గతుకులు, గుంతల రోడ్డు కారణంగా అనేక ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. కానీ అదే గుంత మనిషికి ప్రాణం పోసింది. నమ్మ శక్యంగా లేకపోయినా ఇది నిజం. హర్యానాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుసుకుంది.
అనారోగ్య కారణాలతో దర్శన్ సింగ్ బ్రార్ (80)చనిపోయాడు.అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో పాటియాలా నుండి కర్నాల్ సమీపంలోని అతని ఇంటికి తీసుకు వెళుతున్నారు. మరోవైపు అతని బంధువులు అంత్యక్రియలు అన్ని ఏర్పాట్లు చేసేవారు. కానీ విధి మరోలా ఉంది. ఉన్నట్టుండి అంబులెన్స్ గుంతలో పడింది. అదే మృతుడికి ప్రాణం పోసింది. అంబులెన్స్‌లో అతనితో పాటు ఉన్న మనవడు తన తాత చేయి కదలడం గమనించాడు. వెంటనే ఊపిరి పరక్షీంచగా గుండె కొట్టుకోవడంతో వెంటనే బ్రార్‌ను ఆసుపత్రికి తరలించాడు. అతడు బతికే ఉన్నట్లు అక్కడి వైద్యులుప్రకటించారు. కర్నాల్‌లోని ఎన్‌పి రావల్ ఆసుపత్రిలో క్రిటికల్ ICUలో చికిత్స పొందుతున్నాడు.
నిజంగా ఇది అద్భుతం, దేవుడి దయ, ఆయన త్వరగా కోలుకోవాలంటూ బంధువులు కోరుకుంటున్నారు భూమ్మీద ఇంకా నూకలున్నాయి అంటూ సంతాపం తెలపడానికి వచ్చిన బంధువులంతా ఆ కుటుంబాన్ని అభినందించి వెళ్లారు.
క్రిటికల్, కానీ శ్వాస ఉంది
బాధితుడు శ్వాస తీసుకుంటున్నాడు. రక్తపోటుతో పాటు పల్స్ ఉన్నాయి, అయితే ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నందున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రావల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నేత్రపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment