
చండీగఢ్ : దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు వివిధ ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హరియాణా రోహతక్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్‌ఎల్ ఖట్టర్‌తో కలిసి యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేడుక కావడంతో.. చాలా ఖరీదైన యోగా మ్యాట్స్ తెప్పించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత జనాలు.. యోగా మ్యాట్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఒకరినొకరు తోసుకుంటూ మ్యాట్స్ కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వాలంటీర్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే... వారితో గొడవకు దిగారు.