవిష్యత్తు కోసం బెస్టాఫ్ లక్ చెప్పారు. వారిచ్చిన ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా శిక్షణలో కష్టపడుతున్నాడు. అలాగని చదువూ మానేయలేదు. దూరవిద్యలో డిగ్రీపై కన్నేశాడు. కెరీర్‌కు బాటలు వేసుకుంటూనే ఉన్నత చదువుకు జైకొడుతున్నాడు. ‘మా కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం లేదు. నాకొచ్చిన ఉద్యోగం వాళ్లను సంతోషంలో ముంచేసింది. మెరుగైన ప్రదర్శన కోసం అత్యుత్తమ శిక్షణ తీసుకుంటున్నా. నా లక్ష్యం వచ్చే ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం. వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలతోపాటు... 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం నా జీవితాశయం. వర్ధమాన అథ్లెట్లకు నేను చెప్పేదొక్కటే... నిషిద్ధ ఉత్ప్రేరకాల ఉచ్చులో పడి దేశ ప్రతిష్టను దిగజార్చవద్దు.’ – నీరజ్ చోప్రా -
లింగ నిష్పత్తిలో గ్రామాలే మెరుగు
న్యూఢిల్లీ: దేశంలో లింగ నిష్పత్తిలో గ్రామీణ ప్రాంతాలు పట్టణాల కన్నా మెరుగైన స్థానంలో ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా లింగ నిష్పత్తి(ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) 991 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 1,009గా ఉండగా పట్టణాల్లో 956గా ఉందని 2015–16 ఏడాదికి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4(ఎన్ఎఫ్హెచ్ఎస్–4) పేర్కొంది. జనన సమయంలో లింగనిష్పత్తి దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 914 నుంచి 919కి పెరగ్గా పట్టణ ప్రాంతాల్లో 899గా నమోదైందని తెలిపింది. హరియాణాలో జనన సమయంలో లింగ నిష్పత్తి 762(2005–06) నుంచి 836కి పెరిగిందని తెలిపింది. కాని అక్కడి గ్రామాల్లో మాత్రం ఇది 785కే పరిమితమైంది. మధ్యప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జనన సమయంలో లింగ నిష్పత్తి 927కి తగ్గింది. పట్టణాల్లో ఇది 899. ఆ రాష్ట్రంలో మొత్తం లింగ నిష్పత్తి 973 కాగా గ్రామాల్లో ఇది 933గా నమోదైంది. రాజస్తాన్ గ్రామాల్లో లింగ నిష్పత్తి 973 కాగా, పట్టణాల్లో 928గా ఉంది. లింగ నిష్పత్తిలో పట్టణాలు, ఇతర ప్రాంతాల మధ్య అంతరం అస్సాంలో స్పష్టంగా కనిపించింది. ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో మొత్తం లింగ నిష్పత్తి 929గా నమోదైంది. -
ఆంధ్ర 217/6
హరియాణాతో రంజీ మ్యాచ్ ముంబై: హరియాణాతో గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్సలో 6 వికెట్లకు 217 చేసింది. డీబీ ప్రశాంత్ (182 బంతుల్లో 74; 9 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (120 బంతుల్లో 62; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, డీబీ రవితేజ (38) ఫర్వాలేదనిపించాడు. హరియాణా బౌలర్ యజువేంద్ర చహల్ (3/57) రాణించాడు. వర్షం ఆటంకం... గువాహటి: హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించడంతో తొలి రోజు 4.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. హిమాచల్ జట్టు 8 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోరుుంది. -
హైదరాబాద్ 102/5
జంషెడ్పూర్: హరియాణా బౌలర్ల ధాటికి తమ రెండో ఇన్నింగ్సలోనూ హైదరాబాద్ జట్టు తడబడుతోంది. రంజీ ట్రోఫీలో భాగంగా శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 46.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోరుు 102 పరుగులు చేసింది. అనిరుధ్ (36 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. అంతకుముందు హరియాణా జట్టు తమ తొలి ఇన్నింగ్సలో 130.4 ఓవర్లలో 331 పరుగులకు ఆలౌటై 140 పరుగుల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ 38 పరుగులు వెనుకబడి ఉండగా చేతిలో ఐదు వికెట్లున్నారుు. ఫాలో ఆన్ ఆడుతున్న ఆంధ్ర కళ్యాణి: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతోఆంధ్ర జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. శనివారం తమ తొలి ఇన్నింగ్సలో ఆంధ్ర 73.2 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటరుుంది. తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులు వెనకబడి ఫాలో ఆన్ ఆడుతూ... రోజు ముగిసే సమయానికి 65 ఓవర్లలో 4 వికెట్లకు 122 పరుగులు చేసింది. భరత్ (177 బంతుల్లో 57; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. -
హరియాణాకు ఆధిక్యం
జంషెడ్పూర్: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సరికి హరియాణా 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. నితిన్ సైని (61), శుభమ్ రోహిల్లా (60) రాణించారు. ఇప్పటికే ఆ జట్టు 45 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యం సాధించింది. కష్టాల్లో ఆంధ్ర... కళ్యాణి: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. డీబీ ప్రశాంత్ (62) అర్ధసెంచరీ సాధించాడు. ఆంధ్ర తొలి ఇన్నింగ్సలో మరో 243 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్సలో ఛత్తీస్‌గఢ్ 394 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు చౌహాన్ (123) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. -
గ్యాంగ్‌రేప్‌ల పై త్రిసభ్య కమిటీ
ఛండీగఢ్/న్యూఢిల్లీ: జాట్ల ఉద్యమం జరుగుతున్న సమయంలో సోనీపట్ జిల్లాలోని ముర్తాల్ వద్ద మహిళలపై అత్యాచారాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు హరియాణా ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఒక డీఐజీ సహా ముగ్గురు మహిళా పోలీసు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ర్ట అదనపు చీఫ్ సెక్రటరీ పీకే దాస్ తెలిపారు. ఈ కమిటీలో డీఐజీ రాజ్శ్రీ సింగ్, డీఎస్పీ భారతీ దబాస్, డీఎస్పీ సురిందర్ కౌర్ సభ్యులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యాచారానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలకు సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అత్యాచారాలకు సంబంధించి ఫిర్యాదులు, సమాచారం అందించాలనుకునేవారు 18001802057 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోల రూపంలో ఆధారాలు ఏమైనా ఉంటే తమకు పంపించాల్సిందిగా పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కానీ ఫిర్యాదులు కానీ తమకు అందలేదని హరియాణా డీజీపీ వైపీ సింఘాల్ పేర్కొన్నారు. అయితే ఏ చిన్న సమాచారం అందినా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 30కి చేరిందని తెలిపారు. ముర్తాల్ అత్యాచార బాధితుల్లో ఢిల్లీకి చెందిన వారు ఎవరైనా ఉంటే న్యాయం కోసం తమ కార్యాలయంలో కాని, లేదా 181 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ సూచించారు. ఆందోళనల్లో భాగంగా జాట్ లు 17 వేల చెట్లను నరికేశారు. -
జనానికేం తెలుసు ఉండేలు దెబ్బ..
సాధారణంగా పోలీసులంటే ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తారు.. అయితే మనం హరియాణాలోని హిస్సార్ జిల్లాకు వెళ్తే మాత్రం పోలీసులు ఇలా తుపాకీ స్థానంలో ఉండేలు పట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ.. కనిపిస్తారు. గొడవలు వంటివి జరిగినప్పుడు జనాన్ని అదుపు చేయడానికి రబ్బరు బులెట్లు, టియర్ గ్యాస్ కంటే ఉండేలే బెటరన్నది వీరి అభిప్రాయం. కారం పొడి నింపిన ప్లాస్టిక్ బాల్స్‌ను ఉండేలుతో జనం మీదకు ప్రయోగిస్తారన్నమాట. ‘రబ్బరు, ప్లాస్టిక్ బులెట్ల వల్ల దెబ్బ గట్టిగా తగులుతుంది. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా. అదే కారంపొడిని చల్లితే చాలు.. జనం చెల్లాచెదురైపోతారు. కారం పొడితో పనికాకుంటే మార్బుల్ బాళ్లను ఉపయోగించాలని చూస్తున్నాం. మార్బుల్ బాల్స్‌ను సైతం బాగా రెచ్చిపోయేవారిపైనే ప్రయోగిస్తాం. పరిస్థితి మరీ అదుపు తప్పితే తప్ప.. రబ్బరు బులెట్లను వాడకూడదని నిర్ణయించాం’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ రావ్ అన్నారు. -
మిశ్రా హ్యాట్రిక్
హరియాణా ఘన విజయం విజయ్ హజారే ట్రోఫీ ఆలూరు (కర్ణాటక): విజయ్ హజారే వన్డే ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హరియాణా 10 వికెట్ల తేడాతో జమ్మూ కశ్మీర్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కశ్మీర్ 22 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. పేసర్ హర్షల్ పటేల్ (5/21) చెలరేగగా, భారత లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/4) కెరీర్లో తొలిసారి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌లోనూ హర్షల్ (29 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించడంతో 11 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 76 పరుగులు చేసిన హరియాణా మరో 234 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకోవడం విశేషం. బెంగళూరులో జరిగిన ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో జార్ఖండ్ 5 వికెట్లతో కేరళను ఓడించింది. కేరళ 8 వికెట్లకు 236 పరుగులు చేయగా, జార్ఖండ్ 5 వికెట్లకు 240 పరుగులు చేసింది. ధోని (18) మళ్లీ విఫలమయ్యాడు. రాజ్‌కోట్: గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ నాలుగు వికెట్లతో బెంగాల్‌ను ఓడించింది. ముందుగా బెంగాల్ 221 పరుగులకు ఆలౌటైంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టిన బెంగాల్ పేసర్ మొహమ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం యూపీ 6 వికెట్లకు 222 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మరోవైపు హైదరాబాద్ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. సర్వీసెస్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. -
తిరగబడ్డ యువతులకు సన్మానం
రోహ్తక్ అక్క చెల్లెళ్లను గౌరవించనున్న హర్యానా సర్కారు చండీగఢ్: బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హరియానా ప్రభుత్వం నిర్ణయిం చింది. వీరికి నగదు బహుమతి అందచేయనున్నట్లు హరియానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఇటీవల హరియానాలో కళాశాలకు వెళుతున్న యువతుల పట్ల ముగ్గురు పోకిరీలు అసభ్య చేష్టలకు దిగటంతో తీవ్రంగా ప్రతిఘటించి బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మిగతా ప్రయాణికులు చేష్టలుడిగి చూస్తున్నా బాధితుల్లో ఓ యువతి బెల్టుతో నిందితులపై తిరగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్‌ను హరియానా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు కుల్దీప్, మోహిత్, దీపక్‌లను డిసెంబర్ 6 వరకు రిమాండ్‌కు తరలించారు. యువతులకు కేంద్ర మంత్రుల ప్రశంసలు యువతులంతా రోహ్తక్ అక్కచెల్లెళ్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు అన్ని రకాలుగా ముప్పు ఉందని ఈ సంఘటనతో తేలిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా, కన్ల్సాకి చెందిన ముగ్గురు నిందితులను 24 గంటల్లోగా విడుదల చేయాలని గ్రామస్తులు హెచ్చరించా రు. తమ గ్రామ యువకులపై తప్పుడు కేసులో బనాయించారని ఆరోపించారు. ఇది వేధింపుల కేసు కాదని, సీట్ల గురించి వివాదమన్నారు.